8, ఏప్రిల్ 2015, బుధవారం

బంధం                              కలుషిత మానవ సంబంధాల ఫలితంగా ఉత్పత్తి అయిన అనేక "కొత్త" పదార్ధాలలో సన్యాసం అనేది ముఖ్యమైనది. కలుషిత మానవ సంబంధంలోని కొత్తదనాన్ని కొంత అనుభవించి, ఆనందించే క్రమంలో పాతది నశింపు ప్రారంభం అవుతుంది. పాతది నశిస్తూ, కొత్తది వృద్ధి చెందే క్రమంలో కొత్తదానాన్ని పాతదానిలాగే "శాశ్వతం" చేసుకోవాలి అన్న "తపన" మనిషిలో ప్రారంభం అయింది. ఈ తపన ఫలితంగా ఉత్పత్తి అయిందే "బంధం".

                    "బంధం" అనేది రెండు, లేదా అంతకన్నా ఎక్కువ పదార్ధాలను ఇంకో పదార్ధంతో బంధించేది. మొదట ఎలక్ట్రాన్, ప్రోటాన్ స్వభావంకలిగిన వ్యక్తుల కలయిక ద్వారా ఉత్పత్తి అయిన కృష్ణ పదార్ధం ద్వారా ఈ బంధం ఏర్పడింది. ఈ బంధాన్ని సృష్టించిన వారు ప్రాథమికంగా ఇద్దరు. ఇకడు వైద్యుడూ కాగా, రెండవవాడు ఇంజనీర్. ఆదిలో వీరే మాంత్రికులుగా గుర్తించబడేవారు.