22, ఏప్రిల్ 2015, బుధవారం

శివ పార్వతుల భవిష్యత్తు               ఇలా ప్రకృతిని (స్త్రీ) విడిచి సంపద, అధికారం వైపుకు సాగిన ఆత్మ, అభివృద్ధి తన ప్రారంభం మరచి ముందుకు సాగింది. కాలుష్య బంధాల పీడ నుండి పరిష్కారంగా మొదలైన సన్యాసం కాలుష్యాన్ని మరింత పెంచి, పటిష్టమైన బంధిఖానాలు సృష్టించి అందులో నుండీ ఎలా బయట పడాలో దిక్కు తోచక గింజుకుంటుంది.

                సన్యాసం సృష్టించిన ఈ సంక్షోభానికి ఆది, అంతం ఒక్కటే. సకల సన్యాస వ్యవస్థలకి మూల పురుషుడైన శివుడు, మూల ప్రకృతియైన పార్వతులే ఈ సమస్యకు ఆది, అంతం.

           సృష్టి నిర్మాణంలో కీలక బాధ్యతలను నిర్వహించవలసిన ఈ జంట కలయికను నిరోధించడం ద్వారా మొత్తం అన్ని రకాల మత సన్యాస, వ్యవస్థలు అస్తిత్వంలో ఉన్నాయి.

                    18 శక్తి పీఠాలుగా, ద్వాదశ జ్యోతిర్లింగాలుగా రావణుడి పాలయిన ఆత్మ లింగంగా - ఇలా అనేక రకాలుగా ధ్వంసం అయిన ఈ శక్తి స్వరూపాలు,  తమ వ్యక్తిత్వంలో భాగమైపోయిన పరాయి వ్యక్తిత్వాలు గంగ, నాగుడు, చంద్రుడు లాంటి కాలుష్యాలను తొలగించుకొని స్వచ్చమైన వ్యక్తిత్వాలతో బంధరహిత స్థితిలో ఒకరినొకరు గుర్తించి కలవాలి . లేకపోతే ఆ శక్తులే వినాశకారులుగా పరిణమిస్తున్నాయి. ధర్మ బద్ధంగా జీవించక పోతే శివ పార్వతులే నాశనం అయ్యే స్థితిలో వారున్నారు. తక్షణ సమీప భవిష్యత్తే ఈ అంశాన్ని తేలుస్తుంది.