9, జూన్ 2015, మంగళవారం

మానవుని సమస్య (re publish)

ఒక యూనిట్ లోని ఒక వ్యక్తిత్వం కలిగిన ఆడ, మగ వ్యక్తులు గానీ, వేరే వ్యక్తిత్వం కలిగిన వ్యక్తితోగానీ , వ్యక్తులతో గానీ సంభవించడం ద్వారా వ్యక్తిత్వాల కలయిక అనేది జరుగుతుంది. కలుషితం కావడం అనేది ఇక్కడి నుంచే మొదలయింది.
సొంత స్వభావం, వ్యక్తిత్వం ఉన్న ఆడ, మగల కలయిక తప్ప మిగిలిన కలయికలన్నీ కాలుష్య కారకాలే, బంధ కారకాలే! బంధుత్వం, కులం, గోత్రం, మతం, ప్రాంతం, భాష, కులాంతర, మతాంతర, దేశాంతర, ఖండాంతర - ఇలా అనేక రకాలుగా జరుగుతున్న కలయికలన్నీ కూడా కాలుష్య కారకాలే తప్ప; స్వచ్చమైన, సహజమైన, వ్యక్తిత్వాల కలయికలు కావు అన్నది నేడు మానవాళి గుర్తించవలసిన సత్యం.
 
మానవుడి "సమస్య" ఏమిటి? అనేది ప్రశ్న. మానవుడి సమస్య "కాలుష్యం" . అంటే! మానవుడు "కలుషితం" కావడం అనేది మానవుడి సమస్యకు మూలం- మొదలు.
ఇలా మొదలైన "కలుషిత" మానవ సంబంధాల వలన నేటికీ, ప్రతి వ్యక్తీ తన సొంత "స్వభావాన్ని" వ్యక్తిత్వాన్నీ గ్రహించలేని హీనమైన స్థితికి చేరుకున్నాడు.
ప్రతి మనిషీ ఒక కుటుంబంలో సభ్యుడు. ఈ కుటుంబం అనేది కోట్ల సంఖ్యలో సభ్యులు కలది.
ప్రతీ కుటుంబానికి "అధిపతి " అయిన మానవుడు ఉంటాడు. ఈ మానవుడు బ్రహ్మ, విష్ణు, పరమేశ్వర -సరస్వతి, లక్ష్మి, కాళిక కావచ్చు. యెహోవా, ఏసు, పరిశుద్ధాత్మ కావచ్చు. మహ్మద్, అల్లా కావచ్చు. ఇలా కుటుంబానికి అధిపతులు , దేవతలుగా, ఇలవేల్పులుగా ప్రజలకు సుపరిచితమే. వీరు ఆయా కుటుంబాలకు అధిపతులుగా(Head of the family) ఉంటారు.
ప్రతి వ్యక్తి తన స్వభావాన్ని వ్యక్తిత్వాన్ని తెలుసుకున్న తరువాత, తన యూనిట్‍ను తెలుసుకోగలడు. తద్వారా తన కుటుంబాన్ని తెలుసుకోగలడు. కంటితో చూసి తెలుసుకోగల గుర్తులు, తెలుసుకోవడం అనే ప్రక్రియలో ఒక చిన్న సాధనం మాత్రమే అని ఇక్కడ గుర్తుంచుకోవాలి.
వ్యక్తి తన కుటుంబ సభ్యులను గుర్తించడానికి కూడా ఇక్కడ చిన్న గుర్తు తెలుసుకుందాం. అదేమిటంటే- పాదాల వేళ్ళ నిర్మాణ స్వరూపం. ఇది కుటుంబం మొత్తానికి ఒకేలాగా ఉంటుంది. వ్యక్తి( దేహం) మూలాలు అయిన పాదాలు భూమిపైన ఉంటే, కుటుంబ మూలాలు భూమిలో ఉంటాయి.
కుటుంబంలోని సభ్యులందరూ ఈ కుటుంబ అధిపతితో అవిభాజ్యమైన (విడదీయలేని) భాగాలుగా ఉంటారు. 
భౌతికం అనగా! పంచ భూతాత్మకంగా పిలువబడే దేహాలు అవి ఆడ+ మగ  - ఇవి బౌతిక నేత్రాలతో చూడగలిగినవి.
భూమి, సముద్రం, నక్షత్రాలు, గ్రహాలు - ఉపగ్రహాలు, ఉల్కలు, రాయీ, ఇనుము, బంగారం మొదలైనవి సమస్త వస్తు, జీవజాలం అంతటి లోనూ స్త్రీ , పురుష "శక్తి" సామర్ధ్యం ఇమిడి ఉంటుంది.
    రాయి అనే పదార్థానికి మూలం రాయి అనే వ్యక్తిత్వం ( కారెక్టర్) కలిగిన ఆత్మ, ప్రకృతి స్వరూపాలయిన ఆడ, మగ- ఇవి ఒకే జంట అయి ఉంటుంది. ఈ జంట అనేది సహజమైంది, స్వచ్ఛమైంది.
     అధి భౌతికం అనగా అంతర్ నేత్రంగా పిలువబడే నేత్రాలతో మాత్రమే చూడగలిగిన దేహాలు,  ప్రకృతి + పురుష లేదా, శక్తి స్వరూపం + ఆత్మ స్వరూపం.
     ప్రతి వ్యక్తికీ భౌతికం, అధి భౌతికం అనే ఈ రెండు రూపాలు ఉంటాయి.
     ఈ రెండు రూపాలకు ఆధారమైన మూల స్వరూపాలు ఉంటాయి. వాటి కేంద్రాలు వేరు వేరుగా ఉంటాయి. స్త్రీలకు మూల ప్రకృతి మూలంలో స్థానం ఉంటుంది. భౌతిక ప్రపంచం అనేది ప్రకృతి యొక్క స్వరూపం. దీనికి మూలం "భూమి" . ఆత్మలకు మూలం దైవం అనే వ్యక్తిత్వం కలిగిన దైవాత్ముడు ఆత్మలకు మూల స్థానం.
      వ్యక్తి అస్తిత్వం అనేది వ్యక్తి యొక్క మూల స్వరూపాలకు భౌతిక స్వరూప ప్రతినిధి. ఆత్మ మూలాలను ప్రకృతి మూలాలను, కలిపే జంక్షన్ ఆడ, మగ వ్యక్తులు.
     ఈ వ్యక్తి " పునాది " ఆధారంగా విశ్వంలో వ్యక్తికి అనేక స్థావరాలు, అనేక అస్తిత్వాలు ఉన్నాయి. విశ్వ వ్యాప్తమై ఉన్న "వ్యక్తిత్వం" గురించి ఈ సందర్భంలో తెలియజేయబడటం లేదు. అయినా ఈ విషయం దృష్టిలో ఉంచుకొని ముందుకు సాగాలి.
    కోట్ల సంఖ్యలో వ్యక్తులు గల కుటుంబాలు వేల సంఖ్యలో భూమి కేంద్రంగా నివసిస్తున్నాయి.   

కామెంట్‌లు లేవు: