16, ఏప్రిల్ 2015, గురువారం

సన్యాసం ఉనికిలోకి తెచ్చిన భ్రమలు                     అయితే సన్యాసం ద్వారా కొన్ని భ్రమలు బాగా ప్రచారంలోకి వచ్చాయి. వాటిలో మచ్చుకు కొన్ని-

- దైవాన్ని తెలుసుకోవడం, దైవంలో "ఐక్యం" కావడం
- ఈ విశ్వం అనే బంధం నుండి "మోక్షం" సంపాదించడం
- మానవ స్థితి నుండి "దైవత్వం" అనే స్థితికి ఎదగడం.
- సర్వం త్యజించి, భౌతిక, తుచ్చమైన రాగ, ద్వేషాలకు అతీతంగా "నిత్యానంద" స్థితిని అనుభవించే స్థాయికి చేరడం.
- లోక కళ్యాణం కోసం

            సన్యాసం ఎందుకు తీసుకున్నారు, అనే ప్రశ్నకు సమాధానంగా ఇలాంటివి ప్రచారంలో ఉన్నాయి. 

                      వాస్తవం ఏమంటే- సన్యాసులు స్త్రీ ద్వారా భౌతిక బంధంలో చిక్కుకోకుండా వారి శక్తిని వినియోగించుకుంటున్నారు. తీవ్ర స్థాయిలో ఆత్మ యొక్క బలాన్ని పెంచుకుంటూ, పూర్తిగా తమ ఆధీనంలో ఉండే ప్రపంచాన్ని సృష్టించుకుంటున్నారు. ఈ రకమైన అభివృద్ధి ఫలితంగానే ప్రకృతి తీవ్ర విధ్వంసాలకు గురవుతూ, పతనం అవుతోంది. ఓ పాత చైనా సామెత ఈ సన్యాస వ్యవస్థకు సరిగ్గా సరిపోతుంది. అది ఏమంటే- "వేరు శూన్యం, కాడ సన్నం, ఆకు మందం"