మనిషి గురించి "సంపూర్ణంగా" తెలియజేయడం, మనిషి సమస్యలు వివరించి దానికి పరిష్కారం తెలియజేయడం, భవిష్యత్తులో "సమస్యలు" రాకుండా ఎలా జీవించాలో తెలియజేయడం మానవశాస్త్రపు "లక్ష్యం" ...
13, ఏప్రిల్ 2015, సోమవారం
"బంధమే కోరికలకు మూలం" "కోరికలే సమస్త అనర్ధాలకు మూలం"
వ్యక్తి తన సొంతమైన దానిని వదులుకొని ఆ స్థానంలోకి మరొక పదార్ధాన్ని తెచ్చుకోవడానికి ప్రయత్నించడం వల్లనే ఈ స్థితి వచ్చింది. ఎలాగంటే x అనే వ్యక్తి, y అనే వ్యక్తి నుండో, a అనే వ్యక్తి నుండో లోటును పూడ్చాలి అని కోరుకుంటే, దానికి వారు సహకరించినపుడు, x దానిని తస్కరించి అయినా లేదా, బంధం ద్వారా తాను పొందే అధిక శక్తి, సామర్ధ్యాలతో వారిపై దాడి చేసి అయినా తెచ్చుకోవాలి అన్న ఆలోచన x కు పుడుతుంది. నష్టం ఉండే వ్యాపారం ఎవ్వరూ చేయరు కదా!
నేడు సమాజంలో మనం చూస్తున్న సమస్త రుగ్మతలూ బంధం ద్వారానే వ్యవస్థీ్కృతం చేయబడ్డాయి. అందుకే నేడు సమాజంలో రుగ్మతలకు ప్రజల నుండి బహిరంగంగానో, రహస్యంగానో మద్ధతు ఉంటుంది. మరీ నీచమైన పనులను కూడా కొందరు ఎందుకు సమర్ధిస్తారు అని అమాయక మేధావులు తలలు పట్టుకుంటుంటారు. వారికి తెలియని కారణం బంధం యొక్క స్వరూపం. దాని ద్వారా లబ్ధి పొందే వారి సంఖ్య, నష్టపోయే వారి సంఖ్య ఎంత ఉంటుందో ఎవ్వరికీ తెలియదు. అది ఒక్కోసారి కోట్లాది జనాభాగా ఉంటుంది.
నాది అనేది ఏదైనా నా నుండి వేరైనా, నాది కానిది ఏదైనా నాతో చేరినా, అది బంధం అవుతుంది. వ్యక్తికి లాభం, నష్టం అనేవి బంధం ద్వారా మాత్రమే కలుగుతాయి.
"బంధమే కోరికలకు మూలం"
"కోరికలే సమస్త అనర్ధాలకు మూలం"
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి