27, మార్చి 2015, శుక్రవారం

పవిత్ర కుటుంబం HOLY FAMILY



సృష్టి ఆదిలో కుటుంబాలు కాలుష్య రహితంగా ఉన్నాయి. భూమిలోనూ భూమిపైనా జీవరాశికి సంబంధించిన ప్రతి కుటుంబం జీవించడానికి సొంత ఆస్థి ఉంది. సొంత ఆస్థి అనగా - భూమి, ప్రకృతి, పశు పక్ష్యాదులు, పనిముట్లు, వాహనాలు. ఇలా ఆ మానవుడి సొంత కుటుంబానికి అవసరమైన సమస్తం.

ఆ కుటుంబం యొక్క సొంత ఆస్థులు అవిభాజ్యమైన భాగాలు. కుటుంబానికి సంబంధించిన సొంత ఆస్థి యొక్క స్థిరాస్థులన్నీ, వాటి స్థిర రూపాలతో ఆ కుటుంబం యొక్క అధిపతి మానవుడి ప్రకృతి  మూల స్వరూపాధీనంలోనూ, అలాగే ఆత్మ మూల స్వరూపాధీనంలోనూ ఉంటాయి. వాటి వ్యక్త రూపాలుగా భూమిపైన వారి స్వంత నేల, వ్యక్తులు, సాధనాలు, నీరు, జీవ జాతులు ఉంటాయి. ఇదీ పవిత్ర కుటుంబమం అంటే. పరాయితనం లేని స్వచ్చమైన ఈ కుటుంబం యొక్క సహజ నిర్మాణ అస్థిత్వ స్వరూపమే పవిత్ర కుటుంబం.

వ్యక్తి యొక్క గతమంతా ఆ వ్యక్తి ప్రకృతిలో ఙ్ఞాపకంగా నమోదయి ఉంటుంది. పాత విషయాలను రికార్డులను చూసి తెలుసుకోగలిగినట్లు, ప్రతి వ్యక్తీ తన గతాన్ని తెలుసుకొనగలిగే సదుపాయం ఉంది.

"నేను" అంటే - ఈ కుటుంబం యొక్క సంఫూర్ణ స్వరూపంలో ఒక పరమాణు విభాగం మాత్రమే. అంటే పరమాణువులోని ఋణ, ధనాత్మక స్వభావాలలో ఒకటి మాత్రమే.

వ్యక్తి తన కుటుంబం యొక్క అవిభాజ్యమైన మొత్తంలో ఒక భాగం. కుటుంబం యొక్క సొంత ఆస్థిలో ప్రతి వ్యక్తిత్వానికీ ఖచ్చితమైన వ్యక్తిగతమైన సొంత ఆస్థి అనేది ఉంటుంది. వ్యక్తి- వ్యక్తిగత సొంత ఆస్థి; కుటుంబం, కుటుంబ సొంత ఆస్థి అనేవి అవిభాజ్యమైనవి. ఒక అవయవం ఎలాంటిదో; అతనికి,  అతని వ్యక్తిగత ఆస్థి కూడా అలాంటిదే. వ్యక్తిత్వం అనేది కేవలం వ్యక్తి దేహంలోనో లేదా ఆత్మలోనో మాత్రమే ఉండేది కాదు. అతని సొంత ఆస్థిలోనూ ఉంటుంది.

కామెంట్‌లు లేవు: