18, ఏప్రిల్ 2015, శనివారం

సన్యాసి చేసే దుర్మార్గాలు                     ఒక వ్యక్తి సన్యసించడం కోసం చేసే కఠోర సాధనాల వెనుక ఉన్న దుర్మార్గం గురించి ఇక్కడ తెలుసుకోవాలి. ఒక యూనిట్‍లోనూ, కుటుంబంలోనూ, అవిభాజ్యమైన వ్యక్తి నిద్ర, ఆహారం తగ్గించి; లేదా మానేసి కఠోర సాధన చేయడం మొదలు పెడతాడు.


                 ఈ సాధనలో వ్యక్తి సాధించవలసినది దేహపరమైన సంవేదనలు అయిన ఆకలి, విశ్రాంతి, కామం, నిద్ర, మనస్సు పరమైన ఆలోచనలు - ఇలాంటి వాటిని తన అదుపులోనికి తెచ్చుకోవడం ముఖ్యం. వీటి కంటే వ్యక్తి యొక్క రెండో సగం ( స్త్రీ గానీ పురుషుడు గానీ) యొక్క ఆకర్షణ శక్తికి లోను కాకుండా తనను తాను ఉంచుకోగలగడం అత్యంత ముఖ్యమైన విషయం.

                   ఒక వ్యక్తి భోజనం చేయక పోతే ఆ లోటు మొదట అతని సొంత స్త్రీ పైన ఆ భారం పడుతుంది. ఆమె అదనంగా ఆహారం తీసుకోవలసి వస్తుంది. తర్వాత ఆ లోటును ఆ వ్యక్తి యొక్క యూనిట్ సభ్యులైన మిగిలిన నలుగురు కూడా భర్తీ చేయవలసి వస్తుంది.

                     ఆ వ్యక్తి నిద్ర మాని సాధన చేయడం మొదలు పెడతాడు. దానికి కావలసిన శక్తి , బలం తన యూనిట్ నుండే అతనికి అందుతూ ఉంటుంది. అతడి స్త్రీతో పాటు యూనిట్ సభ్యులకూ కలత కూడిన నిద్ర, నిద్ర లేచిన తర్వాత రాత్రంతా పని చేసి న ట్లు అలసట అనేవి వారికి అనుభవంలోకి వస్తాయి.

               ఈ కొత్త పరిస్థితి వలన వ్యక్తిలో యూనిట్ లో కుటుంబంలో ఘర్షణ మొదలవుతుంది. వ్యక్తి అందుబాటులో ఉంటే ఇది భాహ్యంగానే జరుగుతుంది. ఆ వ్యక్తి ఈ భాహ్య సంఘర్షణ నుండి తప్పించుకొని సుదూర తీరాలకు పోయి ఉంటే ఈ  ఘర్షణ  అంతర్గత ఘర్షణగానే కొనసాగుతుంది.

 "మొండి వాడు రాజు కన్నా బలవంతుడు" - ఈ సామెత ఇలాంటి వారి వల్లనే పుట్టింది. తన యూనిట్ సభ్యులైన స్త్రీ, పురుషుల ( ఆత్మ, ప్రకృతి) శక్తితో; వారితోనే రేయింబవళ్ళు ఘర్షణ పడే అతనితో యూనిట్ సభ్యులు రాజీ పడి పోతారు. అతడిని పూర్తిగా వదిలేస్తారు ఘర్షణ పడకుండా.

ఎందుకంటే మిగిలిన వారు జీవనం కోసం శ్రమించాలి. కుటుంబ పోషణ, రక్షణ చూసుకోవడం లాంటి బాధ్యతలు ఉంటాయి కాబట్టి. వీరికున్న ఈ బలహీనత సన్యాసి కాదలచుకున్నవ్యక్తి యొక్క బలం.

సన్యాసి ఒక మెట్టు అధిరోహించాడు. తన యూనిట్ నుండి శారీరక, మానసిక, ఆత్మిక అవసరాల కోసం ఇబ్బంది పెట్టకుండా ఒప్పందం కుదుర్చుకొని మొత్తం యూనిట్ ను తన అదుపులోకి తీసుకుంటాడు. సన్యాసం తీసుకున్న వ్యక్తి యొక్క ఆత్మ ఇక, విరామం, విశ్రాంతి లేకుండానూతన నిర్మాణం మొదలు పెడతాడు. దానికవసరమైన నూతన విఙ్ఞాన ఆర్జన చేయడం ప్రారంభిస్తుంది