17, ఏప్రిల్ 2015, శుక్రవారం

సన్యాసుల గొంతెమ్మ కోరికలు                         ప్రకృతి పురుషుడి  భోగ వస్తువనే భావన కూడా జనంలో పాతుక పోయి ఉంది.

                                          ప్రకృతి స్వరూపం అయిన భౌతిక దేహమే లేని స్థితి నుండి, జనన, మరణ చట్రం నుండి, శాశ్వతంగా తప్పించుకోవాలనీ, అమరత్వం సంపాదించాలనీ ఇలాంటివెన్నో  అసాధ్యమైన గొంతెమ్మ కోరికల్తో సన్యాసులు జీవిస్తున్నారు. ఈ కోరికల వికృత ఫలితాలను గుర్తించగలిగే భౌతిక దృష్టి వీరికి పూర్తిగా మసక బారిపోయింది. ఈ హ్రస్వ దృష్టిగాళ్ళు, అహం బ్రహ్మస్మి, ఆయ మాత్మా బ్రహ్మ లాంటి గంభీరమైన పంచ్ డైలాగులతో "నేనే దేవుడు" అని విర్రవీగగలుగుతున్నారు.

                                         బంధాల వలన దైవాత్మ కూడా మిగిలిన అన్ని ఆత్మలలోనూ ఎంతో ప్రతిఫలిస్తుంది. సెంటు పూసుకున్న వాడిని కౌగిలించుకుంటే మనకూ సెంటు వాసన అంటుతుంది. అలాగే వ్యక్తి తాను ఫలానా వ్యక్తిత్వం కలిగిన, ఆత్మ స్వరూపమైన జీవిని అన్నది మరచిపోయి చాలాకాలమే అయిపోయింది అందుకే, అంటుకున్న సెంటులా తనలో ప్రతిఫలించే దైవ పదార్ధాన్ని గుర్తించి తానే దైవం అనీ, లేదా తాను కూడా దైవమే అనే అత్యున్నత భ్రమలో నేడు సన్యాసి బతుకుతున్నాడు.