7, నవంబర్ 2015, శనివారం

త్వరలో ప్రచురితం కానున్న "మానవ శాస్త్రం" పుస్తకానికి డా. లెనిన్ ధనిశెట్టి రాసిన ముందుమాట.
1

పది హేడో శతాబ్ధంలో వీరబ్రహ్మేంద్రస్వామి తన ప్రియ శిష్యున్నో మాట అడిగాడు. లోకమెట్టుందిరా సిద్ధా? అని.

ఎవరి లోకంలో వారుండారు స్వామి! అని సిద్ధయ్య సమాధానం.

ఎవరి లోకంలో వారుంటూ వాటిని ఎవరికి వారే కాపాడుకుంటూ ఈ లోకంలో అందరం వొకటిగా బతకాల్సి రావడం ఎంత దుర్మార్గం... ఆత్మ వంచన???

వ్యక్తిగత వైయుక్తిక లోకాలనూ అందులో ఆయా వ్యక్తులూ/ కుటూంబాలు స్థాపించుకున్న సామ్రాజ్యాలను నిర్ధయగా / నిర్ధాక్షిణ్యంగా / నిరంకుశంగా/ కూల్చేందుకు విజయభాస్కర్ ప్రతిపాదించిన వొక రఫ్ డ్రాఫ్ట్/ ముసాయిదా ప్రకటన / చర్చా పత్రం ఈ మానవశాస్త్రం.


2

యిన్ని శతాబ్ధాలుగా ఆధ్యాత్మిక/ ఆత్మిక ఙ్ఞానం పేరుతో ప్రచారమవుతున్న అసత్య ఙ్ఞానమంతా ఎవడి/ ఎవరి లోకాల్ని వారు భద్రపరుచుకోవడం కోసం, అత్యంత జాగ్రత్తతో కాపాడుకోవడం కోసం అమాయిక వ్యక్తుల మానసిక, భావ దాస్యాన్ని విపరీతంగా పెంచుతూ భ్రమాజనిత వ్యక్తిగత లోకాలను అత్యంత సృజనాత్మకంగా, అద్భుతంగా శక్తి దోపిడితో నిర్మించేండదుకు పనిచేసింది. యిక మీదట యిది కుదరదు. పర్సనల్ ప్రపంచాల/ లోకాల ధ్వంసం ప్రారంభమయ్యింది. వూహలు/ విశ్వాసాలు మారతాయో, ఆత్మహత్య చేసుకొని మరణిస్తాయో అవే తేల్చుకోవాలసిన సందిగ్ధ సందర్భం ఈ రఫ్ డ్రాఫ్ట్ సిద్ధమైన క్షణమే మొదలయ్యింది. యిందుకు సమాంతరంగా ఆయా వైయక్తిక మానవ లోకాల్ని సజావుగా నడిపిస్తున్న మానవ భాషలోని చాయిస్/ ఎంపిక అనే రెండు పదాలు అంతమైన ఈ చారిత్రక సందర్భమే మానవ శాస్త్ర ఆవిర్భావం. యిన్ని శతాబ్ధాల, యేళ్ళకు యేళ్ళ మీ తాత్విక ఙ్ఞానం మీకేమిచ్చింది... ఏం మిగిల్చింది??.. విప్లవ వైఫల్యాలు, విఫల ప్రేమలు, ఎయిడ్స్ లు, క్యాన్సర్‍లు , బ్రెయిన్ ట్యూమర్‍లు / స్ట్రోక్‍లు, ప్యాకెట్ పాలు, వ్యభిచారము, ఆత్మ విమర్శనా ఎత్తుగడలు, అబార్షన్‍లు, 498A/ దొంగ ఎస్టీఎస్సీ కేసులు, ఫేస్ బుక్‍లు, బైపాస్ సర్జరీలు, నరాల వత్తిడి జబ్బులు, శీఘ్ర స్ఖలనాలు, వాట్సప్‍లు, సాయంకాల భక్తి ప్రవచనాలు, అగ్ర వర్ణ ప్రేరేపిత దళిత ఉద్యమాలు, తిబులెక్స్ డాట్ కామ్‍లు, అంగ స్థంభనలు- వీటినుంచి మిమ్మల్ని ఏ సిద్ధ సమాధులు, యోగాలు, ధ్యానాలు, ఆర్టాఫ్ లివింగ్‍/ రిలాక్సేషన్ టెక్నిక్‍లు, టక్కు టమారాలు, ఆవు వుచ్చ తాగడాలు కాపాడలేవు గాక కాపాడలేవు... ముండ నాకొడుకుల్లారా...మిమ్మల్ని కాపాడనే లేవు. మీ లోకాల్ని మీరు మండే అగ్ని పర్వతాలపై వుంచి వాటిని చల్లగా కాపాడమని ధర్మం రూపంలోని అధర్మాన్ని, దెయాల రూపంలో చరిస్తున్న మీ ముక్కోటి దేవతల్ని, దేవుళ్ళను ఎంత సాగిల పడి అడుక్కొని అడుక్కొని ప్రార్ధించినా/ నోములు నోచి పూజలు చేసినా సమాధానం దొరకదు. బచ్చా నాకొడకుల్లారా కూలిపోతాయి దొంగ లంజా కొడుకుల్లారా మీ కంకాళాలు బద్ధలై కోటాను కోట్ల ధూళి కణాలై ఆ నిసి నిశీధి ధూమంలో విశ్వాంతరాలలో కొట్టుకపోయి కనుమరుగైపోతుంది. యిది శాపమో, ఆగ్రహ ప్రకటనో కాదు. మానవ శాస్త్రాద్యయన జనిత స్థిర సత్య సంకల్ప ప్రకటన. ఎరిగీ ..తెలిసీ చేస్తున్న విస్పష్ట విపాట విస్పోటన.

3

నిన్ను నువ్వు తెలుసుకో/అహంబ్రహ్మస్మి/ఖుదాకీదువా/సబ్‍కామాలిక్ ఏక్ హై/ ప్రైస్ దలార్డ్/ స్తోత్రము ప్రభువా/ గతము నుండి విముక్తి/ ట్రూత్ ఈజ్ ప్యాథ్ లెస్ ల్యాండ్/ ప్రకృతి చికిత్స/ సర్ప దోష పూజలు/ యిటువంటి మహా కావ్యాలూ... కార్యాలూ...మహా మహా పూజలూ... పునస్కారాలూ... క్రతువులూ,... కర్మకాండలూ,...మిమ్మల్ని రక్షించలేవు. కాకుంటే, మిమ్మల్ని మరింత వ్యబిచారుల్లా/ ఆత్మ వంచక హంతకుల్లా... యిప్పటికే  అలా మారిపోయిన మీ దేవుళ్ళలా తయారు చేయవలిసిందే. మీ అంతిమ ప్రయత్నం, ప్రయాణం, ప్రయాస, మీ గురువుల బోధలూ అన్నీ మిమ్మల్ని బతికుండగా సాధ్యమైనంతవరకూ  మీలోని జీవకళను చంపి... శవాలుగా మార్చేందుకే. మీ అహంకారాలని పక్కన పెట్టి మానవశాస్త్రాన్ని మనసారా అధ్యయనం చేయండి. అనుగ్రహం ఉంటే అర్థమయ్యే తీరాలి. యిన్నేళ్ళ మీ తాత్వికత,/ గురువులు/ స్వాములు/ బాబాలు/ పత్రికలు/ భక్తి చానెళ్ళు యింకా అనేకానేక నిత్య రోగగ్రస్త చెత్త నాకొడుకులు సత్యం/ ధర్మం/ ఆత్మ/ పరమాత్మ లాంటి అత్యంత సరళమైన పదాలను / పదార్ధాలను అర్థం చేసుకొనే వ్యవహారాన్ని అత్యంత క్లిష్టంగా మార్చి పారేశారు. వర్గాలుగా, కులాలుగా, కుటుంబాలుగా విడిపోయిన / పోతున్న వ్యక్తులకు అసలైన మిత్రులెవరో? శత్రులెవరో ? తెలీనీకుండా నిరంతరం 24x7 అత్యంత సృజనాత్మకంగా డి.టి. ఎస్ డోల్బై లో నడుస్తున్న ఎచ్ ఎచ్ డి కాస్మిక్ సినిమాను నడిపిస్తునదెవరో వారికి బానిసలుగా మారిన పాత్రలేవో ? ఆ పాత్రలకు సూత్రదారులెవరో ? చాలా సింపుల్‍గా మానవ శాస్త్రం మీకు వివరిస్తుంది. సామాజిక కాలుష్య బంధాల నుండి విముక్తినిస్తుంది.

4

మచ్చా/బామ్మర్దీ... యిది అనంతమూ, అమేయమూ, అబేధ్యమూ అంతిమమూ అని నేను ప్రవచించడం లేదు. సత్యాన్ని అర్థం చేసుకోవడం మంచి నీళ్ళు తాగినంత సులభతరము చేసిన మానవ శాస్త్రానికి వ్యాఖ్యలు/ పునర్ వ్యాఖ్యానాలు చేయదలుచుకోలేదు. నా అనుభవంలోని ఒకటి మాత్రం సత్యం. మూడు వందల సంవత్సరాల తర్వాతా, అంతకు ముందూ ఉండే సమస్త తాత్విక అఙ్ఞానాన్ని పూర్వ పక్షం చేస్తూ ... వాటి పునాదులను కుదిపి వేస్తూ ... కూకటి వేళ్ళతో కుళ్ళగించే మానవ శాస్త్ర అధ్యయన ఆయుధ విన్యాస శక్తితో భ్రమలుడిగిన వర్తమానంలో నేల మీద నిలిచే నేను మాట్లాడుతున్నాను. తన కాలం నాటికి మార్క్స్ శ్రమ దోపిడీ గురించి మాత్రమే చెప్పాడు. యిప్పుడు... యింత కాలం తర్వాత భాస్కర్, శ్రమకు అసలైన/ ఏకైక కారణమైన "శక్తి" గురించీ దాని అఖండమైన పరివర్తన గురించీ చెబుతున్నాడు.... చెవొగ్గి ఆలకించండి...మైడియర్ ఇన్‍గ్లోరియస్ బాస్టర్డ్స్ !  తేడా తెలుస్తుందా... లుచ్చాల దగ్గర మీ ఆత్మలు కుదవ పెట్టి పిడికెడు కరెన్సీ నోట్ల జీతం కోసం వారి మర్మాంగావయవాలను చీకుతూ... నాకుతూ ....చప్పరిస్తూ ప్రజలకు మీ వచనాల్లో నిరంతరం నీతి మార్గాలు బోధించే పరమ నీచ్ కమీన్ నికృష్టపు నాకొడకల్లారా...మిమ్మల్ని మీకూ, మీ ఆనందాన్ని మీకూ కాకుండా చేస్తున్న విశ్వ ఐమాక్స్ మూవీ దళారి దర్శకులను, నిర్మాతలను వారి దోపిడీ దారులను ధ్వంసం చేస్తూ సత్యాన్ని బహిర్గతం చేసి మనల్ని మన/ వారి అదృశ్య ట్రాప్స్ నుండి తప్పించే తరుణోపాయమిది. దీన్ని చదవమని నేను మిమ్మల్ని అడుక్కోవడంలేదు. అది బిక్షగాళ్ళ పని. సత్యంతో ధర్మబద్ధంగా జీవించాలని సహజాతి సహజ తపన చావకుండా ఏ మూలో పడి కొట్టుమిట్టడుతున్న వాళ్ళందరూ ఏదో ఒక రోజు అప్రయత్నంగా ... అన్యాపదేశంగా ... దీన్ని అధ్యయనం చేసి అవగాహించుకోవలసిందే.... యిది అనివార్యం. దీన్ని ఎవరూ ఆపలేరు. యిది భాస్కర నిర్ణయం. ఆ సంకల్పాన్నే నేను నిరంతరం ఆవాహన చేస్తున్నాను. పరంపరాగతంగా వస్తూ, అస్తిత్వంలో ఉన్న మీ తాత్విక ఙ్ఞానం దాని ఆచరణ పద్ధతులు పది వేల సంవత్సరాలుగా మిమ్మల్ని వ్యభిచారులుగా, బిక్షగాళ్ళుగా, యాచకులుగా, నిరంతర పరాన్నజీవులు/ పరాధీనులుగా రెప్పపాటు వేగంలో క్షణక్షణమూ మార్చేస్తున్నాయి/ మార్చేందుకు తమ శ్రమని విపరీతంగా ఖర్చు చేస్తున్నాయి. యిలా, యిలాగే వుండడానికి అలవాటు పడిన వారందరికీ "ఎంపిక" ప్రశ్నే లేకుండా చేస్తుందీ మానవశాస్త్రం. ప్రత్యామ్నాయం లేదు... పక్క దారుల్లేవు... బైపాస్ రోడ్లు లేవు... టు బీ  ఆర్ నాట్ టూ బీ అనే హేమ్లేట్ల స్వవిధ్వంసాన్ని మనమింక చూస్తాం. రాజీ ప్రసక్తే లేదు బాస్.

యుద్ధం మొదలయ్యింది డూడ్ !!! మొదలయ్యింది..... యిక నోబడీ కెన్ సేవ్ యువర్ సోల్స్ అండ్ ఫక్కింగ్ ఫిలాసఫీస్....


కామ్రేడ్స్! ప్రస్తుత ప్రపంచ దారుణ పరిస్థితికి ... అధ్బుతమైన సమకాలీన అభివృద్ధికీ మనమందరం సమానంగా బాధ్యత వహించాల్సిందే... గతాన్నంతా పోగు చేసుకున్న మన డిఎన్‍ఏలే వర్తమాన ప్రపంచాన్ని స్వయంగా పరిణమింప జేస్తున్నాయి. వాటిలోని బహురహస్య అంతరాంతరాలలోని మారు మూలలల్లోని చీకటి కోణాల రహస్యాలపై లేజర్ లైట్లు వేసి మెరుపులు మెరిపించే మానవ శాస్త్రాన్ని గురించి ఆలోచించండి. కాల్పనిక ఆదర్శాలతో నిండి పోయి, కుళ్ళి కునారిల్లుతూ నిరంతరం భయంతో చస్తూ ...చస్తూ  చావలేక బతుకులీడుస్తున్న స్వార్థపూరిత వైయుక్తిక లోకాలను బద్ధలు చేయడం కంటే వేరే కర్తవ్యం మనకు లేదు. లెటజ్ థింక్ ఓవర్ ఇట్.


పది వేల సంవత్సరాల పారమార్థికతను పతనం చేసి ధ్వంసం చేస్తే పోయేదేం లేదు... రోగ గ్రస్తుల్ని చేస్తున్న బంధాలు, సంబంధాలూ తప్ప

16, జూన్ 2015, మంగళవారం

స్వంత పిల్లలు ( republish)

                                     పిల్లల పట్ల తల్లితండ్రులు ఎందుకు వ్యాపార ధోరణులతో ఆలోచిస్తారు, నిర్ధాక్షణ్యంగా ప్రవర్తిస్తారు. కుల, మత, జాతి బేధాలతో పెంచుతారు. 
                 పిల్లల తమ జీవనాధారం కోసం ఎంచుకొనే వృత్తి , తమ భవిష్యత్తు అయిన  "వివాహం" లాంటివన్నీ ఎందుకు తల్లితండ్రుల, కుల, మత పెద్దలు తమ అదుపులో ఉంచుకోవాలని చూస్తారు?
ఎందుకంటే?
                 పిల్లలు అనేవారు, కన్న బిడ్డలే కానీ ఆ వ్యక్తుల " స్వంతపిల్లల్ని వారు కనడంలేదు. అసలు వ్యక్తులకు స్వంత పిల్లలు ఉంటారన్న ఙ్ఞాపకత్వ లేదు! ఈ వ్యాపార జీవితంలో వేల సంవత్సరాల క్రిందటే అమ్మేసారు.
                   "స్వంతం" అయిన దాన్ని అమ్మేసి పరాయిని స్వంతం చేసుకొని పరాయీకరణపాలై నానా హింసలు, వేదనలు అనుభవిస్తున్న మానవాళి "విషాద" మహా ప్రస్తానానికి చరమ గీతం ఈ పుస్తకం.
                                        వ్యక్తుల చర్యలను నియంత్రించేది , ఇష్టా ఇష్టాలను నిర్ణయించేది, వ్యక్తికి వచ్చే ఆలోచనలు, ఉద్వేగాలు, ద్వేషం యొక్క స్థితి, గతి, ఆరోగ్య, అనారోగ్యాలు మొదలైనవి అన్నీ కూడా వ్యక్తి యొక్క కుటుంబం ద్వారా జరుగుతాయి. ఓటు హక్కును వినియోగించుకోవడం లాంటి ప్రక్రియలు ఇలానే జరుగుతాయి. రోడ్లపైన అడుక్కునే బిచ్చగాడి నుండి; చిరిగిన, మాసిన బట్టలతో జుట్టు, గడ్డం పెంచి నిర్ధిష్టమైన పరిధిలో సంచరిస్తూ,పిచ్చివారిలా కనిపించేవారైనా, కన్న తల్లితండ్రులను వదిలి హిమాలయాలలో ఘోర తపస్సులు చేసే అఘోరాలైనా,తీవ్ర వాదులైనా తమ కుటుంబ ప్రయోజనాల కోసమే   ఉంటారు. అంతే తప్ప, వ్యక్తులు అనుకున్నట్లుగానో, లేదా వారు చెప్పినట్లుగానో, అవి స్వేచ్చాయుత స్వతంత్ర్య చర్యలు కావు. వారు కుటుంబ అధిపతుల యొక్క ఆఙ్ఞల మేరకే, వారి కను సన్నలలోనే ఉంటారు అనేది బహిర్గతం కావలసిన "సత్యం".
                                                 ఒక వ్యక్తి తన ఆధీనంలో ఉండడం, ఉండలేక పోవడం అనే సమస్య వుంది. కనురెప్ప కదలికల మొదలు, నడక ,మాట, నిద్ర, ఆలోచన, అంతిమంగా తాను ఎలా జీవించాలి, మరణించాలి అనే సమస్త వ్యక్తి ప్రక్రియలు ఏవీ ఆ వ్యక్తి ఆధీనంలో ఉండవు. అన్నీ పరాధీనమై ఎవరో,  ఎలానో కూడా తెలియకుండా; తెలుసుకోలేని  స్థితిలో పరుల చేత నియంత్రించబడే యంత్ర స్థితికి చేరుకున్న వ్యక్తికి స్వాతంత్ర్యం, స్వాధీనం లాంటి పదాలకు అర్థం తెలిసే స్థితే లేదు. 
                                             వ్యక్తికే తెలియనన్ని రూపాలతో వ్యక్తి జీవితం మొత్తం నియంత్రిస్తూ ఉంటే వాటి నుండి బయట పడకుండానే స్వేచ్చ గురించి తపించడం అర్థ రహితం.

12, జూన్ 2015, శుక్రవారం

స్వేచ్చ ( republish)

        
                                     నేడు చలామణిలో ఉన్న వ్యక్తి స్వేచ్చ అనేది తప్పుడు భావన, అర్థ రహితం.

                స్వ+ఇచ్చ= స్వేచ్చ, ఆంగ్లంలో Freedom, స్వ అనగా నా; ఇచ్చ అంటే ఇష్టం - నా యొక్క ఇష్టం. అదేమిటో తెలియాలంటే "నేను" అనే పదార్ధం ఏమిటో తెలిసుండాలి. అంతేగాని తాగి తిరగడం, నచ్చిన స్త్రీ, పురుషుడితో కోరుకున్నట్లు తిరగడమో , నచ్చిన సిద్ధాంతాలనూ, దేవుళ్ళనూ, నమ్మడమో కాదు స్వేచ్చ అంటే.
స్వేచ్చ అంటే దేని నుండో, ఎందుకో- అనేది బుకాయింపు, దబాయింపు లేని తార్కిక బుద్ధికి అది తెలిసి ఉండాలి.

                స్వేచ్చకు సరైన అర్థం ఏమిటంటే వ్యక్తి ధర్మబద్ధంగా జీవించగలిగినప్పుడే నిజమైన స్వేచ్చ, స్వాతంత్ర్యం లభిస్తుంది. మిగిలినదంతా భ్రమాత్మక ఆత్మ వంచన, ప్రకృతి వంచన తప్ప మరొకటి కాదు.

                        ఒక వ్యక్తి తన ఆలోచనలు, పనులు, సంవేదనలు, అన్నీ కూడా ఆ వ్యక్తిలోనే మొదలై, ఆ వ్యక్తిలోనే అంతమవుతున్నాయి. అంటే ఆ వ్యక్తి "స్వేచ్చాజీవి" కింద లెక్క. ఆ వ్యక్తి తన చర్యల గురించి, కార్యాకరణ సంబంధాల గురించి "నాకు తెలియదు" లాంటి పదాలతో పారిపోకుండా చెప్పగలడు అని అర్థం. కానీ అదృష్టవశాత్తో, దురదృష్టవశాత్తో అలా చెప్ప గలిగిన వారు ఇంతవరకూ భూమ్మీద పుట్టలేదు. "నీకు చెప్పవలసిన అవసరంలేదు. నీకెందుకు చెప్పాలి. నా ఇష్టం, నాకు అనిపించలేదు , అంతే !" ఇలా డిప్పలో దాగే తాబేలు వ్యక్తిత్వాలే తప్ప, తాను చేసిన పనికి కార్యాకారణ సంబంధం చెప్పగలిగే, లేదా తెలపగలిగిన వ్యక్తులు లేరు.

                          ఇంత వివరం ఎందుకంటే! వ్యక్తి స్వేచ్చ అనే నేటి తప్పుడు భావాన్ని ఖచ్చితంగా మనం గ్రహించాలనే! నేటి సమాజంలో ఒక కుటుంబాన్ని, అందులోని సభ్యులను, వారి ఇష్టా ఇష్టాలను కొద్దిగా గమనిస్తే చాలు. నలుగురు ఉన్న కుటుంబంలో ఒకరికి నచ్చింది మరొకరికి నచ్చదు. ఇలా ఎందుకు జరుగుతుందంటే అ నలుగురు వ్యక్తులు, నాలుగు రకాల "వ్యక్తిత్వాలతో" నాలుగు కుటుంబాలకు ప్రతినిధులై ఉంటారు.  ఒకే ఇంటిలో భార్య, భర్త, పిల్లలుగా కంటికి కనిపించే  బంధంలో ఉన్నప్పటికీ, వారి మూలాలు వేరు వేరు కుటుంబాలలో ఉంటాయి.

11, జూన్ 2015, గురువారం

పవిత్ర కుటుంబం HOLY FAMILY ( republish)

సృష్టి ఆదిలో కుటుంబాలు కాలుష్య రహితంగా ఉన్నాయి. భూమిలోనూ భూమిపైనా జీవరాశికి సంబంధించిన ప్రతి కుటుంబం జీవించడానికి సొంత ఆస్థి ఉంది. సొంత ఆస్థి అనగా - భూమి, ప్రకృతి, పశు పక్ష్యాదులు, పనిముట్లు, వాహనాలు. ఇలా ఆ మానవుడి సొంత కుటుంబానికి అవసరమైన సమస్తం.
ఆ కుటుంబం యొక్క సొంత ఆస్థులు అవిభాజ్యమైన భాగాలు. కుటుంబానికి సంబంధించిన సొంత ఆస్థి యొక్క స్థిరాస్థులన్నీ, వాటి స్థిర రూపాలతో ఆ కుటుంబం యొక్క అధిపతి మానవుడి ప్రకృతి  మూల స్వరూపాధీనంలోనూ, అలాగే ఆత్మ మూల స్వరూపాధీనంలోనూ ఉంటాయి. వాటి వ్యక్త రూపాలుగా భూమిపైన వారి స్వంత నేల, వ్యక్తులు, సాధనాలు, నీరు, జీవ జాతులు ఉంటాయి. ఇదీ పవిత్ర కుటుంబమం అంటే. పరాయితనం లేని స్వచ్చమైన ఈ కుటుంబం యొక్క సహజ నిర్మాణ అస్థిత్వ స్వరూపమే పవిత్ర కుటుంబం.
వ్యక్తి యొక్క గతమంతా ఆ వ్యక్తి ప్రకృతిలో ఙ్ఞాపకంగా నమోదయి ఉంటుంది. పాత విషయాలను రికార్డులను చూసి తెలుసుకోగలిగినట్లు, ప్రతి వ్యక్తీ తన గతాన్ని తెలుసుకొనగలిగే సదుపాయం ఉంది.
"నేను" అంటే - ఈ కుటుంబం యొక్క సంఫూర్ణ స్వరూపంలో ఒక పరమాణు విభాగం మాత్రమే. అంటే పరమాణువులోని ఋణ, ధనాత్మక స్వభావాలలో ఒకటి మాత్రమే.
వ్యక్తి తన కుటుంబం యొక్క అవిభాజ్యమైన మొత్తంలో ఒక భాగం. కుటుంబం యొక్క సొంత ఆస్థిలో ప్రతి వ్యక్తిత్వానికీ ఖచ్చితమైన వ్యక్తిగతమైన సొంత ఆస్థి అనేది ఉంటుంది. వ్యక్తి- వ్యక్తిగత సొంత ఆస్థి; కుటుంబం, కుటుంబ సొంత ఆస్థి అనేవి అవిభాజ్యమైనవి. ఒక అవయవం ఎలాంటిదో; అతనికి,  అతని వ్యక్తిగత ఆస్థి కూడా అలాంటిదే. వ్యక్తిత్వం అనేది కేవలం వ్యక్తి దేహంలోనో లేదా ఆత్మలోనో మాత్రమే ఉండేది కాదు. అతని సొంత ఆస్థిలోనూ ఉంటుంది.

తొలి అడుగు

                     సత్యం పూర్తిగా తెలిసిన తర్వాత మాత్రమే వ్యక్తి ధర్మబద్ధంగా జీవించడానికి వీలవుతుంది.

అధర్మం సృష్టించిన బంధాలు తెంచుకోకుండా, కాలుష్యాన్ని తొలగించకుండా వ్యక్తులు సత్యాన్ని తెలుసుకోలేరు.

"సత్యం తెలుసుకోవాలి"
"ధర్మబద్ధంగా జీవించాలి"

ఈ సంకల్పంతో తొలి అడుగు వేయండి. ధర్మం+ దైవం మీ మలి అడుగులకు రాజ మార్గం నిర్మిస్తుంది.

9, జూన్ 2015, మంగళవారం

మానవుని సమస్య (re publish)

ఒక యూనిట్ లోని ఒక వ్యక్తిత్వం కలిగిన ఆడ, మగ వ్యక్తులు గానీ, వేరే వ్యక్తిత్వం కలిగిన వ్యక్తితోగానీ , వ్యక్తులతో గానీ సంభవించడం ద్వారా వ్యక్తిత్వాల కలయిక అనేది జరుగుతుంది. కలుషితం కావడం అనేది ఇక్కడి నుంచే మొదలయింది.
సొంత స్వభావం, వ్యక్తిత్వం ఉన్న ఆడ, మగల కలయిక తప్ప మిగిలిన కలయికలన్నీ కాలుష్య కారకాలే, బంధ కారకాలే! బంధుత్వం, కులం, గోత్రం, మతం, ప్రాంతం, భాష, కులాంతర, మతాంతర, దేశాంతర, ఖండాంతర - ఇలా అనేక రకాలుగా జరుగుతున్న కలయికలన్నీ కూడా కాలుష్య కారకాలే తప్ప; స్వచ్చమైన, సహజమైన, వ్యక్తిత్వాల కలయికలు కావు అన్నది నేడు మానవాళి గుర్తించవలసిన సత్యం.
 
మానవుడి "సమస్య" ఏమిటి? అనేది ప్రశ్న. మానవుడి సమస్య "కాలుష్యం" . అంటే! మానవుడు "కలుషితం" కావడం అనేది మానవుడి సమస్యకు మూలం- మొదలు.
ఇలా మొదలైన "కలుషిత" మానవ సంబంధాల వలన నేటికీ, ప్రతి వ్యక్తీ తన సొంత "స్వభావాన్ని" వ్యక్తిత్వాన్నీ గ్రహించలేని హీనమైన స్థితికి చేరుకున్నాడు.
ప్రతి మనిషీ ఒక కుటుంబంలో సభ్యుడు. ఈ కుటుంబం అనేది కోట్ల సంఖ్యలో సభ్యులు కలది.
ప్రతీ కుటుంబానికి "అధిపతి " అయిన మానవుడు ఉంటాడు. ఈ మానవుడు బ్రహ్మ, విష్ణు, పరమేశ్వర -సరస్వతి, లక్ష్మి, కాళిక కావచ్చు. యెహోవా, ఏసు, పరిశుద్ధాత్మ కావచ్చు. మహ్మద్, అల్లా కావచ్చు. ఇలా కుటుంబానికి అధిపతులు , దేవతలుగా, ఇలవేల్పులుగా ప్రజలకు సుపరిచితమే. వీరు ఆయా కుటుంబాలకు అధిపతులుగా(Head of the family) ఉంటారు.
ప్రతి వ్యక్తి తన స్వభావాన్ని వ్యక్తిత్వాన్ని తెలుసుకున్న తరువాత, తన యూనిట్‍ను తెలుసుకోగలడు. తద్వారా తన కుటుంబాన్ని తెలుసుకోగలడు. కంటితో చూసి తెలుసుకోగల గుర్తులు, తెలుసుకోవడం అనే ప్రక్రియలో ఒక చిన్న సాధనం మాత్రమే అని ఇక్కడ గుర్తుంచుకోవాలి.
వ్యక్తి తన కుటుంబ సభ్యులను గుర్తించడానికి కూడా ఇక్కడ చిన్న గుర్తు తెలుసుకుందాం. అదేమిటంటే- పాదాల వేళ్ళ నిర్మాణ స్వరూపం. ఇది కుటుంబం మొత్తానికి ఒకేలాగా ఉంటుంది. వ్యక్తి( దేహం) మూలాలు అయిన పాదాలు భూమిపైన ఉంటే, కుటుంబ మూలాలు భూమిలో ఉంటాయి.
కుటుంబంలోని సభ్యులందరూ ఈ కుటుంబ అధిపతితో అవిభాజ్యమైన (విడదీయలేని) భాగాలుగా ఉంటారు. 
భౌతికం అనగా! పంచ భూతాత్మకంగా పిలువబడే దేహాలు అవి ఆడ+ మగ  - ఇవి బౌతిక నేత్రాలతో చూడగలిగినవి.
భూమి, సముద్రం, నక్షత్రాలు, గ్రహాలు - ఉపగ్రహాలు, ఉల్కలు, రాయీ, ఇనుము, బంగారం మొదలైనవి సమస్త వస్తు, జీవజాలం అంతటి లోనూ స్త్రీ , పురుష "శక్తి" సామర్ధ్యం ఇమిడి ఉంటుంది.
    రాయి అనే పదార్థానికి మూలం రాయి అనే వ్యక్తిత్వం ( కారెక్టర్) కలిగిన ఆత్మ, ప్రకృతి స్వరూపాలయిన ఆడ, మగ- ఇవి ఒకే జంట అయి ఉంటుంది. ఈ జంట అనేది సహజమైంది, స్వచ్ఛమైంది.
     అధి భౌతికం అనగా అంతర్ నేత్రంగా పిలువబడే నేత్రాలతో మాత్రమే చూడగలిగిన దేహాలు,  ప్రకృతి + పురుష లేదా, శక్తి స్వరూపం + ఆత్మ స్వరూపం.
     ప్రతి వ్యక్తికీ భౌతికం, అధి భౌతికం అనే ఈ రెండు రూపాలు ఉంటాయి.
     ఈ రెండు రూపాలకు ఆధారమైన మూల స్వరూపాలు ఉంటాయి. వాటి కేంద్రాలు వేరు వేరుగా ఉంటాయి. స్త్రీలకు మూల ప్రకృతి మూలంలో స్థానం ఉంటుంది. భౌతిక ప్రపంచం అనేది ప్రకృతి యొక్క స్వరూపం. దీనికి మూలం "భూమి" . ఆత్మలకు మూలం దైవం అనే వ్యక్తిత్వం కలిగిన దైవాత్ముడు ఆత్మలకు మూల స్థానం.
      వ్యక్తి అస్తిత్వం అనేది వ్యక్తి యొక్క మూల స్వరూపాలకు భౌతిక స్వరూప ప్రతినిధి. ఆత్మ మూలాలను ప్రకృతి మూలాలను, కలిపే జంక్షన్ ఆడ, మగ వ్యక్తులు.
     ఈ వ్యక్తి " పునాది " ఆధారంగా విశ్వంలో వ్యక్తికి అనేక స్థావరాలు, అనేక అస్తిత్వాలు ఉన్నాయి. విశ్వ వ్యాప్తమై ఉన్న "వ్యక్తిత్వం" గురించి ఈ సందర్భంలో తెలియజేయబడటం లేదు. అయినా ఈ విషయం దృష్టిలో ఉంచుకొని ముందుకు సాగాలి.
    కోట్ల సంఖ్యలో వ్యక్తులు గల కుటుంబాలు వేల సంఖ్యలో భూమి కేంద్రంగా నివసిస్తున్నాయి.   

సంకల్పానంతరంఒక వ్యక్తి" సంకల్పం " మొదట అతడి యూనిట్ ‍లో చలనం తీసుకొని వస్తుంది. వ్యక్తి ధర్మబద్ధంగా జీవించాలి అంటే తప్పని సరిగా అతడి యూనిట్ కుటుంబం కూడా ధర్మబద్ధంగా జీవించి తీరాలి. సంకల్పించిన తర్వాత జాగ్రత్తగా గమనించండి. మీలో మీకు అర్థమయ్యే అంతరంగిక ఘర్షణను. ధర్మబద్ధంగా నడవండి. త్వరలోనే మీకు" సత్యం" తెలిసి వస్తుంది.

మొదట నీ వ్యక్తిత్వపు రెండో సగాన్ని( personality) గుర్తు పడతావు.  తర్వాత నీ యూనిట్‍ని గుర్తిస్తావు( human code). తద్వారా నీ కుటుంబాన్ని గుర్తు పడతావు(family code).

ధర్మబద్ధంగా జీవించడం కోసం వ్యక్తి సంకల్పం ద్వారా మొదలు పెట్టిన ప్రక్రియ, సత్యం పూర్తిగా తెలిసే వరకూ కొనసాగుతుంది.
   

మానవ శాస్త్రం HUMONOLOGY ( Republish)

మనిషి గురించి "సంపూర్ణంగా" తెలియజేయడం, మనిషి సమస్యలు వివరించి దానికి పరిష్కారం తెలియజేయడం, భవిష్యత్తులో "సమస్యలు" రాకుండా ఎలా జీవించాలో తెలియజేయడం మానవశాస్త్రపు "లక్ష్యం"
    మనిషి అనగా!
        అణువులోని శాశ్వత సభ్యుల పూర్ణత్వమే మనిషి. మానవుడు, వ్యక్తి వంటివి మనిషికి పర్యాయ పదాలుగా వాడుకుంటున్నాం. అయితే మనిషి, మానవుడు ఒక్కటే గానీ, మనిషి, వ్యక్తీ సమానార్ధకాలు కావు.
        అణువులో మొత్తం ముగ్గురు మగవారు, ముగ్గురు స్త్రీలు, ఉంటారు. ఈ మొత్తం ఆరుగురి సమగ్ర స్వరూపమే "మనిషి" అనగా మనిషి= అణువు. అణువులో లేదా మనిషిలో మొత్తం ఆరుగురు వ్యక్తులు ఉంటారు.
    
ఈ ఆరుగురు వ్యక్తులు మూడు శాశ్వత స్వభావాలనూ, వ్యక్తిత్వాలనూ కలిగి ఉంటారు. స్వభావం అనగా ఎలాక్ట్రాన్, ప్రోటాన్, న్యూట్రాన్‍లని అర్థం.
   
    ఎలక్ట్రాన్ అనేది ప్రకృతి స్వరూపంగా ఉండి భౌతిక దేహాలకు మూలమై, భౌతిక స్వరూపాల ఆధారంగా శక్తిని సృష్టించే మూల పదార్ధంగా ఉంటుంది.
    ప్రోటాన్ అనేది ఆత్మ స్వరూపాధిపతిగా ఉండి బలాన్ని పెంపొందించే సాధనంగా పని చేస్తుంది.
    న్యూట్రాన్ అనేది మనస్సు యొక్క స్వరూపమై మొత్తం యూనిట్ యొక్క సామర్ధ్యంగా ఉండి, శక్తిని సమన్వయం చేసే మూల పదార్ధంగా ఉంటుంది.
            ఆత్మలకు సూర్యుని నుండి
            మనస్సుకు చంద్రుని నుండి
            శరీరానికి భూమి నుండి
            శక్తి సమకూరుతుంది
    స్వభావాలకు మూలం సూర్యుడు, చంద్రుడు, భూమి ( సూర్యుడు = ప్రకృతి+ పురుషుడు; చంద్రుడు = ప్రకృతి+ పురుషుడు; భూమి = ప్రకృతి+ పురుషుడు). వీరికి కూడా ఆత్మ స్వరూపాలు, ప్రకృతి స్వరూపాలుఉంటాయి. వీరూ చావు, పుట్టుక అనే చట్రంలో వ్యక్తులుగా జీవిస్తూ, సమస్త మానవుల అభివృద్ధికి మూలంగా ఉంటారు.
    ప్రతి స్వభావ స్వరూపానికి ఒక ప్రత్యేక వ్యక్తిత్వం (క్యారెక్టర్) ఉంటుంది.
   
    మనుషులందరూ(వ్యక్తులు) ఒకటే అనే భ్రమ బాగా చలామణీలో ఉన్నా, తక్షణం కంటి చూపుతోనే ఈ బేధాన్ని వ్యక్తులు గుర్తించగలిగే గుర్తును ఈ సందర్భంలో తెలియజేస్తాను. వ్యక్తుల చెవి నిర్మాణాన్ని గమనించండి. చెవి పోగులు పెట్టే కింది భాగంలో అతుకుని ఉన్నట్టుండి చిన్నగా కనిపించే చెవులు, వెడల్పుగా కనిపించే చెవులు, మధ్య రకంగా ఉండే చెవులు - మూడు రకాల స్వభావాలను తెలియ జేస్తాయి.
    ఒక వ్యక్తిత్వం ఈ మూడింటిలో ఏదో ఒక స్వభావానికి ప్రతినిధి అయినప్పటికీ, ప్రతి వ్యక్తి దేహం ఈ మూడు స్వభావాలతోనే నిర్మితమై ఉంటుంది. కాబట్టి ప్రతి భౌతిక దేహం కలిగిన వ్యక్తిలో ప్రకృతి, మనస్సు, ఆత్మ అనుసంధానం చేయబడి నిర్మించబడ్దాయి.
    ఈ అంశాన్ని వ్యక్తి దేహంలో సులభంగా గుర్తించే గుర్తులున్నాయి. అవి ఏమంటే - వ్యక్తి చేతి, పాదాల వేళ్ళు.
బొటన వేలు న్యూట్రాన్‍కు, చూపుడు వేలు, నడిమి వేలు ప్రోటాన్‍కు, చివరి రెండు వేళ్ళు ఎలక్ట్రాన్‍కు ప్రతినిధులుగా ఉంటాయి. వ్యక్తి తన యూనిట్ సభ్యుల స్థితిగతులను వేళ్ళు ఉన్న స్థితిని బట్టి అంచనా వేయవచ్చు.
    ఒకే వ్యక్తిత్వం ఉన్న ఆడ, మగ వ్యక్తులు తమ వ్యక్తిత్వపు రెండో సగాన్ని గుర్తించడానికి సులభమైన గుర్తు ఉంది. అది వ్యక్తి యొక్క స్వభావాన్ని గుర్తించే సాధనం : చెవి నిర్మాణంతో పాటు అదనంగా చేయి, పాదాలలో ఉండే రేఖల నిర్మాణం ఒకే వ్యక్తిత్వపు వ్యక్తులకు ఒకేలాగా ఉంటాయి.
    ఉదా:  న్యూట్రాన్ స్వభావం కలిగిన మార్టిన్ అనే వ్యక్తి - ధర్మం అనే వ్యక్తిత్వాన్ని కలిగిన ఆత్మ స్వరూపుడు అనుకుంటే; ధర్మం అనే వ్యక్తిత్వాన్ని కలిగిన న్యూట్రాన్ స్వభావిని అయిన ప్రకృతి స్వభావిని అయిన ప్రకృతి స్వరూపిణి మేరీ అనే అమ్మాయికీ , అంటే ధర్మం వ్యక్తిత్వం కలిగిన  మార్టిన్, మేరి అబ్బాయి, అమ్మాయిలకు మాత్రమే ఒకే రకమైన రేఖలు చేతులలో, పాదాలలో ఉంటాయి. వందల కోట్ల వ్యక్తులలో ఒకే వ్యక్తిత్వం కలిగిన వ్యక్తులకు మాత్రమే ఒకేలాగా రేఖలు ఉంటాయి వారు మాత్రమే MEDE FOR EACH OTHER

ధర్మం యొక్క శక్తిఅసత్యంతో, అధర్మంగా తనను తాను మోసగించుకుంటూ ఇతరులను మోసగిస్తూ రాజీపడి బతకకూడదు అని నిర్ణయించుకొని వ్యక్తి ఇలా సంకల్పించుకోవాలి.

" నా గురించి సత్యం నాకు తెలియాలి".
"నేను ధర్మబద్ధంగా జీవించాలి".

ఒక వ్యక్తి ఇలా సంక్ల్పించగానే మొదట ఆ వ్యక్తి "యూనిట్ సభ్యులు" తీవ్ర ఆందోళనకు దిగుతారు. మానసిక ఘర్షణగా గుర్తించే ఘర్షణకు దిగుతారు. ఆ వ్యక్తి చుట్టూ ఉన్న వ్యక్తుల ద్వారా గొడవలకు, వాదనలకు దిగుతారు. అది కూడా అధర్మబద్ధంగా!

    మరేమీ పర్వాలేదు. అధర్మానికి కూడా ధర్మం నుండే శక్తి అండుతుంది. కాబట్టి వ్యక్తి ధర్మ బద్ధంగా జీవించాలని సంకల్పిస్తే, అందుకు నిలబడితే, ఆ వ్యక్తిని నిలవరించే శక్తి విశ్వం మొత్తానికి కూడా చాలదు.
   

8, జూన్ 2015, సోమవారం

ఒక్క క్షణం

                                                   


                                                                                          - ఆచార్య మేడిపల్లి రవికుమార్
                                                                                            శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం,
                                                                                                      తిరుపతి            
                                                                                                                                                                                                                                                                                                                                             
    " ఒక విధ్వంసం జరగకుండా ఒక నూతన నిర్మాణాన్నీ, గతాన్ని సమీక్షించకుండా ఒక మంచి భవిష్యత్తునూ ఊహించలేం !"

         ఏదైనా ఒక కొత్త అంశం- అది అనుభవం కావచ్చు. అనుభూతి కావచ్చు. అది జీవితానికో, సృష్టికో సంబంధించిన ఒక సిద్ధాంతం కూడా కావచ్చు - మనల్ని తట్టినప్పుడు ప్రకంపనలు తప్పవు - వేల సంవత్సరాలుగా ప్రపంచంలో జరిగింది ఇదే !
   
        ప్రతి ప్రకంపనకీ నడిమి కాలం ఒక క్షణం కావచ్చు, ఒక యుగం కావచ్చు. ఖచ్చితంగా కాలం గురించి చెప్పలేనుగానీ "ఇది" కూడా ఒక ప్రకంపనే.
   
దీన్ని ఒక గ్రంథమనో, ఒక వ్యాసమనో, ఒక సిద్ధాంతమనో, ఒక ప్రేలాపన అనో, ఒక వెర్రి ఊహ అనో చెప్పలేను - ఎందుకంటె ఎందులోనూ ఇది ఇమడదు.

    ధర్మం - సత్యం - కాలం - ప్రకృతి - పురుషుడు - వ్యక్తి - మనిషి - కుటుంబం- అణువు - పరమాణువు - శక్తి - శ్రమ - భూమి- ఈశ్వరుడు - క్రీస్తు - అల్లా ... ఇలా ఎన్నో ఉన్నాయి. వీటి అసలైన స్వరూప స్వభావాలు, రంగు రుచీ వాసనలో ఇవి ఇలాగే ఉంటాయి గాబోలు.

    ఇది కంటితో చూసి చదివితే ఒక పట్టాన అర్థమయ్యేది కాదు - జీవితానుభవంతో దర్శిస్తేనే కొంత మేర చేరుకోగలం. ఈ ప్రక్రియ జరిగిన తరువాత మనం రిలాక్స్ కావచ్చు - కలవరపడవచ్చు - విపరీతమైన ఆకలి అవచ్చు - ఆకలి లేకపోవచ్చు - కుంభకర్ణుడి నిద్రపోవచ్చు - నిద్ర లేని రాత్రులు  గడపొచ్చు - భార్యనో, భర్తనో ఆమడ దూరంలో ఉంచొచ్చు - అమాంతంగా ఆలింగనం చేసుకోవచ్చు - ముద్దులు పెట్టవచ్చు - హద్దులు మీరవచ్చు - అద్దంలో మన శరీరాల్ని నగ్నంగా చూసుకొని గ్రీకు పురాణ నాయకుడు (NARACISSUS) లాగా మనకు మనం ముద్దాడుకోవచ్చు - మన మీద మనకే అసహ్యమేసి అద్దాన్ని పగలకొట్టవచ్చు - కొన్ని ధర్మాల్ని, వాస్తవాల్ని గుర్తించకపోతే దర్శించబోయే భవిష్యత్తు రూపాన్ని చూసి మన తలలు నేలకేసి కొట్టుకోకుండానే బద్దలు కావచ్చు - ఇంకా ఏవేవో జరగొచ్చు - అసలేమీ జరగక పోవచ్చు - ఇదంతా ఎందుకు చెపుతున్నానంటే పై వాటిలో ఏవి జరగినా జరగకపోయినా అది దీని తప్పు కాదు. వేల సంవత్సరాలుగా మన రక్తంలో ఇంకి పోయిన, మనల్ని మన జీవితాల్ని నడిపిస్తున్న, శాసిస్తున్న భావజాలమే అందుకు కారణం.

    వ్యక్తికీ, మనిషికీ తేడా ఏమిటి ? దైవానికీ దయ్యానికీ భేదం ఏమిటి ? మార్క్స్ కూ మార్క్సిస్టులకీ వైరుధ్యం ఉందా ? స్త్రీ పురుషులు ఎవరు ? మనలో సగ భాగంగా ఉండి జీవితాన్ని పంచుకుంటున్న వాళ్ళు నిజంగా మన భార్యలు, మన భర్తలేనా ? జీవితాలు ఎందుకు దారి తప్పుతున్నాయి ? కుటుంబాలు ఎందుకు కూలిపోతున్నాయి ? అక్రమ సంబంధాలు ఎందుకు ఏర్పడుతున్నాయి ? హత్యలు, అత్యాచారాలు ఎందుకు జరుగుతున్నాయి ? వాటి వెనుక ఉన్న శక్తులు ఏమిటి ? ఇందులో ఎవరు నేరస్తులు ? జన్మనిచ్చిన వాళ్ళూ, తోడబుట్టిన వాళ్ళూ నిజంగా నీ కుటుంబ సభ్యులేనా ? ఇలాంటివి మనల్ని భయకంపితుల్ని చేసే గంభీరమైన ఆలోచనలు కావచ్చు, చొప్పదంటు ప్రశ్నలూ కావచ్చు. వీటి పట్ల మన మనస్సు కొంతసేపు లగ్నం చేయాలంటే మన శరీరానికీ, మన మనసుకూ ఎంతో శక్తి కావాలి. మరెంతో ధైర్యం ఉండాలి. వీటన్నింటినీ మించి నీ గురించీ, మనిషి గురించీ, దైవం గురించీ, ధర్మం గురించీ, ప్రకృతి గురించీ, ముఖ్యంగా "భవిష్యత్తు" గురించీ వాస్తవం తెలుసుకోవాలన్న ఉత్సాహం ఉండాలి.

    ఇందుకు సిద్ధమైన వాళ్ళు ఎవరన్నా ఉంటే దీన్ని తెరవండి. కలిచివేసిన అంశాలు ఏవన్నా ఉంటే వాటి గురించి ఆలోచించండి. భయపడకుండా మరొకరితో పంచుకోండి. కలవరపెట్టిన అంశాలు ఏమీ లేకపోతే దీన్ని మరొకరి దర్శనంలో ఉంచండి. వాళ్ళకీ ఇదే అనుభవమైతే దీన్ని కాల్చివేయమని చెప్పండి. వీటిలో ఏది చేసినా లాభమే. నష్టం లేదు.

సంకల్పం


సంకల్పం అనేది వ్యక్తి తన పూర్ణత్వానికి ఇచ్చే ఆదేశం. తన సొంత ఆత్మను, ప్రకృతిని దాని స్థితి గతిని నిర్ణయించే నిర్ణయాధికారం వ్యక్తికి మాత్రమే ఉంది. ఇది తెలియని వ్యక్తిని, అతని సుదీర్ఘ గతం, అధర్మంగా సంపాదించిన సంపద, సంబంధాలు వ్యక్తిపై అధిక శక్తిని వినియోగించి ముందుకు నెడుతుంటాయి.ఊపిరి సలపనంత గందరగోళాన్ని వ్యక్తిలో ప్రవేశపెడతాయి. ఫలితంగా వ్యక్తి తొందరగానే అధర్మంతో రాజీ పడుతున్నాడు. ఏదో ఒక రూపంతో ఇది జరుగుతుంది. ఈ రాజీ మార్గంలో చివరి మజిలి సన్యాసం.

6, జూన్ 2015, శనివారం

విశ్వవినాశనం                కాలుష్యం నుండి అసహజ బంధాల నుండి బయటపడడం అనే ప్రక్రియ కూడా ఒక్కరితోనే మొదలవుతుంది. అవ్వాలి కూడా. ఎందుకంటే అధర్మం సృష్టించే వైరుధ్యం, హింస, పీడనను అధర్మ- ఆత్మ స్వరూపుడు కూడా భరించలేడు. కనుక ఈ పరిణామం విశ్వవినాశనం అనే నూతన స్థితికి చేరుకుంది.

                 ఈ స్థితిని అధిగమించి మానవాళి సుఖశాంతులతో జీవించాలి అంటే ఒకే ఒక్క దారి ఉన్నది. సత్యం- అసత్యం, ధర్మం- అధర్మం ఏమిటి అనే "విచక్షణ" తనకు లేదు. కోల్పోయాను, అని గ్రహించగలిగిన వ్యక్తి తనకు తాను సత్యం తెలుసుకొని ధర్మ బద్ధంగా జీవించాలని సంకల్పించి , ఆ వైపుగా ప్రయాణం చేయడమే.

   

సత్యం తెలుసుకోవడం                    ఏ వ్యక్తి గానీ, వ్యక్తిత్వపు వ్యక్తులు గానీ విడిగా ఎన్నటికీ "సత్యం" తెలుసుకోలేరు.

ఎందుకంటే, వ్యక్తిగానీ, వ్యక్తిత్వపు జంటగానీ, తమ యూనిట్‍లో తామొక భాగం మాత్రమే. ఒక యూనిట్ ఒక కుటుంబంలో ఒక భాగం మాత్రమే.

              ఒక వ్యక్తి తెలుసుకొనే విషయం గానీ, అనుభవించే అనుభవంగానీ, సాధించే లక్ష్యం గానీ , ఏదైనా ఆ వ్యక్తి తన  యూనిట్, కుటుంబం యొక్క సహకారంతోనే క్రియలు చేస్తాడు.

    కాలుష్యమైనా, బంధమైనా, బంధ విమోచనమైనా మొదట ఒక వ్యక్తిద్వారానే ఆ కుటుంబం మొత్తానికి అనుభవంలోనికి వస్తుంది.

                        విశ్వగతి తప్పడానికి తప్పుడు మార్గంలో పడిన తొలి తప్పటడుగు వేసిన వ్యక్తి వెనుక తప్పుడు ఆలోచనలు కలిగిన వారెవరూ లేరు. అయినా విశ్వగతి తప్పిపోయింది. ఇప్పుడూ అందరూ ఆ తప్పుడు మార్గానికే అను-చరులుగా మారిపోయారు. స్వచ్చమైన సహజ సంబంధాలతో ప్రారంభమైన సృష్టిలో కాలుష్యం అనేది సహజ బంధాల ద్వారా విశ్వ వ్యాపితం అవుతుంది.

5, జూన్ 2015, శుక్రవారం

self knowledge                    ఈ రకమైన పతనావస్థ స్థితి నుండి బయతపడవేసి వ్యక్తి తన విశ్వరూపాస్తిత్వాన్ని తెలుసుకొని, తన ఆధీనంలో తానుంటూ, అనుభవిస్తూ ఆనందింపజేసే ప్రక్రియకు మూలం భూమిపైన నివశించే వ్యక్తిత్వం యొక్క రెండు సగ భాగాలు- ఆడ, మగ దేహాలు. ఈ రెండు దేహాలు విశ్వరూపమైన తమ సొంత సామ్రాజ్య ప్రవేశ ద్వారాన్ని తెరచే రెండు తాళం చెవులు( keys).

                      స్వచ్చమైన, బంధరహితమైన ఆడ, మగ వ్యక్తులు తమకే సొంతమైన, తమ రెండవ సగం యొక్క వ్యక్తిని లైంగిక సంపర్గం ద్వారా కలవడం వలన మాత్రమే తమ సొంత సామ్రాజ్య ప్రవేశ ద్వారాన్ని తెరవగలరు. ఇలా సొంత సామ్రాజ్యం లోనికి ప్రవేశించిన వారికి మాత్రమే సొంత జీవితం గురించిన "సత్యం" తెలుసుకోగలరు(self knowledge).
   
                      ఇలా సొంత జీవితంలోకి ప్రవేశించిన వారికి మాత్రమే దేవుని రాజ్యం, స్వర్గం అనే ఊరించే ఆనందమయ జీవితం, దేవుని యొక్క స్పర్శ అనుభవంలోకి ప్రత్యక్షమవుతాయి. కాలుష్యం , బంధాలు సృష్టించిన భ్రమలు అదృశ్యం అయిపోతాయి

3, జూన్ 2015, బుధవారం

PERSONAL CODE - PERSONALITY CODE                                        వ్యక్తి దేహంతో, ఆత్మతో, ప్రకృతి ద్వారా చేసే పనులన్నీ వాటిలోనే రికార్డయి ఉంటాయి. "ఆత్మ" రికార్డు వేరుగా, "ప్రకృతి" రికార్డు వేరుగా ఉంటాయి. PERSONAL CODE  ఆధారంగా PERSONA    LITY CODE అనేది ఉంటుంది. ఇది వ్యక్తి యొక్క ప్రత్యేకతకు మూలంగా ఉంటుంది. మనుషులంతా ఒకటే అనే భ్రమ నుండి బయటపెట్టి, వ్యక్తికి సమూహం నుండి ప్రత్యేకతను బహిర్గతం చేసేది "వ్యక్తిత్వం". ఈ వ్యక్తిత్వపు గుర్తు , వ్యక్తి గుర్తు ఆధారంగా ఋణ, ధనాత్మక లక్షణాలతో రెండుగా విభజింపబడి ఉంటుంది.
                    
                               "ప్రతీ వ్యక్తీ విశ్వరూపులే", విశ్వవ్యాపితం అయి ఉన్న వ్యక్తి, వ్యక్తిత్వానికి భూమిపైన నివశించే వ్యక్తే మూలం. ఈ మూలంతోనే వ్యక్తి తన విశ్వస్వరూప స్వభావాలను ప్రత్యక్ష ఙ్ఞానంతో (direct perception) తెలుసుకొని తనను తాను సంరక్షించుకుంటూ వృద్ధి చేసుకోవడం, లేదా తనను తానొక అల్పుడిని అని భావించి లేదా నమ్మి, తనను తానే పతనావస్తకు చేరేలా ప్రవర్తిస్తాడు. తనను తాను తెలుసుకోలేక పతనమయ్యే వ్యక్తుల పతనం ఆధారంగా వృద్ధి చెందే దేవుళ్ళూ, మతాలు, సిద్ధాంతాలు - "వ్యక్తి అల్పుడు, స్వల్పుడు" అనో లేదా సొంత అస్తిత్వం గానీ,  వ్యక్తిత్వంగానీ  లేని, మొత్తంలో భాగమనే భ్రమల్ని వ్యక్తులు బలంగా వృద్ధి చేయాలని చూస్తారు.

2, జూన్ 2015, మంగళవారం

HUMAN CODE                             ఈ సృష్టిలో ప్రతీ మనిషి మూడు రకాల వ్యక్తిత్వాలతో, మూడు రకాల స్వభావాలతో ఉంటాడని ముందే చూసాం. ప్రతీ వ్యక్తీ ఒక యూనిట్ అనగా మనిషిలో భాగం. అలాగే ప్రతీ మనిషీ ఒక కుటుంబంలో భాగంగా ఉంటాడు.

                              సృష్టిలో ప్రతీ వ్యక్తికీ ప్రత్యేక గుర్తింపు ఉంటుంది. వ్యక్తి దేహానికి ప్రకృతి ద్వారా స్వభావం, పురుషుడి ద్వారా వ్యక్తిత్వం( charecter) వస్తుంది. స్వభావం, వ్యక్తిత్వం అనేవి దైవాదీనంగా ఉంటాయి. అయితే స్వభావం, వ్యక్తిత్వం కలిగిన ఆత్మ, ప్రకృతులకు సొంత గుర్తు ఉంటుంది. ఇది PERSONAL CODE.

గతం-వర్తమానం- భవిష్యత్తుఅవినీతిపరులైన అధికారులు దేవతలను చూసి భయభయంగా బతకడం అనేది గతకాలం అని తెలుసుకోండి.

                                 వర్తమానం, భవిష్యత్తు-లలో ధర్మబద్ధంగా జీవించాలి అనుకునే వారు సగర్వంగా జీవించగలిగే కాలం. స్వంత జీవితంతో మీ స్వంతం అయ్యే కాలం.
                                           మన కాలం.

1, జూన్ 2015, సోమవారం

"మానవ శాస్త్రం" పుస్తకానికి భూమన సుబ్రమణ్య రెడ్డి గారి ముందుమాట


ఈ చిన్న పుస్తకాన్ని చాలా శ్రద్ధగా చదివినాను. రచయితతో ముందుగానే సంభాషణలు కొనసాగినాయి గనుక ఆశ్చర్యపోలేదు. సంభాషణలను అక్షరాల్లో పొదివి చూసినాకా సంబరపడిపోయిన మాట నిజం. విజయభాస్కర్ దీని గురించి రాయమంటాడు గానీ, తొలిమాట, కడమాట అక్కర లేని పుస్తకం ఇది. ఈ పుస్తకం పుస్తకంగానే పాఠకుల్లో కదలిక తీసుకరాగలదని నానమ్మిక. పుస్తకంలోని ఆలోచనల మాదిరిగానే నా ఆలోచనలూ ఉన్నాయి గనుక జీవితాన్ని విజయభాస్కర్ ఈ వయసులోనే ఇంతగా పొదివి పట్టుకోవడం గొప్ప సంతోషంగా ఉంది. మనం మనంగా జీవించడం, ఆనందంగా జీవించడం అనే మామూలు సూత్రాలను లక్ష్యంగా చేసుకొని ఒక మంచి ఆలోచనను మన ముందుంచుతున్న విజయభాస్కర్‍ను మనసారా అభినందిస్తున్నాను
                                                                                                                                                                                                                                                                                -భూమన్

31, మే 2015, ఆదివారం

ధర్మబద్ధమైన జీవితంకాలాన్ని, వ్యక్తిని, కుటుంబాన్ని, సమాజాన్ని అనుసరించి సమన్వయం చేయాలంటే ధర్మబద్ధమైన జీవితం అనివార్యమైన షరతు.

పరస్పర సంబంధాలతో ముడిపడిఉన్న ఈ సృష్టిలో సమస్త విశ్వాలలో ఏ వ్యక్తి అయినా ధర్మ బద్ధంగా జీవించాలంటే దానికి ముందు సత్యం- ధర్మం- కాలం అనే వ్యక్తిత్వాలు ధర్మబద్ధమైన జీవితాన్ని ప్రారంభించి తీరాలి.

ఈ మూడు అస్థిత్వాలకు ఆధారమైన ప్రకృతి, పురుష స్వభావాలు ధర్మబద్ధమైన జీవితం జీవించడానికి పనికి రాని విధంగా చెడిపోయిఉంటే  వారి గురించి ఆంందోళన చెందనవసరం లేదు. ఎందుకంటే వ్యక్తులు, వ్యక్తిత్వాలు వేరువేరు అంశాలు. వ్యక్తిత్వం అధికారం అయితే వ్యక్తి అధికారి. అధికారి అవినీతి పరుడైతే అతడిని తొలగించి వేరే అధికారిని నియమించడం ఎంత సహజమో ఇది కూడా అలాగే జరుగుతుంది.

30, మే 2015, శనివారం

ప్రకృతి-పురుషుడు- కాలం
వ్యక్తిత్వపు రెండు కొసలు అయిన ప్రకృతి, పురుషుడికి మధ్య అనేక అస్థిత్వాలను కలిపే పదార్ధం ధర్మం కాగా వీటిని సమన్వయం చేసే పదార్ధం కాలం.

వ్యక్తి, వ్యక్తిత్వం, కాలం  అనేవి అవిభాజ్యమైనవి. వ్యక్తి చెడిపోతే, వ్యక్తిత్వం, కాలం కూడా చెడిపోతాయి. విశ్వంలో అనేక స్థల కాలాలలో అస్థిత్వం ఉన్న వ్యక్తిత్వం సమన్వయం కావాలంటే తప్పని సరిగా కాలం అనేది స్వచ్చంగా, సరళంగా, ధర్మబద్ధంగా ఉండి తీరాలి.

లేదంటే కాలం కాస్తా వ్యక్తి జీవితానికి మంచి కాలంగానూ, చెడు కాలంగానూ, అకాలం, సకాలం, యుద్ధకాలం, శాంతికాలం- ఇలా అనేక ద్వంద్వస్వభావాలతో  వ్యక్తి జీవితంతో జూదమాడుతుంది.

వ్యక్తి కలుషిత బంధ అధర్మ జీవితం వ్యక్తి కాలాన్ని నిర్దేశిస్తుంది.

వ్యక్తి స్థితి, గతి, స్వరూప, స్వభావాలకు కాలం యొక్క స్థితి, గతి, స్వరూప, స్వభావాలకు ఉన్న పరస్పర సంబంధం అర్థం గాక, వ్యక్తి కోరికలు మాత్రం మేఘాల రెక్కలతో విశ్వ విహారం చేయాలంటాయి.

29, మే 2015, శుక్రవారం

కాలము (TIME)కలుషిత వ్యక్తిత్వాల అధర్మబద్ధమైన జీవన స్థానంలో స్వచ్చమైన, ధర్మబద్దమైన జీవనం నెలకొల్పడానికి సహకరించవలసిన మరొక పదార్ధం "కాలం".

కాలపురుషుడు, ప్రకృతి కూడా కలుషిత వ్యక్తిత్వపు అధర్మ జీవనం ద్వారా కాలాన్ని గతి తప్పించారు. కలుషితం చేసేసారు.

కాలపురుషుడు, ప్రకృతి ధర్మబద్ధమైన జీవనం ప్రారంభించనంత వరకూ సత్యం, ధర్మం తమ అస్థిత్వాలలో నిలబడలేవు. సత్యం, ధర్మం, కాలం అనే మూడు పదార్ధాలు ఒకే యూనిట్ కాబట్టి, ఈ మూడు పదార్ధాలు ఏక కాలంలో ధర్మ బద్ధమైన జీవితాన్ని ప్రారంభించాలి.
వ్యక్తులు ధర్మబద్ధంగా జీవించాలి. సత్యం తెలుసుకోగలగాలి అనే సంకల్ప శక్తి ద్వారా రకరకాలుగా చిద్రమైన కాలాన్ని తన స్వీయ గతిలోనికి తీసుక రాగలరు.

8, మే 2015, శుక్రవారం

స్వార్ధ పూరిత దృఢ సంకల్పం ఉన్న వారికి స్వాగతం.               మానవుడు అంటే 50  కేజీలో 100 కేజీలో ఉన్న అల్ప మాంసపు ముద్ద  మాత్రమే కాదు. సమస్త విశ్వాలలో వ్యాపించి ఉన్న ఆత్మ, ప్రకృతుల యొక్క స్వరూపులు, దైవపుత్రులు.

ఒక్కటే అనేకంగా మారలేదు. అనేక వ్యక్తిత్వాలకు ఆధారంగా ఉన్నది దైవం ఒక్కటే!

సొంత వ్యక్తిత్వాన్ని
సొంత ఇంటినీ
సొంత కుటుంబాన్నీ
చేరుకోవాలనే స్వార్ధపూరిత దృఢ సంకల్పం ఒక్కటి ఉంటే చాలు మనం ఉన్నదే దేవుని ఒడిలో అని తెలుసుకోవడానికి.

అపనమ్మకం అనే అసత్య, ఆదర్శ దృష్టిని విడనాడి; తెలుసుకోవడం అనే సత్యం యొక్క ధర్మ నేత్రాలు తెరవండి.
రాబోయే కాలం - ధర్మ బద్ధంగా జీవించాలి అనుకునే వారిదే.

ఎందుకంటే కాలం కూడా కష్ట కాలంలో ఉంది. కాలనాగు, కాలభైరవుడు, కాల యముడు ఇలా ఎందరి చేతుల్లోనో ముక్కలై కాలం స్వీయ అస్థిత్వాన్ని కోల్పోయింది.

ఙ్ఞానం లేని జీవి , దైవాన్నెరుగని జీవి  సృష్టిలో ఒక్కటి కూడా లేదు.  కాస్త విచక్షణతో ఆలోచించడి. నేడు మీ దగ్గర ఉన్న ఙ్ఞానం రెండు రూపాలుగా ఉంది. ఒకటి- మీ వ్యక్తిత్వాన్ని చిద్రం చేసే తప్పుడు ఙ్ఞానం . ఇది బంధం ఫలితంగా జనించింది. రెండవది- మీ వ్యక్తిత్వాన్ని వికసింపజేసే సరియైన ఙ్ఞానం. దీనిని మీకెవరూ నేర్పరు. ఎందుకంటే ఇతరులకు నేపేది తప్పుడు ఙ్ఞానమే. సరియైన ఙ్ఞానము నీలోనే ఉంది. దానిని నీవు మాత్రమే వెలికి తీసి వినియోగించగలవు. దానిని వెలికి తీయడానికి ఇతరుల సహాయం ఖచ్చితంగా తీసుకోకూడదు.

ఎందుకంటే - ప్రతీ వ్యక్తీ స్వీయ ఙ్ఞాబ్నం, ఙ్ఞాపకం అన్నీ కూడా ఆ వ్యక్తి ప్రకృతి మూలంలో నిక్షిప్తం అయి ఉంటాయి.

ప్రకృతి మూలం నుండి ఆ ప్రకృతి యొక్క పురుషుడు మాత్రమే ఆ రహస్యాలను తెలుసుకోగలడు. వేరెవ్వరికైనా అది అసాధ్యం.

సొంత జీవితాన్ని వదిలి, సొంత ఙ్ఞానాన్ని గ్రహించలేని స్థితికి చేరుకున్న మానవుడు, వ్యక్తి బతకడానికి కావలసిన కనీస ఙ్ఞానం కూడా ఇతరుల దగ్గర సంవత్సరాల తరబడి అడుక్కుంటూ , పరీక్షలకు గురవుతున్నాడు. అధర్మం పైన వృద్ధి చెందే ఏ వ్యవస్థ అయినా ముందుగా వ్యక్తులను అడుక్కునే వారిగానో, దానం చేసేవారిగానో చేస్తుంది.


7, మే 2015, గురువారం

దేవుడు- మానవుడుదైవం అంటే ఈ సమస్త విశ్వాలను సృష్టించే సృష్టి కర్తలైన మానవుడికి కావలసినంత శక్తినీ, సామర్ద్యాన్నీ, సాధనాలనూ అందించేది మాత్రమే.

అంతేకానీ; ప్రార్థనలు, ప్రసాదాలు, భక్తి, అభిషేకాలు, లాంటి తుచ్చమైన చర్యలను ఆశించడం, స్వీకరించడం, అనే పదాలకు అర్థం తెలియని అమాయకుడు  దైవం.

అసత్యంతో, అధర్మంగా మానవుడెన్ని తప్పుడు పనులు చేసినా ఏ నాటికైనా తెలుసుకుంటాడులే అని మానవుడి దుష్ట చర్యలు బాధిస్తున్నా పంటీ బిగువున భరిస్తున్నవాడే దైవం( దేవుడు+దేవత)

ఆమ్యామ్యా ఇవ్వకపోతే మీ పని జరగదనే లంచగొండి భిక్షగాడు కాదు దైవం అంటే.

మీకు తెలుసా ఈ మహా విశ్వాన్ని సృష్టీంచింది ఎవరో?

"ఈ మహా విశ్వం సృష్టి యాంత్రికంగా జరిగిపోయింది"  అనే మూర్ఖులను వదిలిపెడితే ; ఇది దేవుని పనీ, లేదా ఏదో తెలియని మహాశక్తి అని నమ్ముతున్నారు కదా!

అది అసత్యం!
సత్యం ఏమంటే-
మానవుడే ఈ విశ్వ నిర్మాత !

మానవుడే ఈ సమస్త విశ్వానికి కేంద్రం!

మానవుడి కోసమే ఈ సమస్త విశ్వాలు ఉన్నాయి.
మానవుల ఆట వస్తువు   ఈ సమస్త విశ్వం.
ఇదే సత్యం.

6, మే 2015, బుధవారం

పరాయీకరణ                  పరాయీకరణ పాలైన మీ స్వంత వ్యక్తిత్వానికి  గతాన్ని మరచిపోవడం అనేది ఒక ప్రత్యేకత. మన మతిమరుపు ఆధారంగా పుట్టుకొచ్చిన కొత్త మోసగాళ్ళే దైవ ప్రచారకులు., మతాలు, గురువులు, బాబాలు, సైన్స్ వాదులు మొదలైన వాళ్లు. మన నిస్వార్ధత, త్యాగ గుణం, నమ్మకం, అపనమ్మకం లాంటి దుర్గుణాలే వీరికి సోపాన మార్గాలు.

              స్వంత పదార్ధం అంతా స్వంతం చేసుకోవాలనుకునే స్వార్ధపరులకు స్వాగతం. ఎందుకంటే స్వ+అర్థం = మిమ్మల్ని మీరు తెలుసుకోవడం. మిమ్మల్ని మీరు ఉద్ధరించుకోవడం.

             మనలో దాగి ఉన్న ప్రేమను, ఆనందాన్ని, శాంతినీ మనలో మనమే వికసింపజేసుకోవడం, మన శక్తి సామర్ధ్యాలతో మనమే ఐశ్వర్యాన్ని సృష్టించి భోగలాలసలో మనమే తేలుతూ ఉంటే ఈ సృష్టికి ఆధారమైన దైవానికి( దేవుడు+ దేవత) సంతోషం.

                  ఇంతటి విశాల విశ్వంలో మనం మనలోనే ఉన్న శాంతి కోసం , ఆనందం కోసం అడ్డమైన గాడిదల్లాంటి తప్పుడు ఙ్ఞానం కలిగిన గురువులు, ఙ్ఞానులు, దేవతలు( ఇలాంటి పేర్లను వీరు , వీరి శిష్యులు అనగా వ్యాపార భాగస్వామి సృష్టించి ప్రచారం చేసేవి) వెంట భిక్షగాళ్ళులాగా వెంట పడడం దైవానికి బాధ కలిగించే అంశం.


5, మే 2015, మంగళవారం

ఇల్లలుకుతూ పేరు మరచిపోయిన ఈగదేవుడు. సైన్స్ పదార్ధాలే భిన్నమైనవి.మూఢవిశ్వాసాలు కామన్. వర్తమాన జీవితంలో వ్యక్తులను సైన్స్ పేరుతో భయ భ్రాంటులను చేయగల నేర్పు వీరికి మాత్రమే ప్రత్యేకం. 

మత వ్యవస్థలకు చిక్కని మొండి ఆత్మలు, ప్రకృతులు ఏమైనా ఉంటే అవి కూడా తప్పించుకోలేని ఆఖరి అస్త్రం ఒకటి ఉంది. అది మత వ్యవస్థలకు సైన్యాధ్యక్షుడు అయిన వైద్యం. పెట్టుబడిదారీ విధానం అనేది మతం ముద్దుబిడ్డ.

ఇన్ని వ్యవస్థలు గంభీరంగా, దృఢమైన స్వరాలతోమేము చెప్పిందే సత్యం అని ఊదరగొడుతుంటే - ఈ వ్యవస్థీకృత బంధాలనుండి తప్పించుకొని సత్యమేదో, ధర్మమేదో , అధర్మమేదో తెలుసుకోవడం అసాధ్యమనీ, అది మహానీయులకు మాత్రంఏ సాధ్యపడే అంశమనీ ఎన్నో యుగాల తపః ఫలమనీ ఇలాంటి తప్పుడు అభిప్రాయాలు మనకున్నాయి కదా!

ఒక ఈగ ఇల్లలుకుతూ తన పేరు మరచిపోయిందని మనకొక కథ. 

విశ్వనిర్మాణం చేస్తూ చాలా దూరం వెళ్ళిపోయి, సొంతకుంటుంబాబ్బి, సొంత ఇంటినీ, సొంత అస్థిత్వాన్నీ వ్యక్తిత్వాన్నీ కూడా మరచిపోయిన వ్యక్తులం మనం.

కంటికి కనిపించని అణువుకు - అణువు కంటే చాలా చిన్నగా ఉన్న పదార్ధాన్ని దైవకణమని సైంటిస్టులు నేటికి గుర్తించగలుగుతున్నారు. మరి అలాంటి అణువులు లక్షల కోట్ల సంఖ్యలో ఉండే వ్యక్తికి ఆధారంగా దైవం ఉండదా?

అది మీకు తెలియదా?

4, మే 2015, సోమవారం

మార్క్సిస్టుల వాదనలు
                      మార్సిస్టులు ఈ సూత్రీకరణను నిర్లక్ష్యం చేసి నిర్మించిన బలహీన వ్యవస్థలే నాటి కమ్యునిస్టు దేశాలు.

                                             శ్రామికులు, కార్మికులు తమ శక్తి- సామర్ధ్యాలకు మించి పని చేసే సామర్ధ్యం కలిగి ఉండడం మార్క్స్ కు అర్థం కాని ప్రశ్న. శ్రామికులు ఇలా పని చేయడానికి మూలం బంధాలు. వీరు బంఢాలను దోచుకొని పని చేస్తారు. వీరి శ్రమ ఉత్పాదకతను (ఫలితం) పేట్టూబడి దారులు దోచుకుంటున్నారు. "దోపిడీ ప్రక్రియలో మొట్టమొదటి దోపిడీదారులు కార్మికులే". 

                       దోపిడీ ప్రక్రియలో అంతిమంగా దోపిడీకి గురవుతున్నది ప్రకృతీ స్వరూపాలైన స్త్రీలే. ఆత్మలు ప్రకృతులను దోచుకుంటున్నాయి.

     ఈ వరుసలోనే హేతువాదులు, నాస్తికులు, సైన్స్ పేరుతో తిరిగే గుంపులు చాలా ఉన్నా - వీరికో ప్రత్యేకత ఉంది.

                                          ఆధునికత, శాస్త్రీయత( సైంటిఫిక్) అనే ముసుగులు, పూర్వ వ్యవస్థ లొసుగులు వీరికి ఆహారం. సైన్స్ అనే పదార్ధం వీరి దృష్టి. అనగా శాస్త్రీయ దృక్పథం. మా దేవుడే నిజమైన దేవుడు అని ప్రచారం చేసే మూఢ విశ్వాసుల కన్నా మూఢ విశ్వాసులు వీరు.

3, మే 2015, ఆదివారం

మత సంస్థల సూత్రీకరణలు- ప్రలోభాలు -3

                      ఆత్మ గానీ ప్రకృతిగానీ స్థిరమైన అస్థిత్వం , వ్యక్తిత్వం కలిగి లేవు. పరిణామ స్వభావం కలిగినది ప్రపంచం. ఇందులో దుఃఖం ఉంది. దుఃఖ రహితమైన స్థితికి చేరుకునే మార్గం ఉంది. ఈ మార్గంలో నిర్వాణ స్థితినో, ఇంక దేనినే పొందక పోతే దుఃఖంలో పుట్టి , జీవించి, దుఃఖంలోనే మరణిస్తాడు. బుద్ధుడు, బౌద్ధం, బౌద్ధవాదులు తెలిపిన సత్యాలు తెలుసుకొని వారు చెప్పిన జీవన విధానంలో జీవించకపోతే ఎవరికైనా దుఃఖమే మిగులుతుంది. 

                     ఆత్మను , ఆధ్యాత్మిక జీవితాన్ని అంగీకరించే ఇలాంటి వారంతా మానవుడి భవిష్యత్తు గురించి ఇలా ఏదో ఒకటి చెప్పి తీరాల్సిందే. అప్పుడు మనిషి భయపడి ఏదో ఒక కంపెనీలో (మతం) సభ్యత్వం తీసుకుంటాడు.

                              ఇక ఆత్మ , ప్రకృతి అస్థిత్వాలను నిరాకరించి వర్తమాన మానవుడు, భౌతిక పదార్ధం యొక్క యాంత్రిక చలనంగా భావించే వారున్నారు. వీరిలో కార్ల్ మార్క్స్ ను అనుసరిస్తున్నామని చెప్పుకొనే కమ్యునిష్టులు ప్రథమ శ్రేణిలో ఉంటారు. ఎందుకంటే సిద్ధాంతం ఆధారంగా వీరు నూతన వ్యవస్థలను నిర్మించారు గనుక వీరు వ్యక్తి యొక్క గతం యాంత్రికం అనే భావం ప్రచారం చేస్తారు. విరుద్ధ శక్తుల మధ్య ఐక్యత, ఘర్షణ, అభివృద్ధి నియమాన్ని గత వర్తమానాలకు అన్వయిస్తారు.వ్యక్తులు, వ్యక్తిగత సంబంధాలు ఎలా ఉండాలని మార్క్స్ ఖచ్చితంగా చెప్పకపోవడాన్ని ఆసరాగా చేసుకున్న మార్క్సిస్టులు మాత్రం గతం సృష్టించిన బంధ వ్యవస్థనే వ్యక్తిగత జీవితంలో ఆమోదించి అనుసరిస్తున్నారు. మార్క్స్ తనకు తెలిసినంతలో స్త్రీ పురుష సంబంధం గురించి ఒక గొప్ప సూత్రీకరణ చేసాడు. "ఒక స్త్రీ, తన పురుషుడిని చేరుకోవడానికి ఎటువంటి ఆటంకాలు లేని వ్యవస్థా నిర్మాణం జరగాలి" అని

27, ఏప్రిల్ 2015, సోమవారం

మత సంస్థల సూత్రీకరణలు- ప్రలోభాలు -2


           గతం లేదు. వర్తమానం, భవిష్యత్తు మాత్రమే ఉంది. అది కూడా భవిష్యత్తులో ఆత్మ మాత్రమే మిగులుతుంది. అది స్వర్గ, నరకాలనే రెండు ప్రత్యామ్నాయాలను మాత్రమే చూపిస్తుంది. జడ్జిమెంట్ డే తర్వాత శాశ్వతంగా స్వర్గమో, నరకమో ప్రాప్తిస్తుంది. ఈ రకమైన పదార్ధాన్ని విక్రయిస్తున్నవి క్రిష్టియన్, ఇస్లాం మతసంస్థలు, వాటి శాఖలు.

                వీటిలో ప్రకృతి స్వరూపమైన జగత్తు అనగా ఈ మహా విశ్వానికి ప్రాధాన్యత తక్కువ.

                                 ప్రకృతికీ, ప్రకృతి స్వరూపమైన స్త్రీకీ మరీ అల్పమైన చోటూ ఉంటుందక్కడ. ఎందుకంటే స్త్రీ నరుడి నుండి బయటకు తీసిన పక్కటెముక స్వరూపిణీ కదా.

                       మానవ జన్మనే వీరు పాప చర్యగా  ప్రచారం చేస్తారు. భూమి అనేది తప్పించుకోవలసిన స్థలంగా వీరు ప్రచారం చేస్తారు. ఆడం అండ్ ఈవ్ అనే సిద్ధాంతం తయారు చేసినా, నేడు మగవాడు తన ఎముకతో తయారు చేసిన ఈవ్‍ని గుర్తించాలా వద్దా; ఏదో ఒక ఈవ్‍నా, లేక అనేక ఈవ్‍లతో జత కట్టాలా అనే విషయాలలో స్పష్టత ఉండదు. ఒక మగవాడు తన ఈవ్‍ని గుర్తించడం ఎలా అనే విషయంలో స్పష్టత లేదు.

                                               ఈ సిద్ధాంత, వ్యాపార విస్తరనతో ముందంజలో ఉంది.  సిద్ధాంత ఆధారంగా వివాహాలు చేసుకొనే వ్యక్తులు తమ దైవమే తమను కలిపిందని విశ్వసిస్తారు. ఇతరులకు అదే చెప్తారు. మరి వారి దేవునికి సమాన శక్తి కలిగిన సైతాన్ ఈ వివాహ ప్రక్రియలో స్త్రీ పురుషుల కలయికల విషయంలో ఎలా జోక్యం చేసుకుంటాడు. ఈ మతమార్గ శాఖాధిపతి పద్ధతుల్లో సైతాన్ వర్గం వారు ఎంత మంది ఉన్నారు. ప్రచారకుల్లో ఎంత మంది ఉన్నారు. వారు వీరి దేవుళ్ళకు వ్యతిరేకంగా ఏ విధమైన నిర్మాణ, ప్రచారాలు చేస్తారు? ఇలాంటివన్నీ అయోమయం.

25, ఏప్రిల్ 2015, శనివారం

మత సంస్థల సూత్రీకరణలు- ప్రలోభాలు                        మత సంస్థలు ప్రజలను ఆకర్షించడానికి, వీలు కాకుంటే భయ పెట్టడానికి , వారు చేసుకున్న సూత్రీకరణ సారాంశాలను ఇక్కడ పరిశీలిస్తే అర్థం అవుతుంది. 

                   వర్తమానంలో వ్యక్తి తనకు ఉన్న సమస్యలకు కారణాలను వెతుకుతూ గతంలో తన చుట్టూ ఉన్న మానవ సంబంధాలలోకి తొంగి చూసి కార్యాకరణ సంబంధాన్వేషణ చేస్తాడు. భవిష్యత్తు ఎలా ఉంటే తాను బాగుండగలడో అంచనా వేస్తాడు. ఊహలు చేస్తాడు. ప్రతీ వ్యక్తీ సాధారణంగా చేసే పనికీ, ప్రశ్నకూ ముందే సిద్ధంగా ఉంచిన ఫలితాలు సమాధానాలు ఇలా ఉన్నాయి.

                    1. ఆత్మ మరణం లేనిది. దేహం( వ్యక్తి) దేహి ( ఆత్మ) ధరించే చొక్కా లాంటిది. దేహం ద్వారా జరిగే పనులకు ఫలితాలు ఉంటాయి. వాటిని అనుభవించడానికి పునర్జన్మ అనేది ఉంటుంది. జనన మరణాలు అనివార్యం అనేది ఒక సమాధానం. ఈ సమాధానానికి బలమైన వేదిక భారత దేశం. "గతంలోనూ, వర్తమానంలోనూ, భవిష్యత్తులోనూ దేహి తన దేహం ద్వారా కర్మ ఫలాలను తానే అనుభవిస్తాడు." 

ఆత్మకు మరణం లేదు. కర్మ ఫలాలు ఆత్మ నంటవు. అగ్ని దహించదు. నీరంటదు లాంటి సూత్రీకరణలు ఉంటాయి. 

                     ఈ సిద్ధాంతం ఒకే కుటూంబంలోని మూడు రకాల వ్యక్తిత్వాలను దైవ, రాక్షస, మానవ గణాలుగా విభజించి మొదలవుతుంది. ఈ రకమైన విభజనను ఈ దేశ ప్రజలు ఎంత మంది ఎలా చూస్తున్నారో తెలిసిందే. దాని గురించిన పర్యావసానాలు ఇక్కడ అప్రస్తుతం. 

                     ఈ విభజనలోని దైవ, రాక్షస, మానవ వ్యక్తిత్వాలు నిజానికి ఒక అణువులోని మూడు విరుద్ధ గుణాలు తప్ప మరేమీ కాదు. ప్రతీ భౌతిక కుటుంబంలో ఈ మూడు రకాల వ్యక్తిత్వాలు ఉంటాయి. 

            సత్యం విషయంలో ఇష్టం, అయిష్టం అనేవి ఉండవు. 
అసత్య విషయంలోనే ఇష్ట, అయిష్టం , అంగీకారం, వ్యతిరేకత, వాదన, ప్రతి వాదనలు ఉత్పన్నం అవుతాయి.

                వీరికి స్వర్గం, నరకం, వైకుంఠ ప్రాప్తి, మోక్షం, దైవంలో లీనం అయిపోవడం, నీచ స్థితినికలిగిన జన్మ లెత్తడం లాంటి అనేక భవిష్యత్తులు ఉన్నాయి.

                   గతాన్ని, భవిష్యత్తును చూపి వర్తమానంలో వ్యక్తులను భయపెట్టి, భ్రమ పెట్టి, ప్రలోభపరచి, హింసించి, సంహరించి, అదుపులో పెట్టుకోవాలని చూడడం వీటి చరిత్ర, ఇది వర్తమానం.

మత ప్రచారం.
                  మనం సరిగ్గా గమనిస్తే ఇలా ప్రచారం చేయడం అనే ప్రక్రియ, అల్పమైన భౌతికావసరాలు తీర్చే కంపెనీలు చేసే ప్రచారాన్ని పోలి ఉంటుంది.

                 సబ్బులు, కండోమ్‍లు, వాహనాలు, బట్టలు మొదలైన వస్తువులు అమ్మే కంపెనీల ప్రచారాలకూ; మతం, మార్గం, జీవన విధానం అంటూ ప్రచారం చేసే సంస్థలకూ బేధం లేదు.

ప్రచారం అనే ప్రక్రియ అస్త్యం, అధర్మం యొక్క అవసరం.
సత్యానికీ, ధర్మానికీ, దైవానికీ  ప్రచారం అనేది అవసరం లేదు.

                  నేడు, సత్యం, ధర్మం, దైవం అనేవి తెలుసుకోవలసిఅన్ పదార్ధాలే తప్ప, ప్రచారం పొంది, మార్కెట్ వృద్ధి చేసుకోవలసిన పదార్ధాలు కావు. పైగా వాటిని తెలుసుకున్న మరుక్షణం చీకటిలోకి వెలుతురు ప్రసరించినట్టుగా, అంతకు ముందు జరుగుతున్న ఈ దుష్ట వ్యాపారం నిలిచి పోతుంది, నశిస్తుంది. 

                     ఇలాంటి సంస్థల అంతిమ లక్ష్యం ధన సంపాదన, రాజ్యధికారం. దేవుని రాజ్యంలోకి ప్రవేశం, స్వర్గంలోకి మోక్ష సిద్ధి, జన్మ రాహిత్యం, నిత్యానందం, దుఃఖ రాహిత్యం, అమరత్వం, సమ సమాజం- ఇలాంటి పదాలన్నీ వ్యక్తీ అనే చేపని పట్తడానికి మత( ఆధ్యాత్మిక) వ్యాపార సంస్థల గేలానికి గుచ్చిన ఎరలు. ప్రతీ వ్యక్తీ ఏదో ఒక వ్యాపారానికి దొరక్క పోడు కదా!

23, ఏప్రిల్ 2015, గురువారం

మత వ్యాపార సంస్థలు                                ఏ సిద్ధాంతం అయినా ఒక మతంగా, ఒక వ్యవస్థగా నిలిచి అభివృద్ధి చెందడం అనేది మానవ అస్థిత్వం అంటే ఏమిటి? అది ఎలా ఉంది? ఎలా ఉండాలి? అనే ప్రశ్నలకు అది ఇచ్చే జవాబులపై ఆధార పడి ఉంటుంది. తను చేసిన సూత్రీకరణలనే "సత్యమ"నీ, "అంతిమ గమ్య స్థానమ"నీ ప్రజలను నమ్మించగలగాలి.
                  అంటే వ్యక్తులు( ఆడ , మగ) ఎందుకు పుడుతున్నారు? ఎందుకు జీవిస్తున్నారు? ఎందుకు మరణిస్తున్నారు? మరణం తర్వాత ఏమిటీ? పుట్టూకకు ముందు ఏముంది? మరణం తర్వాత పరిణామాలు ఎలా ఉంటాయి? ఎలా జీవిస్తే ఎలాంటి ఫలితాలు ఉంటాయి? జీవితం ఇలాగే ఉండడానికి కారణాలు ఏమిటీ? ఎందుకు? ఆరోగ్యం, ఆనందం ఎలా ఉంటాయి? ఎలా వస్తాయి? ఎలా పోతాయి లాంటి ప్రశ్నలకు సమాదానం  చెప్పగలగాలి? అప్పుడే అది ఒక మతంగానూ, మార్గంగానూ, ఒక జీవన విధానంగానూ ఆశ చూపి కొందరు ప్రజలను ఆకర్షించి తమ నిర్మాణంలో ఇముడ్చుకొనగలదు. 

                   ఈ ప్రక్రియ వలనే గతంలో, వర్తమానంలో అనేక సిద్ధాంతాలు ఆధారంగా మతాలు, మార్గాలు, జీవన విధానాలు, వ్యవస్థీకృతమై ఉన్నాయి. సిద్ధాంత ఆధారిత వ్యవస్థలు మా సిద్ధాంతమే సరియైనది, సత్యమైనది అని ప్రచారం చేసుకుంటూ , ఇతర సిద్ధాంతాలను వెక్కిరించుకుంటూ ప్రజలను ఆకర్షించడానికి ప్రయత్నం చేస్తుంటాయి.

22, ఏప్రిల్ 2015, బుధవారం

శివ పార్వతుల భవిష్యత్తు               ఇలా ప్రకృతిని (స్త్రీ) విడిచి సంపద, అధికారం వైపుకు సాగిన ఆత్మ, అభివృద్ధి తన ప్రారంభం మరచి ముందుకు సాగింది. కాలుష్య బంధాల పీడ నుండి పరిష్కారంగా మొదలైన సన్యాసం కాలుష్యాన్ని మరింత పెంచి, పటిష్టమైన బంధిఖానాలు సృష్టించి అందులో నుండీ ఎలా బయట పడాలో దిక్కు తోచక గింజుకుంటుంది.

                సన్యాసం సృష్టించిన ఈ సంక్షోభానికి ఆది, అంతం ఒక్కటే. సకల సన్యాస వ్యవస్థలకి మూల పురుషుడైన శివుడు, మూల ప్రకృతియైన పార్వతులే ఈ సమస్యకు ఆది, అంతం.

           సృష్టి నిర్మాణంలో కీలక బాధ్యతలను నిర్వహించవలసిన ఈ జంట కలయికను నిరోధించడం ద్వారా మొత్తం అన్ని రకాల మత సన్యాస, వ్యవస్థలు అస్తిత్వంలో ఉన్నాయి.

                    18 శక్తి పీఠాలుగా, ద్వాదశ జ్యోతిర్లింగాలుగా రావణుడి పాలయిన ఆత్మ లింగంగా - ఇలా అనేక రకాలుగా ధ్వంసం అయిన ఈ శక్తి స్వరూపాలు,  తమ వ్యక్తిత్వంలో భాగమైపోయిన పరాయి వ్యక్తిత్వాలు గంగ, నాగుడు, చంద్రుడు లాంటి కాలుష్యాలను తొలగించుకొని స్వచ్చమైన వ్యక్తిత్వాలతో బంధరహిత స్థితిలో ఒకరినొకరు గుర్తించి కలవాలి . లేకపోతే ఆ శక్తులే వినాశకారులుగా పరిణమిస్తున్నాయి. ధర్మ బద్ధంగా జీవించక పోతే శివ పార్వతులే నాశనం అయ్యే స్థితిలో వారున్నారు. తక్షణ సమీప భవిష్యత్తే ఈ అంశాన్ని తేలుస్తుంది.

21, ఏప్రిల్ 2015, మంగళవారం

స్త్రీ కోసం యుద్ధాలు
                             స్త్రీ కోసం యుద్ధాలు జరిగాయి అనేది అందరికీ తెలిసిన విషయమే. ఒక స్త్రీలో లేనిది మరో స్త్రీలో ఏముంటుంది? ప్రతీ స్త్రీకీ ఒకప్రత్యేకత ఉంటుందని ముందే చూసాం కదా! ఒక ( హోలీ ఫ్యామిలీ) కుటుంబానికి మూలమైన ప్రకృతి స్వరూపమైన అమ్మాయి కోసం యుద్ధం అంటే ఇప్పుడు, ఆ యుద్ధం వెనుక వాస్తవాన్ని సులభంగా గ్రహించగలం. ఆ అమ్మాయి, కేవలం ఆ అమ్మాయి కాదు. ఆమె ఒక శక్తి స్వరూపిణి అని. యుద్ధం చేసేవాడు కేవలం ఆ అమ్మాయి కోసం కాక, మహాశక్తి కోసం- తద్వారా ఆకుటుంబం మొత్తం తన ఆధీనంలో ఉంచుకోవడం కోసం యుద్ధం జరిగింది అని మనం గ్రహించగలం.

                            ఆ అమ్మాయిని చేసుకోవడం వలన ఆ కుటుంబం, ఆ ఊరు  బాగుపడిందనో, నాశనం అయిపోయిందనో, లేదా పాప పుట్టడం, బాబు పుట్టడం వలన కూడా ఈ మార్పులు జరిగాయి వంటి  మాటలు సాధారణంగా వినే ఉంటారు కదా!

                ఇంత వివరం ఎందుకంటే సన్యాసికి అదనపు శక్తి సామర్ధ్యాలు ఎలా సమకూరుతాయో మనం గ్రహించడానికే.

                   అలా అదనపు శక్తి సామర్ధ్యాలు సంపాదించిన సన్యాసులు- ఉన్న దానిని వీలైనంత ధ్వంసం చేసి, కొత్త సృష్టులు మొదలు పెట్టారు. కొత్త విధానాలు, వ్యవస్థలు, రాజ్యాలు నిర్మించారు. నేటికీ వ్యవస్థలను శాసిస్తున్నది సన్యాసులే, మత సంస్థలే.

20, ఏప్రిల్ 2015, సోమవారం

సన్యాసి చేసే దుర్మార్గాలు 2              ఈ ప్రయాణంలో సన్యాసికి అదనపు శక్తులు, బలం అవసరమవుతాయి. అదీ తీరుతుంది. ఎలాగో చూడండి!

         సన్యాసం తీసుకున్న వ్యక్తి యొక్క ప్రకృతి స్వరూపిణి అయిన స్త్రీ పరిస్థితి ఏమిటి?

                             ఆమె అవసరాలు తీర్చవలసిఅన్ మగవాడూ సన్యాసం తీసుకుంటే ఆమె సహజమైన అవసరాలు ఎలా తీరుతాయి? ఈ సమస్యకు ఒక పరిష్కారంగా పర స్త్రీకి చెండిన మగవానికి రెండవ భార్య కావడం, లేదా వాడిని సొంతం చేసుకోవడం లాంటి చర్యలు మొదలయ్యాయి. దీని ఫలితంగా కొత్తగా ఒప్పందాలు, ఘర్షణ, హింస లాంటి చర్యలు వ్యక్తుల మధ్య మొదలయ్యాయి. 

                     ఏదో విధంగా పర పురుషుడిని చేరిన స్త్రీకి అదనపు బలం, శక్తి అందుబాటులోకి వస్తాయి. ఇక సన్యాసికి కూడా అదనపు బలం శక్తి అందుబాటులోకి వచ్చేసింది కదా!

                            స్త్రీ పురుషుల కలయిక ద్వారా అదనపు శక్తి, బలం అందుతుంది అనేది అర్థం కావడానికి రెండు చిన్న ఉదాహరణలు చూద్దాం. ఈ విషయాన్ని పాఠకుడు కొత్తగా ఆలోచించడానికి ఉపయోగ పడుతుంది.
 వివాహం తర్వాత జత కలిసిన ఇద్దరి వ్యక్తుల సరీరాలలో మార్పు వస్తుంది. కొందరిలో స్వల్పంగా ఉంటే, కొందరిలో అధికంగా ఉంటుంది. పెళ్ళైన తర్వాతా బాగా మారిపోయారు అని అనడం, చూడ్డం మనకు తెలిసిందే.! రెండు వేరు వేరు పదార్ధాలు కలిసినపుడు కొంత కొత్తదనం, కొత్త స్వరూపం సంతరించుకోవడం అనే మార్పు సహజమె కదా! బలహీనులు అదనపు బలాన్ని సంతరించుకోవడం; బలవంతులు బలహీన పడిపోవడం; ఆడుతూ పాడుతూ చలాకిగా ఉండే వారు వారి దేహమే వారికి భారమై పోవడం లాంటివన్నీ మన జీవితంలో అనుభవంలో ఉన్నవే. 

                             కాకపోతే ఈ మార్పులు ఇందుకే జరుగుతున్నాయి అని అంగీకరించడం సమాజానికి ఇష్టం లేక పోవడం, లేదా ఈ వాస్తవం మరుగున పడీ తెలియుఅక పోవడం అనేది ఉండవచ్చు. 

18, ఏప్రిల్ 2015, శనివారం

సన్యాసి చేసే దుర్మార్గాలు                     ఒక వ్యక్తి సన్యసించడం కోసం చేసే కఠోర సాధనాల వెనుక ఉన్న దుర్మార్గం గురించి ఇక్కడ తెలుసుకోవాలి. ఒక యూనిట్‍లోనూ, కుటుంబంలోనూ, అవిభాజ్యమైన వ్యక్తి నిద్ర, ఆహారం తగ్గించి; లేదా మానేసి కఠోర సాధన చేయడం మొదలు పెడతాడు.


                 ఈ సాధనలో వ్యక్తి సాధించవలసినది దేహపరమైన సంవేదనలు అయిన ఆకలి, విశ్రాంతి, కామం, నిద్ర, మనస్సు పరమైన ఆలోచనలు - ఇలాంటి వాటిని తన అదుపులోనికి తెచ్చుకోవడం ముఖ్యం. వీటి కంటే వ్యక్తి యొక్క రెండో సగం ( స్త్రీ గానీ పురుషుడు గానీ) యొక్క ఆకర్షణ శక్తికి లోను కాకుండా తనను తాను ఉంచుకోగలగడం అత్యంత ముఖ్యమైన విషయం.

                   ఒక వ్యక్తి భోజనం చేయక పోతే ఆ లోటు మొదట అతని సొంత స్త్రీ పైన ఆ భారం పడుతుంది. ఆమె అదనంగా ఆహారం తీసుకోవలసి వస్తుంది. తర్వాత ఆ లోటును ఆ వ్యక్తి యొక్క యూనిట్ సభ్యులైన మిగిలిన నలుగురు కూడా భర్తీ చేయవలసి వస్తుంది.

                     ఆ వ్యక్తి నిద్ర మాని సాధన చేయడం మొదలు పెడతాడు. దానికి కావలసిన శక్తి , బలం తన యూనిట్ నుండే అతనికి అందుతూ ఉంటుంది. అతడి స్త్రీతో పాటు యూనిట్ సభ్యులకూ కలత కూడిన నిద్ర, నిద్ర లేచిన తర్వాత రాత్రంతా పని చేసి న ట్లు అలసట అనేవి వారికి అనుభవంలోకి వస్తాయి.

               ఈ కొత్త పరిస్థితి వలన వ్యక్తిలో యూనిట్ లో కుటుంబంలో ఘర్షణ మొదలవుతుంది. వ్యక్తి అందుబాటులో ఉంటే ఇది భాహ్యంగానే జరుగుతుంది. ఆ వ్యక్తి ఈ భాహ్య సంఘర్షణ నుండి తప్పించుకొని సుదూర తీరాలకు పోయి ఉంటే ఈ  ఘర్షణ  అంతర్గత ఘర్షణగానే కొనసాగుతుంది.

 "మొండి వాడు రాజు కన్నా బలవంతుడు" - ఈ సామెత ఇలాంటి వారి వల్లనే పుట్టింది. తన యూనిట్ సభ్యులైన స్త్రీ, పురుషుల ( ఆత్మ, ప్రకృతి) శక్తితో; వారితోనే రేయింబవళ్ళు ఘర్షణ పడే అతనితో యూనిట్ సభ్యులు రాజీ పడి పోతారు. అతడిని పూర్తిగా వదిలేస్తారు ఘర్షణ పడకుండా.

ఎందుకంటే మిగిలిన వారు జీవనం కోసం శ్రమించాలి. కుటుంబ పోషణ, రక్షణ చూసుకోవడం లాంటి బాధ్యతలు ఉంటాయి కాబట్టి. వీరికున్న ఈ బలహీనత సన్యాసి కాదలచుకున్నవ్యక్తి యొక్క బలం.

సన్యాసి ఒక మెట్టు అధిరోహించాడు. తన యూనిట్ నుండి శారీరక, మానసిక, ఆత్మిక అవసరాల కోసం ఇబ్బంది పెట్టకుండా ఒప్పందం కుదుర్చుకొని మొత్తం యూనిట్ ను తన అదుపులోకి తీసుకుంటాడు. సన్యాసం తీసుకున్న వ్యక్తి యొక్క ఆత్మ ఇక, విరామం, విశ్రాంతి లేకుండానూతన నిర్మాణం మొదలు పెడతాడు. దానికవసరమైన నూతన విఙ్ఞాన ఆర్జన చేయడం ప్రారంభిస్తుంది

సన్యాసం దేనికీ పరిష్కారం కాదు                        ఈ భ్రమ తర్వాత సంసారం అనే బంధాలు ఉన్న వ్యక్తులకు కూడా వ్యాపించింది. "సత్యం" ఎలాగూ బంధింపబడి; నిజమైన స్త్రీ, పురుష సమానత్వం సమాధి చేయబడింది. స్వభావంలో స్త్రీ ఆధిపత్య సమాజమైనా; మగవాడి చేతిలో దోపిడి, పీడనకు గురవుతున్న స్త్రీ కూడా ఈ అత్యున్నత భ్రమలో పోటీ పడుతున్నది. కొందరు అమ్మగార్లు తయారై దేవతలుగా పూజలందుకుంటున్నారు. 


                            అన్ని రకాల సన్యాస/ ఆశ్రమ వ్యవస్థలు, సిద్ధాంతాలు మానవుడి యొక్క సమస్య నుండి పలలయనం చిత్తగించిన పలాయన వాదాలే తప్ప ; సన్యాసం దేనికీ పరిష్కారం కాదు.

సన్యాసుల దగ్గర ఏదో ఉందని వెళుతున్న, భజన చేస్తున్న ప్రజల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవలిసింది ఏమీ లేదు.

17, ఏప్రిల్ 2015, శుక్రవారం

సన్యాసుల గొంతెమ్మ కోరికలు                         ప్రకృతి పురుషుడి  భోగ వస్తువనే భావన కూడా జనంలో పాతుక పోయి ఉంది.

                                          ప్రకృతి స్వరూపం అయిన భౌతిక దేహమే లేని స్థితి నుండి, జనన, మరణ చట్రం నుండి, శాశ్వతంగా తప్పించుకోవాలనీ, అమరత్వం సంపాదించాలనీ ఇలాంటివెన్నో  అసాధ్యమైన గొంతెమ్మ కోరికల్తో సన్యాసులు జీవిస్తున్నారు. ఈ కోరికల వికృత ఫలితాలను గుర్తించగలిగే భౌతిక దృష్టి వీరికి పూర్తిగా మసక బారిపోయింది. ఈ హ్రస్వ దృష్టిగాళ్ళు, అహం బ్రహ్మస్మి, ఆయ మాత్మా బ్రహ్మ లాంటి గంభీరమైన పంచ్ డైలాగులతో "నేనే దేవుడు" అని విర్రవీగగలుగుతున్నారు.

                                         బంధాల వలన దైవాత్మ కూడా మిగిలిన అన్ని ఆత్మలలోనూ ఎంతో ప్రతిఫలిస్తుంది. సెంటు పూసుకున్న వాడిని కౌగిలించుకుంటే మనకూ సెంటు వాసన అంటుతుంది. అలాగే వ్యక్తి తాను ఫలానా వ్యక్తిత్వం కలిగిన, ఆత్మ స్వరూపమైన జీవిని అన్నది మరచిపోయి చాలాకాలమే అయిపోయింది అందుకే, అంటుకున్న సెంటులా తనలో ప్రతిఫలించే దైవ పదార్ధాన్ని గుర్తించి తానే దైవం అనీ, లేదా తాను కూడా దైవమే అనే అత్యున్నత భ్రమలో నేడు సన్యాసి బతుకుతున్నాడు.

16, ఏప్రిల్ 2015, గురువారం

సన్యాసం ఉనికిలోకి తెచ్చిన భ్రమలు                     అయితే సన్యాసం ద్వారా కొన్ని భ్రమలు బాగా ప్రచారంలోకి వచ్చాయి. వాటిలో మచ్చుకు కొన్ని-

- దైవాన్ని తెలుసుకోవడం, దైవంలో "ఐక్యం" కావడం
- ఈ విశ్వం అనే బంధం నుండి "మోక్షం" సంపాదించడం
- మానవ స్థితి నుండి "దైవత్వం" అనే స్థితికి ఎదగడం.
- సర్వం త్యజించి, భౌతిక, తుచ్చమైన రాగ, ద్వేషాలకు అతీతంగా "నిత్యానంద" స్థితిని అనుభవించే స్థాయికి చేరడం.
- లోక కళ్యాణం కోసం

            సన్యాసం ఎందుకు తీసుకున్నారు, అనే ప్రశ్నకు సమాధానంగా ఇలాంటివి ప్రచారంలో ఉన్నాయి. 

                      వాస్తవం ఏమంటే- సన్యాసులు స్త్రీ ద్వారా భౌతిక బంధంలో చిక్కుకోకుండా వారి శక్తిని వినియోగించుకుంటున్నారు. తీవ్ర స్థాయిలో ఆత్మ యొక్క బలాన్ని పెంచుకుంటూ, పూర్తిగా తమ ఆధీనంలో ఉండే ప్రపంచాన్ని సృష్టించుకుంటున్నారు. ఈ రకమైన అభివృద్ధి ఫలితంగానే ప్రకృతి తీవ్ర విధ్వంసాలకు గురవుతూ, పతనం అవుతోంది. ఓ పాత చైనా సామెత ఈ సన్యాస వ్యవస్థకు సరిగ్గా సరిపోతుంది. అది ఏమంటే- "వేరు శూన్యం, కాడ సన్నం, ఆకు మందం"

15, ఏప్రిల్ 2015, బుధవారం

ధర్మ బద్ధమైన సమాజంలో ఏ ఆధిపత్యానికీ చోటు ఉండదు                         "బలము- శక్తి" సమాన స్థాయిలో ఉన్నప్పుడే "అదుపు" అనేది ఉంటుంది. మగవాడు బంధాలలో చిక్కుకోకుండా తప్పించుకోవడం ద్వారా, బంధాలలో ఉన్న మగవారిలో "అధిక శక్తి" ప్రవాహం అనేది యాంత్రికంగా జరుగుతుంది. ఈ క్రమంలో "స్త్రీ లక్షణాలు" సమాజంలో "ఆధిపత్య స్థానానికి" చేరుకున్నాయి.


                     మగవాడు తనవే అయిన ప్రత్యేక లక్షణాలు ఏమిటి అనేది గ్రహించలేని స్థితికి చేరిపోయాడు. జంతువులు, పక్షులు, చేపలు లాంటి జంతుస్థాయి బాధ్యతలు; పిల్లల్ని కనడం, పెంచడం, రక్షించడం లాంటివి మగలక్షణాలు కదా అనే స్థాయికి చేరిపోయాడు.


              ప్రస్తుత సమాజం పురుషాధిపత్య సమాజమనే భ్రమలో మగవారు బతుకుతున్నారు. నిజానికి ఇది ప్రకృతి, స్త్రీ ఆధిపత్య సమాజం. ధర్మ బద్ధమైన సమాజంలో ఏ ఆధిపత్యానికీ చోటు ఉండదు. ప్రకృతీ పురుషుల సమన్వయం మాత్రమే ఉంటుంది.  ఆధిపత్యం అనే పదార్ధానికి అధర్మమే ఆహారం, ఆశ్రయం.

14, ఏప్రిల్ 2015, మంగళవారం

సన్యాసం                                    బంధం యొక్కఫలాలు, దోపిడి, పీడన, కోరికలు, దుఃఖం, అనారోగ్యం మొదలైనవి వాటి నుండి తప్పించుకోవడానికి వ్యక్తి ఒక ఆయుధాన్ని కనిపెట్టాడు . అదే- "సన్యాసం."

                             పరాయి స్త్రీ, పురుషులతో లైంగిక సంపర్గం ద్వారా ఏర్పడే భౌతిక బంధం నుండి తప్పించుకొని, తమ అస్థిత్వాలను ఎంతో కొంత కాపాడుకోవడం అనే అవసరం సృష్టించిందే "సన్యాసం". మొదట మగవారే ఉన్న ఈ సన్యాస వ్యవస్థలోకి తరువాత స్త్రీలు కూడా వచ్చి చేరారు. ఈ సన్యాస వ్యవస్థ వెనుక అభివృద్ధి చెందిన ఇంకో చెడు ఏమంటే - వ్యక్తి యొక్క జీవిత కాలంలో అనేకులతో సెక్సు ద్వారా జీవితాన్ని పంచుకోవడం, తప్పుడు వ్యక్తిత్వాన్ని పెంచుకోవడం.

                   పంచుకోవడం, పెంచుకోవడం అనే ఈ ప్రక్రియ ద్వారా "బుద్ధి, విచక్షణ" లాంటి "మగ లక్షణాలు" తీవ్ర స్థాయిలో క్షీణించడం మొదలైంది. అలాగే స్త్రీలలో కూడా ప్రేమ, ఆప్యాయత, తెలివి, ఙ్ఞాపక శక్తి లాంటివి క్షీణించడం మొదలైంది. ఎందుకంటే సామర్ధ్యానికి మించిన "శక్తి" , శక్తికి మించిన సామర్ధ్యం పరాయి వ్యక్తిత్వాల ద్వారా అందుబాటులోకి రావడం ద్వారా వ్యక్తులు అదుపు తప్పి పోతారు. కలుషిత వ్యక్తిత్వాల, బంధాల ద్వారా స్వీయ నియంత్రణ కోల్పోవడం కూడా ఒక ఫలితం.

13, ఏప్రిల్ 2015, సోమవారం

"బంధమే కోరికలకు మూలం" "కోరికలే సమస్త అనర్ధాలకు మూలం"

వ్యక్తి తన సొంతమైన దానిని వదులుకొని ఆ స్థానంలోకి  మరొక పదార్ధాన్ని తెచ్చుకోవడానికి ప్రయత్నించడం వల్లనే ఈ స్థితి వచ్చింది. ఎలాగంటే  x  అనే వ్యక్తి, y అనే వ్యక్తి నుండో, a అనే వ్యక్తి నుండో లోటును పూడ్చాలి అని కోరుకుంటే, దానికి వారు సహకరించినపుడు, x  దానిని తస్కరించి అయినా లేదా, బంధం ద్వారా తాను పొందే అధిక శక్తి, సామర్ధ్యాలతో వారిపై దాడి చేసి అయినా తెచ్చుకోవాలి అన్న ఆలోచన x కు పుడుతుంది. నష్టం ఉండే వ్యాపారం ఎవ్వరూ చేయరు కదా!

నేడు సమాజంలో మనం చూస్తున్న సమస్త రుగ్మతలూ బంధం ద్వారానే వ్యవస్థీ్కృతం చేయబడ్డాయి. అందుకే నేడు సమాజంలో రుగ్మతలకు ప్రజల నుండి బహిరంగంగానో, రహస్యంగానో మద్ధతు ఉంటుంది. మరీ నీచమైన పనులను కూడా కొందరు ఎందుకు సమర్ధిస్తారు అని అమాయక మేధావులు తలలు పట్టుకుంటుంటారు. వారికి తెలియని కారణం బంధం యొక్క స్వరూపం. దాని ద్వారా లబ్ధి పొందే వారి సంఖ్య, నష్టపోయే వారి సంఖ్య ఎంత ఉంటుందో ఎవ్వరికీ తెలియదు. అది ఒక్కోసారి కోట్లాది జనాభాగా ఉంటుంది.

నాది అనేది ఏదైనా నా నుండి వేరైనా, నాది కానిది ఏదైనా నాతో చేరినా, అది బంధం అవుతుంది. వ్యక్తికి లాభం, నష్టం అనేవి బంధం ద్వారా మాత్రమే కలుగుతాయి.

"బంధమే కోరికలకు మూలం"
"కోరికలే సమస్త అనర్ధాలకు మూలం"