16, జూన్ 2015, మంగళవారం

స్వంత పిల్లలు ( republish)

                                     పిల్లల పట్ల తల్లితండ్రులు ఎందుకు వ్యాపార ధోరణులతో ఆలోచిస్తారు, నిర్ధాక్షణ్యంగా ప్రవర్తిస్తారు. కుల, మత, జాతి బేధాలతో పెంచుతారు. 
                 పిల్లల తమ జీవనాధారం కోసం ఎంచుకొనే వృత్తి , తమ భవిష్యత్తు అయిన  "వివాహం" లాంటివన్నీ ఎందుకు తల్లితండ్రుల, కుల, మత పెద్దలు తమ అదుపులో ఉంచుకోవాలని చూస్తారు?
ఎందుకంటే?
                 పిల్లలు అనేవారు, కన్న బిడ్డలే కానీ ఆ వ్యక్తుల " స్వంతపిల్లల్ని వారు కనడంలేదు. అసలు వ్యక్తులకు స్వంత పిల్లలు ఉంటారన్న ఙ్ఞాపకత్వ లేదు! ఈ వ్యాపార జీవితంలో వేల సంవత్సరాల క్రిందటే అమ్మేసారు.
                   "స్వంతం" అయిన దాన్ని అమ్మేసి పరాయిని స్వంతం చేసుకొని పరాయీకరణపాలై నానా హింసలు, వేదనలు అనుభవిస్తున్న మానవాళి "విషాద" మహా ప్రస్తానానికి చరమ గీతం ఈ పుస్తకం.
                                        వ్యక్తుల చర్యలను నియంత్రించేది , ఇష్టా ఇష్టాలను నిర్ణయించేది, వ్యక్తికి వచ్చే ఆలోచనలు, ఉద్వేగాలు, ద్వేషం యొక్క స్థితి, గతి, ఆరోగ్య, అనారోగ్యాలు మొదలైనవి అన్నీ కూడా వ్యక్తి యొక్క కుటుంబం ద్వారా జరుగుతాయి. ఓటు హక్కును వినియోగించుకోవడం లాంటి ప్రక్రియలు ఇలానే జరుగుతాయి. రోడ్లపైన అడుక్కునే బిచ్చగాడి నుండి; చిరిగిన, మాసిన బట్టలతో జుట్టు, గడ్డం పెంచి నిర్ధిష్టమైన పరిధిలో సంచరిస్తూ,పిచ్చివారిలా కనిపించేవారైనా, కన్న తల్లితండ్రులను వదిలి హిమాలయాలలో ఘోర తపస్సులు చేసే అఘోరాలైనా,తీవ్ర వాదులైనా తమ కుటుంబ ప్రయోజనాల కోసమే   ఉంటారు. అంతే తప్ప, వ్యక్తులు అనుకున్నట్లుగానో, లేదా వారు చెప్పినట్లుగానో, అవి స్వేచ్చాయుత స్వతంత్ర్య చర్యలు కావు. వారు కుటుంబ అధిపతుల యొక్క ఆఙ్ఞల మేరకే, వారి కను సన్నలలోనే ఉంటారు అనేది బహిర్గతం కావలసిన "సత్యం".
                                                 ఒక వ్యక్తి తన ఆధీనంలో ఉండడం, ఉండలేక పోవడం అనే సమస్య వుంది. కనురెప్ప కదలికల మొదలు, నడక ,మాట, నిద్ర, ఆలోచన, అంతిమంగా తాను ఎలా జీవించాలి, మరణించాలి అనే సమస్త వ్యక్తి ప్రక్రియలు ఏవీ ఆ వ్యక్తి ఆధీనంలో ఉండవు. అన్నీ పరాధీనమై ఎవరో,  ఎలానో కూడా తెలియకుండా; తెలుసుకోలేని  స్థితిలో పరుల చేత నియంత్రించబడే యంత్ర స్థితికి చేరుకున్న వ్యక్తికి స్వాతంత్ర్యం, స్వాధీనం లాంటి పదాలకు అర్థం తెలిసే స్థితే లేదు. 
                                             వ్యక్తికే తెలియనన్ని రూపాలతో వ్యక్తి జీవితం మొత్తం నియంత్రిస్తూ ఉంటే వాటి నుండి బయట పడకుండానే స్వేచ్చ గురించి తపించడం అర్థ రహితం.

12, జూన్ 2015, శుక్రవారం

స్వేచ్చ ( republish)

        
                                     నేడు చలామణిలో ఉన్న వ్యక్తి స్వేచ్చ అనేది తప్పుడు భావన, అర్థ రహితం.

                స్వ+ఇచ్చ= స్వేచ్చ, ఆంగ్లంలో Freedom, స్వ అనగా నా; ఇచ్చ అంటే ఇష్టం - నా యొక్క ఇష్టం. అదేమిటో తెలియాలంటే "నేను" అనే పదార్ధం ఏమిటో తెలిసుండాలి. అంతేగాని తాగి తిరగడం, నచ్చిన స్త్రీ, పురుషుడితో కోరుకున్నట్లు తిరగడమో , నచ్చిన సిద్ధాంతాలనూ, దేవుళ్ళనూ, నమ్మడమో కాదు స్వేచ్చ అంటే.
స్వేచ్చ అంటే దేని నుండో, ఎందుకో- అనేది బుకాయింపు, దబాయింపు లేని తార్కిక బుద్ధికి అది తెలిసి ఉండాలి.

                స్వేచ్చకు సరైన అర్థం ఏమిటంటే వ్యక్తి ధర్మబద్ధంగా జీవించగలిగినప్పుడే నిజమైన స్వేచ్చ, స్వాతంత్ర్యం లభిస్తుంది. మిగిలినదంతా భ్రమాత్మక ఆత్మ వంచన, ప్రకృతి వంచన తప్ప మరొకటి కాదు.

                        ఒక వ్యక్తి తన ఆలోచనలు, పనులు, సంవేదనలు, అన్నీ కూడా ఆ వ్యక్తిలోనే మొదలై, ఆ వ్యక్తిలోనే అంతమవుతున్నాయి. అంటే ఆ వ్యక్తి "స్వేచ్చాజీవి" కింద లెక్క. ఆ వ్యక్తి తన చర్యల గురించి, కార్యాకరణ సంబంధాల గురించి "నాకు తెలియదు" లాంటి పదాలతో పారిపోకుండా చెప్పగలడు అని అర్థం. కానీ అదృష్టవశాత్తో, దురదృష్టవశాత్తో అలా చెప్ప గలిగిన వారు ఇంతవరకూ భూమ్మీద పుట్టలేదు. "నీకు చెప్పవలసిన అవసరంలేదు. నీకెందుకు చెప్పాలి. నా ఇష్టం, నాకు అనిపించలేదు , అంతే !" ఇలా డిప్పలో దాగే తాబేలు వ్యక్తిత్వాలే తప్ప, తాను చేసిన పనికి కార్యాకారణ సంబంధం చెప్పగలిగే, లేదా తెలపగలిగిన వ్యక్తులు లేరు.

                          ఇంత వివరం ఎందుకంటే! వ్యక్తి స్వేచ్చ అనే నేటి తప్పుడు భావాన్ని ఖచ్చితంగా మనం గ్రహించాలనే! నేటి సమాజంలో ఒక కుటుంబాన్ని, అందులోని సభ్యులను, వారి ఇష్టా ఇష్టాలను కొద్దిగా గమనిస్తే చాలు. నలుగురు ఉన్న కుటుంబంలో ఒకరికి నచ్చింది మరొకరికి నచ్చదు. ఇలా ఎందుకు జరుగుతుందంటే అ నలుగురు వ్యక్తులు, నాలుగు రకాల "వ్యక్తిత్వాలతో" నాలుగు కుటుంబాలకు ప్రతినిధులై ఉంటారు.  ఒకే ఇంటిలో భార్య, భర్త, పిల్లలుగా కంటికి కనిపించే  బంధంలో ఉన్నప్పటికీ, వారి మూలాలు వేరు వేరు కుటుంబాలలో ఉంటాయి.

11, జూన్ 2015, గురువారం

పవిత్ర కుటుంబం HOLY FAMILY ( republish)

సృష్టి ఆదిలో కుటుంబాలు కాలుష్య రహితంగా ఉన్నాయి. భూమిలోనూ భూమిపైనా జీవరాశికి సంబంధించిన ప్రతి కుటుంబం జీవించడానికి సొంత ఆస్థి ఉంది. సొంత ఆస్థి అనగా - భూమి, ప్రకృతి, పశు పక్ష్యాదులు, పనిముట్లు, వాహనాలు. ఇలా ఆ మానవుడి సొంత కుటుంబానికి అవసరమైన సమస్తం.
ఆ కుటుంబం యొక్క సొంత ఆస్థులు అవిభాజ్యమైన భాగాలు. కుటుంబానికి సంబంధించిన సొంత ఆస్థి యొక్క స్థిరాస్థులన్నీ, వాటి స్థిర రూపాలతో ఆ కుటుంబం యొక్క అధిపతి మానవుడి ప్రకృతి  మూల స్వరూపాధీనంలోనూ, అలాగే ఆత్మ మూల స్వరూపాధీనంలోనూ ఉంటాయి. వాటి వ్యక్త రూపాలుగా భూమిపైన వారి స్వంత నేల, వ్యక్తులు, సాధనాలు, నీరు, జీవ జాతులు ఉంటాయి. ఇదీ పవిత్ర కుటుంబమం అంటే. పరాయితనం లేని స్వచ్చమైన ఈ కుటుంబం యొక్క సహజ నిర్మాణ అస్థిత్వ స్వరూపమే పవిత్ర కుటుంబం.
వ్యక్తి యొక్క గతమంతా ఆ వ్యక్తి ప్రకృతిలో ఙ్ఞాపకంగా నమోదయి ఉంటుంది. పాత విషయాలను రికార్డులను చూసి తెలుసుకోగలిగినట్లు, ప్రతి వ్యక్తీ తన గతాన్ని తెలుసుకొనగలిగే సదుపాయం ఉంది.
"నేను" అంటే - ఈ కుటుంబం యొక్క సంఫూర్ణ స్వరూపంలో ఒక పరమాణు విభాగం మాత్రమే. అంటే పరమాణువులోని ఋణ, ధనాత్మక స్వభావాలలో ఒకటి మాత్రమే.
వ్యక్తి తన కుటుంబం యొక్క అవిభాజ్యమైన మొత్తంలో ఒక భాగం. కుటుంబం యొక్క సొంత ఆస్థిలో ప్రతి వ్యక్తిత్వానికీ ఖచ్చితమైన వ్యక్తిగతమైన సొంత ఆస్థి అనేది ఉంటుంది. వ్యక్తి- వ్యక్తిగత సొంత ఆస్థి; కుటుంబం, కుటుంబ సొంత ఆస్థి అనేవి అవిభాజ్యమైనవి. ఒక అవయవం ఎలాంటిదో; అతనికి,  అతని వ్యక్తిగత ఆస్థి కూడా అలాంటిదే. వ్యక్తిత్వం అనేది కేవలం వ్యక్తి దేహంలోనో లేదా ఆత్మలోనో మాత్రమే ఉండేది కాదు. అతని సొంత ఆస్థిలోనూ ఉంటుంది.

తొలి అడుగు





                     సత్యం పూర్తిగా తెలిసిన తర్వాత మాత్రమే వ్యక్తి ధర్మబద్ధంగా జీవించడానికి వీలవుతుంది.

అధర్మం సృష్టించిన బంధాలు తెంచుకోకుండా, కాలుష్యాన్ని తొలగించకుండా వ్యక్తులు సత్యాన్ని తెలుసుకోలేరు.

"సత్యం తెలుసుకోవాలి"
"ధర్మబద్ధంగా జీవించాలి"

ఈ సంకల్పంతో తొలి అడుగు వేయండి. ధర్మం+ దైవం మీ మలి అడుగులకు రాజ మార్గం నిర్మిస్తుంది.

9, జూన్ 2015, మంగళవారం

మానవుని సమస్య (re publish)

ఒక యూనిట్ లోని ఒక వ్యక్తిత్వం కలిగిన ఆడ, మగ వ్యక్తులు గానీ, వేరే వ్యక్తిత్వం కలిగిన వ్యక్తితోగానీ , వ్యక్తులతో గానీ సంభవించడం ద్వారా వ్యక్తిత్వాల కలయిక అనేది జరుగుతుంది. కలుషితం కావడం అనేది ఇక్కడి నుంచే మొదలయింది.
సొంత స్వభావం, వ్యక్తిత్వం ఉన్న ఆడ, మగల కలయిక తప్ప మిగిలిన కలయికలన్నీ కాలుష్య కారకాలే, బంధ కారకాలే! బంధుత్వం, కులం, గోత్రం, మతం, ప్రాంతం, భాష, కులాంతర, మతాంతర, దేశాంతర, ఖండాంతర - ఇలా అనేక రకాలుగా జరుగుతున్న కలయికలన్నీ కూడా కాలుష్య కారకాలే తప్ప; స్వచ్చమైన, సహజమైన, వ్యక్తిత్వాల కలయికలు కావు అన్నది నేడు మానవాళి గుర్తించవలసిన సత్యం.
 
మానవుడి "సమస్య" ఏమిటి? అనేది ప్రశ్న. మానవుడి సమస్య "కాలుష్యం" . అంటే! మానవుడు "కలుషితం" కావడం అనేది మానవుడి సమస్యకు మూలం- మొదలు.
ఇలా మొదలైన "కలుషిత" మానవ సంబంధాల వలన నేటికీ, ప్రతి వ్యక్తీ తన సొంత "స్వభావాన్ని" వ్యక్తిత్వాన్నీ గ్రహించలేని హీనమైన స్థితికి చేరుకున్నాడు.
ప్రతి మనిషీ ఒక కుటుంబంలో సభ్యుడు. ఈ కుటుంబం అనేది కోట్ల సంఖ్యలో సభ్యులు కలది.
ప్రతీ కుటుంబానికి "అధిపతి " అయిన మానవుడు ఉంటాడు. ఈ మానవుడు బ్రహ్మ, విష్ణు, పరమేశ్వర -సరస్వతి, లక్ష్మి, కాళిక కావచ్చు. యెహోవా, ఏసు, పరిశుద్ధాత్మ కావచ్చు. మహ్మద్, అల్లా కావచ్చు. ఇలా కుటుంబానికి అధిపతులు , దేవతలుగా, ఇలవేల్పులుగా ప్రజలకు సుపరిచితమే. వీరు ఆయా కుటుంబాలకు అధిపతులుగా(Head of the family) ఉంటారు.
ప్రతి వ్యక్తి తన స్వభావాన్ని వ్యక్తిత్వాన్ని తెలుసుకున్న తరువాత, తన యూనిట్‍ను తెలుసుకోగలడు. తద్వారా తన కుటుంబాన్ని తెలుసుకోగలడు. కంటితో చూసి తెలుసుకోగల గుర్తులు, తెలుసుకోవడం అనే ప్రక్రియలో ఒక చిన్న సాధనం మాత్రమే అని ఇక్కడ గుర్తుంచుకోవాలి.
వ్యక్తి తన కుటుంబ సభ్యులను గుర్తించడానికి కూడా ఇక్కడ చిన్న గుర్తు తెలుసుకుందాం. అదేమిటంటే- పాదాల వేళ్ళ నిర్మాణ స్వరూపం. ఇది కుటుంబం మొత్తానికి ఒకేలాగా ఉంటుంది. వ్యక్తి( దేహం) మూలాలు అయిన పాదాలు భూమిపైన ఉంటే, కుటుంబ మూలాలు భూమిలో ఉంటాయి.
కుటుంబంలోని సభ్యులందరూ ఈ కుటుంబ అధిపతితో అవిభాజ్యమైన (విడదీయలేని) భాగాలుగా ఉంటారు. 
భౌతికం అనగా! పంచ భూతాత్మకంగా పిలువబడే దేహాలు అవి ఆడ+ మగ  - ఇవి బౌతిక నేత్రాలతో చూడగలిగినవి.
భూమి, సముద్రం, నక్షత్రాలు, గ్రహాలు - ఉపగ్రహాలు, ఉల్కలు, రాయీ, ఇనుము, బంగారం మొదలైనవి సమస్త వస్తు, జీవజాలం అంతటి లోనూ స్త్రీ , పురుష "శక్తి" సామర్ధ్యం ఇమిడి ఉంటుంది.
    రాయి అనే పదార్థానికి మూలం రాయి అనే వ్యక్తిత్వం ( కారెక్టర్) కలిగిన ఆత్మ, ప్రకృతి స్వరూపాలయిన ఆడ, మగ- ఇవి ఒకే జంట అయి ఉంటుంది. ఈ జంట అనేది సహజమైంది, స్వచ్ఛమైంది.
     అధి భౌతికం అనగా అంతర్ నేత్రంగా పిలువబడే నేత్రాలతో మాత్రమే చూడగలిగిన దేహాలు,  ప్రకృతి + పురుష లేదా, శక్తి స్వరూపం + ఆత్మ స్వరూపం.
     ప్రతి వ్యక్తికీ భౌతికం, అధి భౌతికం అనే ఈ రెండు రూపాలు ఉంటాయి.
     ఈ రెండు రూపాలకు ఆధారమైన మూల స్వరూపాలు ఉంటాయి. వాటి కేంద్రాలు వేరు వేరుగా ఉంటాయి. స్త్రీలకు మూల ప్రకృతి మూలంలో స్థానం ఉంటుంది. భౌతిక ప్రపంచం అనేది ప్రకృతి యొక్క స్వరూపం. దీనికి మూలం "భూమి" . ఆత్మలకు మూలం దైవం అనే వ్యక్తిత్వం కలిగిన దైవాత్ముడు ఆత్మలకు మూల స్థానం.
      వ్యక్తి అస్తిత్వం అనేది వ్యక్తి యొక్క మూల స్వరూపాలకు భౌతిక స్వరూప ప్రతినిధి. ఆత్మ మూలాలను ప్రకృతి మూలాలను, కలిపే జంక్షన్ ఆడ, మగ వ్యక్తులు.
     ఈ వ్యక్తి " పునాది " ఆధారంగా విశ్వంలో వ్యక్తికి అనేక స్థావరాలు, అనేక అస్తిత్వాలు ఉన్నాయి. విశ్వ వ్యాప్తమై ఉన్న "వ్యక్తిత్వం" గురించి ఈ సందర్భంలో తెలియజేయబడటం లేదు. అయినా ఈ విషయం దృష్టిలో ఉంచుకొని ముందుకు సాగాలి.
    కోట్ల సంఖ్యలో వ్యక్తులు గల కుటుంబాలు వేల సంఖ్యలో భూమి కేంద్రంగా నివసిస్తున్నాయి.   

సంకల్పానంతరం



ఒక వ్యక్తి" సంకల్పం " మొదట అతడి యూనిట్ ‍లో చలనం తీసుకొని వస్తుంది. వ్యక్తి ధర్మబద్ధంగా జీవించాలి అంటే తప్పని సరిగా అతడి యూనిట్ కుటుంబం కూడా ధర్మబద్ధంగా జీవించి తీరాలి. సంకల్పించిన తర్వాత జాగ్రత్తగా గమనించండి. మీలో మీకు అర్థమయ్యే అంతరంగిక ఘర్షణను. ధర్మబద్ధంగా నడవండి. త్వరలోనే మీకు" సత్యం" తెలిసి వస్తుంది.

మొదట నీ వ్యక్తిత్వపు రెండో సగాన్ని( personality) గుర్తు పడతావు.  తర్వాత నీ యూనిట్‍ని గుర్తిస్తావు( human code). తద్వారా నీ కుటుంబాన్ని గుర్తు పడతావు(family code).

ధర్మబద్ధంగా జీవించడం కోసం వ్యక్తి సంకల్పం ద్వారా మొదలు పెట్టిన ప్రక్రియ, సత్యం పూర్తిగా తెలిసే వరకూ కొనసాగుతుంది.
   

మానవ శాస్త్రం HUMONOLOGY ( Republish)

మనిషి గురించి "సంపూర్ణంగా" తెలియజేయడం, మనిషి సమస్యలు వివరించి దానికి పరిష్కారం తెలియజేయడం, భవిష్యత్తులో "సమస్యలు" రాకుండా ఎలా జీవించాలో తెలియజేయడం మానవశాస్త్రపు "లక్ష్యం"
    మనిషి అనగా!
        అణువులోని శాశ్వత సభ్యుల పూర్ణత్వమే మనిషి. మానవుడు, వ్యక్తి వంటివి మనిషికి పర్యాయ పదాలుగా వాడుకుంటున్నాం. అయితే మనిషి, మానవుడు ఒక్కటే గానీ, మనిషి, వ్యక్తీ సమానార్ధకాలు కావు.
        అణువులో మొత్తం ముగ్గురు మగవారు, ముగ్గురు స్త్రీలు, ఉంటారు. ఈ మొత్తం ఆరుగురి సమగ్ర స్వరూపమే "మనిషి" అనగా మనిషి= అణువు. అణువులో లేదా మనిషిలో మొత్తం ఆరుగురు వ్యక్తులు ఉంటారు.
    
ఈ ఆరుగురు వ్యక్తులు మూడు శాశ్వత స్వభావాలనూ, వ్యక్తిత్వాలనూ కలిగి ఉంటారు. స్వభావం అనగా ఎలాక్ట్రాన్, ప్రోటాన్, న్యూట్రాన్‍లని అర్థం.
   
    ఎలక్ట్రాన్ అనేది ప్రకృతి స్వరూపంగా ఉండి భౌతిక దేహాలకు మూలమై, భౌతిక స్వరూపాల ఆధారంగా శక్తిని సృష్టించే మూల పదార్ధంగా ఉంటుంది.
    ప్రోటాన్ అనేది ఆత్మ స్వరూపాధిపతిగా ఉండి బలాన్ని పెంపొందించే సాధనంగా పని చేస్తుంది.
    న్యూట్రాన్ అనేది మనస్సు యొక్క స్వరూపమై మొత్తం యూనిట్ యొక్క సామర్ధ్యంగా ఉండి, శక్తిని సమన్వయం చేసే మూల పదార్ధంగా ఉంటుంది.
            ఆత్మలకు సూర్యుని నుండి
            మనస్సుకు చంద్రుని నుండి
            శరీరానికి భూమి నుండి
            శక్తి సమకూరుతుంది
    స్వభావాలకు మూలం సూర్యుడు, చంద్రుడు, భూమి ( సూర్యుడు = ప్రకృతి+ పురుషుడు; చంద్రుడు = ప్రకృతి+ పురుషుడు; భూమి = ప్రకృతి+ పురుషుడు). వీరికి కూడా ఆత్మ స్వరూపాలు, ప్రకృతి స్వరూపాలుఉంటాయి. వీరూ చావు, పుట్టుక అనే చట్రంలో వ్యక్తులుగా జీవిస్తూ, సమస్త మానవుల అభివృద్ధికి మూలంగా ఉంటారు.
    ప్రతి స్వభావ స్వరూపానికి ఒక ప్రత్యేక వ్యక్తిత్వం (క్యారెక్టర్) ఉంటుంది.
   
    మనుషులందరూ(వ్యక్తులు) ఒకటే అనే భ్రమ బాగా చలామణీలో ఉన్నా, తక్షణం కంటి చూపుతోనే ఈ బేధాన్ని వ్యక్తులు గుర్తించగలిగే గుర్తును ఈ సందర్భంలో తెలియజేస్తాను. వ్యక్తుల చెవి నిర్మాణాన్ని గమనించండి. చెవి పోగులు పెట్టే కింది భాగంలో అతుకుని ఉన్నట్టుండి చిన్నగా కనిపించే చెవులు, వెడల్పుగా కనిపించే చెవులు, మధ్య రకంగా ఉండే చెవులు - మూడు రకాల స్వభావాలను తెలియ జేస్తాయి.
    ఒక వ్యక్తిత్వం ఈ మూడింటిలో ఏదో ఒక స్వభావానికి ప్రతినిధి అయినప్పటికీ, ప్రతి వ్యక్తి దేహం ఈ మూడు స్వభావాలతోనే నిర్మితమై ఉంటుంది. కాబట్టి ప్రతి భౌతిక దేహం కలిగిన వ్యక్తిలో ప్రకృతి, మనస్సు, ఆత్మ అనుసంధానం చేయబడి నిర్మించబడ్దాయి.
    ఈ అంశాన్ని వ్యక్తి దేహంలో సులభంగా గుర్తించే గుర్తులున్నాయి. అవి ఏమంటే - వ్యక్తి చేతి, పాదాల వేళ్ళు.
బొటన వేలు న్యూట్రాన్‍కు, చూపుడు వేలు, నడిమి వేలు ప్రోటాన్‍కు, చివరి రెండు వేళ్ళు ఎలక్ట్రాన్‍కు ప్రతినిధులుగా ఉంటాయి. వ్యక్తి తన యూనిట్ సభ్యుల స్థితిగతులను వేళ్ళు ఉన్న స్థితిని బట్టి అంచనా వేయవచ్చు.
    ఒకే వ్యక్తిత్వం ఉన్న ఆడ, మగ వ్యక్తులు తమ వ్యక్తిత్వపు రెండో సగాన్ని గుర్తించడానికి సులభమైన గుర్తు ఉంది. అది వ్యక్తి యొక్క స్వభావాన్ని గుర్తించే సాధనం : చెవి నిర్మాణంతో పాటు అదనంగా చేయి, పాదాలలో ఉండే రేఖల నిర్మాణం ఒకే వ్యక్తిత్వపు వ్యక్తులకు ఒకేలాగా ఉంటాయి.
    ఉదా:  న్యూట్రాన్ స్వభావం కలిగిన మార్టిన్ అనే వ్యక్తి - ధర్మం అనే వ్యక్తిత్వాన్ని కలిగిన ఆత్మ స్వరూపుడు అనుకుంటే; ధర్మం అనే వ్యక్తిత్వాన్ని కలిగిన న్యూట్రాన్ స్వభావిని అయిన ప్రకృతి స్వభావిని అయిన ప్రకృతి స్వరూపిణి మేరీ అనే అమ్మాయికీ , అంటే ధర్మం వ్యక్తిత్వం కలిగిన  మార్టిన్, మేరి అబ్బాయి, అమ్మాయిలకు మాత్రమే ఒకే రకమైన రేఖలు చేతులలో, పాదాలలో ఉంటాయి. వందల కోట్ల వ్యక్తులలో ఒకే వ్యక్తిత్వం కలిగిన వ్యక్తులకు మాత్రమే ఒకేలాగా రేఖలు ఉంటాయి వారు మాత్రమే MEDE FOR EACH OTHER

ధర్మం యొక్క శక్తి



అసత్యంతో, అధర్మంగా తనను తాను మోసగించుకుంటూ ఇతరులను మోసగిస్తూ రాజీపడి బతకకూడదు అని నిర్ణయించుకొని వ్యక్తి ఇలా సంకల్పించుకోవాలి.

" నా గురించి సత్యం నాకు తెలియాలి".
"నేను ధర్మబద్ధంగా జీవించాలి".

ఒక వ్యక్తి ఇలా సంక్ల్పించగానే మొదట ఆ వ్యక్తి "యూనిట్ సభ్యులు" తీవ్ర ఆందోళనకు దిగుతారు. మానసిక ఘర్షణగా గుర్తించే ఘర్షణకు దిగుతారు. ఆ వ్యక్తి చుట్టూ ఉన్న వ్యక్తుల ద్వారా గొడవలకు, వాదనలకు దిగుతారు. అది కూడా అధర్మబద్ధంగా!

    మరేమీ పర్వాలేదు. అధర్మానికి కూడా ధర్మం నుండే శక్తి అండుతుంది. కాబట్టి వ్యక్తి ధర్మ బద్ధంగా జీవించాలని సంకల్పిస్తే, అందుకు నిలబడితే, ఆ వ్యక్తిని నిలవరించే శక్తి విశ్వం మొత్తానికి కూడా చాలదు.
   

8, జూన్ 2015, సోమవారం

ఒక్క క్షణం

                                                   


                                                                                          - ఆచార్య మేడిపల్లి రవికుమార్
                                                                                            శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం,
                                                                                                      తిరుపతి            
                                                                                                                                                                                                                                                                                                                                             
    " ఒక విధ్వంసం జరగకుండా ఒక నూతన నిర్మాణాన్నీ, గతాన్ని సమీక్షించకుండా ఒక మంచి భవిష్యత్తునూ ఊహించలేం !"

         ఏదైనా ఒక కొత్త అంశం- అది అనుభవం కావచ్చు. అనుభూతి కావచ్చు. అది జీవితానికో, సృష్టికో సంబంధించిన ఒక సిద్ధాంతం కూడా కావచ్చు - మనల్ని తట్టినప్పుడు ప్రకంపనలు తప్పవు - వేల సంవత్సరాలుగా ప్రపంచంలో జరిగింది ఇదే !
   
        ప్రతి ప్రకంపనకీ నడిమి కాలం ఒక క్షణం కావచ్చు, ఒక యుగం కావచ్చు. ఖచ్చితంగా కాలం గురించి చెప్పలేనుగానీ "ఇది" కూడా ఒక ప్రకంపనే.
   
దీన్ని ఒక గ్రంథమనో, ఒక వ్యాసమనో, ఒక సిద్ధాంతమనో, ఒక ప్రేలాపన అనో, ఒక వెర్రి ఊహ అనో చెప్పలేను - ఎందుకంటె ఎందులోనూ ఇది ఇమడదు.

    ధర్మం - సత్యం - కాలం - ప్రకృతి - పురుషుడు - వ్యక్తి - మనిషి - కుటుంబం- అణువు - పరమాణువు - శక్తి - శ్రమ - భూమి- ఈశ్వరుడు - క్రీస్తు - అల్లా ... ఇలా ఎన్నో ఉన్నాయి. వీటి అసలైన స్వరూప స్వభావాలు, రంగు రుచీ వాసనలో ఇవి ఇలాగే ఉంటాయి గాబోలు.

    ఇది కంటితో చూసి చదివితే ఒక పట్టాన అర్థమయ్యేది కాదు - జీవితానుభవంతో దర్శిస్తేనే కొంత మేర చేరుకోగలం. ఈ ప్రక్రియ జరిగిన తరువాత మనం రిలాక్స్ కావచ్చు - కలవరపడవచ్చు - విపరీతమైన ఆకలి అవచ్చు - ఆకలి లేకపోవచ్చు - కుంభకర్ణుడి నిద్రపోవచ్చు - నిద్ర లేని రాత్రులు  గడపొచ్చు - భార్యనో, భర్తనో ఆమడ దూరంలో ఉంచొచ్చు - అమాంతంగా ఆలింగనం చేసుకోవచ్చు - ముద్దులు పెట్టవచ్చు - హద్దులు మీరవచ్చు - అద్దంలో మన శరీరాల్ని నగ్నంగా చూసుకొని గ్రీకు పురాణ నాయకుడు (NARACISSUS) లాగా మనకు మనం ముద్దాడుకోవచ్చు - మన మీద మనకే అసహ్యమేసి అద్దాన్ని పగలకొట్టవచ్చు - కొన్ని ధర్మాల్ని, వాస్తవాల్ని గుర్తించకపోతే దర్శించబోయే భవిష్యత్తు రూపాన్ని చూసి మన తలలు నేలకేసి కొట్టుకోకుండానే బద్దలు కావచ్చు - ఇంకా ఏవేవో జరగొచ్చు - అసలేమీ జరగక పోవచ్చు - ఇదంతా ఎందుకు చెపుతున్నానంటే పై వాటిలో ఏవి జరగినా జరగకపోయినా అది దీని తప్పు కాదు. వేల సంవత్సరాలుగా మన రక్తంలో ఇంకి పోయిన, మనల్ని మన జీవితాల్ని నడిపిస్తున్న, శాసిస్తున్న భావజాలమే అందుకు కారణం.

    వ్యక్తికీ, మనిషికీ తేడా ఏమిటి ? దైవానికీ దయ్యానికీ భేదం ఏమిటి ? మార్క్స్ కూ మార్క్సిస్టులకీ వైరుధ్యం ఉందా ? స్త్రీ పురుషులు ఎవరు ? మనలో సగ భాగంగా ఉండి జీవితాన్ని పంచుకుంటున్న వాళ్ళు నిజంగా మన భార్యలు, మన భర్తలేనా ? జీవితాలు ఎందుకు దారి తప్పుతున్నాయి ? కుటుంబాలు ఎందుకు కూలిపోతున్నాయి ? అక్రమ సంబంధాలు ఎందుకు ఏర్పడుతున్నాయి ? హత్యలు, అత్యాచారాలు ఎందుకు జరుగుతున్నాయి ? వాటి వెనుక ఉన్న శక్తులు ఏమిటి ? ఇందులో ఎవరు నేరస్తులు ? జన్మనిచ్చిన వాళ్ళూ, తోడబుట్టిన వాళ్ళూ నిజంగా నీ కుటుంబ సభ్యులేనా ? ఇలాంటివి మనల్ని భయకంపితుల్ని చేసే గంభీరమైన ఆలోచనలు కావచ్చు, చొప్పదంటు ప్రశ్నలూ కావచ్చు. వీటి పట్ల మన మనస్సు కొంతసేపు లగ్నం చేయాలంటే మన శరీరానికీ, మన మనసుకూ ఎంతో శక్తి కావాలి. మరెంతో ధైర్యం ఉండాలి. వీటన్నింటినీ మించి నీ గురించీ, మనిషి గురించీ, దైవం గురించీ, ధర్మం గురించీ, ప్రకృతి గురించీ, ముఖ్యంగా "భవిష్యత్తు" గురించీ వాస్తవం తెలుసుకోవాలన్న ఉత్సాహం ఉండాలి.

    ఇందుకు సిద్ధమైన వాళ్ళు ఎవరన్నా ఉంటే దీన్ని తెరవండి. కలిచివేసిన అంశాలు ఏవన్నా ఉంటే వాటి గురించి ఆలోచించండి. భయపడకుండా మరొకరితో పంచుకోండి. కలవరపెట్టిన అంశాలు ఏమీ లేకపోతే దీన్ని మరొకరి దర్శనంలో ఉంచండి. వాళ్ళకీ ఇదే అనుభవమైతే దీన్ని కాల్చివేయమని చెప్పండి. వీటిలో ఏది చేసినా లాభమే. నష్టం లేదు.

సంకల్పం


సంకల్పం అనేది వ్యక్తి తన పూర్ణత్వానికి ఇచ్చే ఆదేశం. తన సొంత ఆత్మను, ప్రకృతిని దాని స్థితి గతిని నిర్ణయించే నిర్ణయాధికారం వ్యక్తికి మాత్రమే ఉంది. ఇది తెలియని వ్యక్తిని, అతని సుదీర్ఘ గతం, అధర్మంగా సంపాదించిన సంపద, సంబంధాలు వ్యక్తిపై అధిక శక్తిని వినియోగించి ముందుకు నెడుతుంటాయి.ఊపిరి సలపనంత గందరగోళాన్ని వ్యక్తిలో ప్రవేశపెడతాయి. ఫలితంగా వ్యక్తి తొందరగానే అధర్మంతో రాజీ పడుతున్నాడు. ఏదో ఒక రూపంతో ఇది జరుగుతుంది. ఈ రాజీ మార్గంలో చివరి మజిలి సన్యాసం.

6, జూన్ 2015, శనివారం

విశ్వవినాశనం



                కాలుష్యం నుండి అసహజ బంధాల నుండి బయటపడడం అనే ప్రక్రియ కూడా ఒక్కరితోనే మొదలవుతుంది. అవ్వాలి కూడా. ఎందుకంటే అధర్మం సృష్టించే వైరుధ్యం, హింస, పీడనను అధర్మ- ఆత్మ స్వరూపుడు కూడా భరించలేడు. కనుక ఈ పరిణామం విశ్వవినాశనం అనే నూతన స్థితికి చేరుకుంది.

                 ఈ స్థితిని అధిగమించి మానవాళి సుఖశాంతులతో జీవించాలి అంటే ఒకే ఒక్క దారి ఉన్నది. సత్యం- అసత్యం, ధర్మం- అధర్మం ఏమిటి అనే "విచక్షణ" తనకు లేదు. కోల్పోయాను, అని గ్రహించగలిగిన వ్యక్తి తనకు తాను సత్యం తెలుసుకొని ధర్మ బద్ధంగా జీవించాలని సంకల్పించి , ఆ వైపుగా ప్రయాణం చేయడమే.

   

సత్యం తెలుసుకోవడం



                    ఏ వ్యక్తి గానీ, వ్యక్తిత్వపు వ్యక్తులు గానీ విడిగా ఎన్నటికీ "సత్యం" తెలుసుకోలేరు.

ఎందుకంటే, వ్యక్తిగానీ, వ్యక్తిత్వపు జంటగానీ, తమ యూనిట్‍లో తామొక భాగం మాత్రమే. ఒక యూనిట్ ఒక కుటుంబంలో ఒక భాగం మాత్రమే.

              ఒక వ్యక్తి తెలుసుకొనే విషయం గానీ, అనుభవించే అనుభవంగానీ, సాధించే లక్ష్యం గానీ , ఏదైనా ఆ వ్యక్తి తన  యూనిట్, కుటుంబం యొక్క సహకారంతోనే క్రియలు చేస్తాడు.

    కాలుష్యమైనా, బంధమైనా, బంధ విమోచనమైనా మొదట ఒక వ్యక్తిద్వారానే ఆ కుటుంబం మొత్తానికి అనుభవంలోనికి వస్తుంది.

                        విశ్వగతి తప్పడానికి తప్పుడు మార్గంలో పడిన తొలి తప్పటడుగు వేసిన వ్యక్తి వెనుక తప్పుడు ఆలోచనలు కలిగిన వారెవరూ లేరు. అయినా విశ్వగతి తప్పిపోయింది. ఇప్పుడూ అందరూ ఆ తప్పుడు మార్గానికే అను-చరులుగా మారిపోయారు. స్వచ్చమైన సహజ సంబంధాలతో ప్రారంభమైన సృష్టిలో కాలుష్యం అనేది సహజ బంధాల ద్వారా విశ్వ వ్యాపితం అవుతుంది.

5, జూన్ 2015, శుక్రవారం

self knowledge



                    ఈ రకమైన పతనావస్థ స్థితి నుండి బయతపడవేసి వ్యక్తి తన విశ్వరూపాస్తిత్వాన్ని తెలుసుకొని, తన ఆధీనంలో తానుంటూ, అనుభవిస్తూ ఆనందింపజేసే ప్రక్రియకు మూలం భూమిపైన నివశించే వ్యక్తిత్వం యొక్క రెండు సగ భాగాలు- ఆడ, మగ దేహాలు. ఈ రెండు దేహాలు విశ్వరూపమైన తమ సొంత సామ్రాజ్య ప్రవేశ ద్వారాన్ని తెరచే రెండు తాళం చెవులు( keys).

                      స్వచ్చమైన, బంధరహితమైన ఆడ, మగ వ్యక్తులు తమకే సొంతమైన, తమ రెండవ సగం యొక్క వ్యక్తిని లైంగిక సంపర్గం ద్వారా కలవడం వలన మాత్రమే తమ సొంత సామ్రాజ్య ప్రవేశ ద్వారాన్ని తెరవగలరు. ఇలా సొంత సామ్రాజ్యం లోనికి ప్రవేశించిన వారికి మాత్రమే సొంత జీవితం గురించిన "సత్యం" తెలుసుకోగలరు(self knowledge).
   
                      ఇలా సొంత జీవితంలోకి ప్రవేశించిన వారికి మాత్రమే దేవుని రాజ్యం, స్వర్గం అనే ఊరించే ఆనందమయ జీవితం, దేవుని యొక్క స్పర్శ అనుభవంలోకి ప్రత్యక్షమవుతాయి. కాలుష్యం , బంధాలు సృష్టించిన భ్రమలు అదృశ్యం అయిపోతాయి

3, జూన్ 2015, బుధవారం

PERSONAL CODE - PERSONALITY CODE



                                        వ్యక్తి దేహంతో, ఆత్మతో, ప్రకృతి ద్వారా చేసే పనులన్నీ వాటిలోనే రికార్డయి ఉంటాయి. "ఆత్మ" రికార్డు వేరుగా, "ప్రకృతి" రికార్డు వేరుగా ఉంటాయి. PERSONAL CODE  ఆధారంగా PERSONA    LITY CODE అనేది ఉంటుంది. ఇది వ్యక్తి యొక్క ప్రత్యేకతకు మూలంగా ఉంటుంది. మనుషులంతా ఒకటే అనే భ్రమ నుండి బయటపెట్టి, వ్యక్తికి సమూహం నుండి ప్రత్యేకతను బహిర్గతం చేసేది "వ్యక్తిత్వం". ఈ వ్యక్తిత్వపు గుర్తు , వ్యక్తి గుర్తు ఆధారంగా ఋణ, ధనాత్మక లక్షణాలతో రెండుగా విభజింపబడి ఉంటుంది.
                    
                               "ప్రతీ వ్యక్తీ విశ్వరూపులే", విశ్వవ్యాపితం అయి ఉన్న వ్యక్తి, వ్యక్తిత్వానికి భూమిపైన నివశించే వ్యక్తే మూలం. ఈ మూలంతోనే వ్యక్తి తన విశ్వస్వరూప స్వభావాలను ప్రత్యక్ష ఙ్ఞానంతో (direct perception) తెలుసుకొని తనను తాను సంరక్షించుకుంటూ వృద్ధి చేసుకోవడం, లేదా తనను తానొక అల్పుడిని అని భావించి లేదా నమ్మి, తనను తానే పతనావస్తకు చేరేలా ప్రవర్తిస్తాడు. తనను తాను తెలుసుకోలేక పతనమయ్యే వ్యక్తుల పతనం ఆధారంగా వృద్ధి చెందే దేవుళ్ళూ, మతాలు, సిద్ధాంతాలు - "వ్యక్తి అల్పుడు, స్వల్పుడు" అనో లేదా సొంత అస్తిత్వం గానీ,  వ్యక్తిత్వంగానీ  లేని, మొత్తంలో భాగమనే భ్రమల్ని వ్యక్తులు బలంగా వృద్ధి చేయాలని చూస్తారు.

2, జూన్ 2015, మంగళవారం

HUMAN CODE



                             ఈ సృష్టిలో ప్రతీ మనిషి మూడు రకాల వ్యక్తిత్వాలతో, మూడు రకాల స్వభావాలతో ఉంటాడని ముందే చూసాం. ప్రతీ వ్యక్తీ ఒక యూనిట్ అనగా మనిషిలో భాగం. అలాగే ప్రతీ మనిషీ ఒక కుటుంబంలో భాగంగా ఉంటాడు.

                              సృష్టిలో ప్రతీ వ్యక్తికీ ప్రత్యేక గుర్తింపు ఉంటుంది. వ్యక్తి దేహానికి ప్రకృతి ద్వారా స్వభావం, పురుషుడి ద్వారా వ్యక్తిత్వం( charecter) వస్తుంది. స్వభావం, వ్యక్తిత్వం అనేవి దైవాదీనంగా ఉంటాయి. అయితే స్వభావం, వ్యక్తిత్వం కలిగిన ఆత్మ, ప్రకృతులకు సొంత గుర్తు ఉంటుంది. ఇది PERSONAL CODE.

గతం-వర్తమానం- భవిష్యత్తు



అవినీతిపరులైన అధికారులు దేవతలను చూసి భయభయంగా బతకడం అనేది గతకాలం అని తెలుసుకోండి.

                                 వర్తమానం, భవిష్యత్తు-లలో ధర్మబద్ధంగా జీవించాలి అనుకునే వారు సగర్వంగా జీవించగలిగే కాలం. స్వంత జీవితంతో మీ స్వంతం అయ్యే కాలం.
                                           మన కాలం.

1, జూన్ 2015, సోమవారం

"మానవ శాస్త్రం" పుస్తకానికి భూమన సుబ్రమణ్య రెడ్డి గారి ముందుమాట


ఈ చిన్న పుస్తకాన్ని చాలా శ్రద్ధగా చదివినాను. రచయితతో ముందుగానే సంభాషణలు కొనసాగినాయి గనుక ఆశ్చర్యపోలేదు. సంభాషణలను అక్షరాల్లో పొదివి చూసినాకా సంబరపడిపోయిన మాట నిజం. విజయభాస్కర్ దీని గురించి రాయమంటాడు గానీ, తొలిమాట, కడమాట అక్కర లేని పుస్తకం ఇది. ఈ పుస్తకం పుస్తకంగానే పాఠకుల్లో కదలిక తీసుకరాగలదని నానమ్మిక. పుస్తకంలోని ఆలోచనల మాదిరిగానే నా ఆలోచనలూ ఉన్నాయి గనుక జీవితాన్ని విజయభాస్కర్ ఈ వయసులోనే ఇంతగా పొదివి పట్టుకోవడం గొప్ప సంతోషంగా ఉంది. మనం మనంగా జీవించడం, ఆనందంగా జీవించడం అనే మామూలు సూత్రాలను లక్ష్యంగా చేసుకొని ఒక మంచి ఆలోచనను మన ముందుంచుతున్న విజయభాస్కర్‍ను మనసారా అభినందిస్తున్నాను
                                                                                                                                                                                                                                                                                -భూమన్