2, ఏప్రిల్ 2015, గురువారం

దోపిడి                        ప్రకృతి వైపరీత్యాలు- భూకంపం గానీ,, తుఫాన్‍లు గానీ , అతివృష్టి , అనావృష్టి లాంటివన్నీ సాధారణంగా ఏదో ఒక ప్రాంతానికే పరిమితం కావడం అనేది ఉంటుంది. 

ఇది ఇలా ఎందుకు ఉంటుంది అంటే- ఆ ప్రాంతం ఏదో ఒక ప్రకృతి యొక్క కుటుంబ స్థావరంగా ఉంటుంది.

ఆ ప్రకృతి కుటుంబంతో ఇతర ప్రకృతి కుటుంబాలుగానీ, కుటుంబంగానీ బంధంలోని వ్యాపార లావాదేవీలలో భిన్నాభిప్రాయాలు తీవ్రమై ఘర్షణకు దారి తీయడం లాంటివి జరిగినపుడు ప్రకృతి విపత్తులు సంభవిస్తాయి.

ఒక ప్రాంతం ఎడారిగా మారింది అంటే- దానర్థం అక్కడ ఉన్న కుటుంబం పూర్తిగా కొల్లగొట్టబడింది అని అర్థం.

x1 అనే ఒక వ్యక్తి రోజుకు 8 గంటలు నిద్ర, 8  గంటలు విశ్రాంతి, 8 గంటలు పని చేస్తాడనుకుందాం. అదే వ్యక్తి xy-1 అనే వ్యక్తితో కలుషితం కావడం ద్వారా అదనపు శక్తి సామర్ధ్యాలు అందుబాటులో ఉంటాయి. దీని ఫలితంగా x1 అనే వ్యక్తి ఒక గంట గానీ, రెండు గంటలు గానీ అదనంగా పని చేశాడనుకుందాం. అప్పుడు y+1   అనే వ్యక్తి యొక్క పని చేసే సామర్ద్యంలోగానీ, విశ్రాంతి, నిద్రా సమయంలోగానీ లోటు ఏర్పడుతుంది. ఫలితంగా y+1  అనే వ్యక్తి పని చేయగలిగిన "సామర్ధ్యం"కుంటుపడుతుంది. ఇలా పరాయి ఆడ, మగలతో కలవడం ద్వారా శక్తి కోల్పోవడం, అదనంగా పొందడం అనే ప్రక్రియ ప్రారంభం అయింది. మొదట పరస్పర అంగీకారం, ఒప్పందంతో  ఇవి జరిగినా, నేటికవి నిరాకరించడానికి గానీ, నిరోధించడానికిగానీ "అసాధ్యం" అనే స్థితికి చేరుకొంది.

నేటి సమాజంలో ధనిక, పేద, దోపిడి, పీడన అనే వాటికి మూలాలు, "కలుషిత వ్యక్తిత్వం"లో ఉన్నవి. దీని ఫలితంగా x,y అనే వ్యక్తులు, వారి భాగస్వాములతో కలిసి, నలుగురూ తమ సొంత అస్థిత్వాలను కోల్పోవడం వ్యక్తిత్వం మరుగునపడి పోవడం అనే నూతన స్థితికి చేరుకొన్నారు.

ఈ "కాలుష్యం" అనేది ద్వంద్వం నుండి బహుళత్వం వైపు పయనించి, వ్యక్తిత్వపు మూలాలను కూడా "నాశనం" చేసే స్థితికి చేరుకొంది.