16, జూన్ 2015, మంగళవారం

స్వంత పిల్లలు ( republish)

                                     పిల్లల పట్ల తల్లితండ్రులు ఎందుకు వ్యాపార ధోరణులతో ఆలోచిస్తారు, నిర్ధాక్షణ్యంగా ప్రవర్తిస్తారు. కుల, మత, జాతి బేధాలతో పెంచుతారు. 
                 పిల్లల తమ జీవనాధారం కోసం ఎంచుకొనే వృత్తి , తమ భవిష్యత్తు అయిన  "వివాహం" లాంటివన్నీ ఎందుకు తల్లితండ్రుల, కుల, మత పెద్దలు తమ అదుపులో ఉంచుకోవాలని చూస్తారు?
ఎందుకంటే?
                 పిల్లలు అనేవారు, కన్న బిడ్డలే కానీ ఆ వ్యక్తుల " స్వంతపిల్లల్ని వారు కనడంలేదు. అసలు వ్యక్తులకు స్వంత పిల్లలు ఉంటారన్న ఙ్ఞాపకత్వ లేదు! ఈ వ్యాపార జీవితంలో వేల సంవత్సరాల క్రిందటే అమ్మేసారు.
                   "స్వంతం" అయిన దాన్ని అమ్మేసి పరాయిని స్వంతం చేసుకొని పరాయీకరణపాలై నానా హింసలు, వేదనలు అనుభవిస్తున్న మానవాళి "విషాద" మహా ప్రస్తానానికి చరమ గీతం ఈ పుస్తకం.
                                        వ్యక్తుల చర్యలను నియంత్రించేది , ఇష్టా ఇష్టాలను నిర్ణయించేది, వ్యక్తికి వచ్చే ఆలోచనలు, ఉద్వేగాలు, ద్వేషం యొక్క స్థితి, గతి, ఆరోగ్య, అనారోగ్యాలు మొదలైనవి అన్నీ కూడా వ్యక్తి యొక్క కుటుంబం ద్వారా జరుగుతాయి. ఓటు హక్కును వినియోగించుకోవడం లాంటి ప్రక్రియలు ఇలానే జరుగుతాయి. రోడ్లపైన అడుక్కునే బిచ్చగాడి నుండి; చిరిగిన, మాసిన బట్టలతో జుట్టు, గడ్డం పెంచి నిర్ధిష్టమైన పరిధిలో సంచరిస్తూ,పిచ్చివారిలా కనిపించేవారైనా, కన్న తల్లితండ్రులను వదిలి హిమాలయాలలో ఘోర తపస్సులు చేసే అఘోరాలైనా,తీవ్ర వాదులైనా తమ కుటుంబ ప్రయోజనాల కోసమే   ఉంటారు. అంతే తప్ప, వ్యక్తులు అనుకున్నట్లుగానో, లేదా వారు చెప్పినట్లుగానో, అవి స్వేచ్చాయుత స్వతంత్ర్య చర్యలు కావు. వారు కుటుంబ అధిపతుల యొక్క ఆఙ్ఞల మేరకే, వారి కను సన్నలలోనే ఉంటారు అనేది బహిర్గతం కావలసిన "సత్యం".
                                                 ఒక వ్యక్తి తన ఆధీనంలో ఉండడం, ఉండలేక పోవడం అనే సమస్య వుంది. కనురెప్ప కదలికల మొదలు, నడక ,మాట, నిద్ర, ఆలోచన, అంతిమంగా తాను ఎలా జీవించాలి, మరణించాలి అనే సమస్త వ్యక్తి ప్రక్రియలు ఏవీ ఆ వ్యక్తి ఆధీనంలో ఉండవు. అన్నీ పరాధీనమై ఎవరో,  ఎలానో కూడా తెలియకుండా; తెలుసుకోలేని  స్థితిలో పరుల చేత నియంత్రించబడే యంత్ర స్థితికి చేరుకున్న వ్యక్తికి స్వాతంత్ర్యం, స్వాధీనం లాంటి పదాలకు అర్థం తెలిసే స్థితే లేదు. 
                                             వ్యక్తికే తెలియనన్ని రూపాలతో వ్యక్తి జీవితం మొత్తం నియంత్రిస్తూ ఉంటే వాటి నుండి బయట పడకుండానే స్వేచ్చ గురించి తపించడం అర్థ రహితం.

కామెంట్‌లు లేవు: