3, మే 2015, ఆదివారం

మత సంస్థల సూత్రీకరణలు- ప్రలోభాలు -3

                      ఆత్మ గానీ ప్రకృతిగానీ స్థిరమైన అస్థిత్వం , వ్యక్తిత్వం కలిగి లేవు. పరిణామ స్వభావం కలిగినది ప్రపంచం. ఇందులో దుఃఖం ఉంది. దుఃఖ రహితమైన స్థితికి చేరుకునే మార్గం ఉంది. ఈ మార్గంలో నిర్వాణ స్థితినో, ఇంక దేనినే పొందక పోతే దుఃఖంలో పుట్టి , జీవించి, దుఃఖంలోనే మరణిస్తాడు. బుద్ధుడు, బౌద్ధం, బౌద్ధవాదులు తెలిపిన సత్యాలు తెలుసుకొని వారు చెప్పిన జీవన విధానంలో జీవించకపోతే ఎవరికైనా దుఃఖమే మిగులుతుంది. 

                     ఆత్మను , ఆధ్యాత్మిక జీవితాన్ని అంగీకరించే ఇలాంటి వారంతా మానవుడి భవిష్యత్తు గురించి ఇలా ఏదో ఒకటి చెప్పి తీరాల్సిందే. అప్పుడు మనిషి భయపడి ఏదో ఒక కంపెనీలో (మతం) సభ్యత్వం తీసుకుంటాడు.

                              ఇక ఆత్మ , ప్రకృతి అస్థిత్వాలను నిరాకరించి వర్తమాన మానవుడు, భౌతిక పదార్ధం యొక్క యాంత్రిక చలనంగా భావించే వారున్నారు. వీరిలో కార్ల్ మార్క్స్ ను అనుసరిస్తున్నామని చెప్పుకొనే కమ్యునిష్టులు ప్రథమ శ్రేణిలో ఉంటారు. ఎందుకంటే సిద్ధాంతం ఆధారంగా వీరు నూతన వ్యవస్థలను నిర్మించారు గనుక వీరు వ్యక్తి యొక్క గతం యాంత్రికం అనే భావం ప్రచారం చేస్తారు. విరుద్ధ శక్తుల మధ్య ఐక్యత, ఘర్షణ, అభివృద్ధి నియమాన్ని గత వర్తమానాలకు అన్వయిస్తారు.వ్యక్తులు, వ్యక్తిగత సంబంధాలు ఎలా ఉండాలని మార్క్స్ ఖచ్చితంగా చెప్పకపోవడాన్ని ఆసరాగా చేసుకున్న మార్క్సిస్టులు మాత్రం గతం సృష్టించిన బంధ వ్యవస్థనే వ్యక్తిగత జీవితంలో ఆమోదించి అనుసరిస్తున్నారు. మార్క్స్ తనకు తెలిసినంతలో స్త్రీ పురుష సంబంధం గురించి ఒక గొప్ప సూత్రీకరణ చేసాడు. "ఒక స్త్రీ, తన పురుషుడిని చేరుకోవడానికి ఎటువంటి ఆటంకాలు లేని వ్యవస్థా నిర్మాణం జరగాలి" అని

కామెంట్‌లు లేవు: