7, మే 2015, గురువారం

దేవుడు- మానవుడు



దైవం అంటే ఈ సమస్త విశ్వాలను సృష్టించే సృష్టి కర్తలైన మానవుడికి కావలసినంత శక్తినీ, సామర్ద్యాన్నీ, సాధనాలనూ అందించేది మాత్రమే.

అంతేకానీ; ప్రార్థనలు, ప్రసాదాలు, భక్తి, అభిషేకాలు, లాంటి తుచ్చమైన చర్యలను ఆశించడం, స్వీకరించడం, అనే పదాలకు అర్థం తెలియని అమాయకుడు  దైవం.

అసత్యంతో, అధర్మంగా మానవుడెన్ని తప్పుడు పనులు చేసినా ఏ నాటికైనా తెలుసుకుంటాడులే అని మానవుడి దుష్ట చర్యలు బాధిస్తున్నా పంటీ బిగువున భరిస్తున్నవాడే దైవం( దేవుడు+దేవత)

ఆమ్యామ్యా ఇవ్వకపోతే మీ పని జరగదనే లంచగొండి భిక్షగాడు కాదు దైవం అంటే.

మీకు తెలుసా ఈ మహా విశ్వాన్ని సృష్టీంచింది ఎవరో?

"ఈ మహా విశ్వం సృష్టి యాంత్రికంగా జరిగిపోయింది"  అనే మూర్ఖులను వదిలిపెడితే ; ఇది దేవుని పనీ, లేదా ఏదో తెలియని మహాశక్తి అని నమ్ముతున్నారు కదా!

అది అసత్యం!
సత్యం ఏమంటే-
మానవుడే ఈ విశ్వ నిర్మాత !

మానవుడే ఈ సమస్త విశ్వానికి కేంద్రం!

మానవుడి కోసమే ఈ సమస్త విశ్వాలు ఉన్నాయి.
మానవుల ఆట వస్తువు   ఈ సమస్త విశ్వం.
ఇదే సత్యం.

కామెంట్‌లు లేవు: