5, మే 2015, మంగళవారం

ఇల్లలుకుతూ పేరు మరచిపోయిన ఈగదేవుడు. సైన్స్ పదార్ధాలే భిన్నమైనవి.మూఢవిశ్వాసాలు కామన్. వర్తమాన జీవితంలో వ్యక్తులను సైన్స్ పేరుతో భయ భ్రాంటులను చేయగల నేర్పు వీరికి మాత్రమే ప్రత్యేకం. 

మత వ్యవస్థలకు చిక్కని మొండి ఆత్మలు, ప్రకృతులు ఏమైనా ఉంటే అవి కూడా తప్పించుకోలేని ఆఖరి అస్త్రం ఒకటి ఉంది. అది మత వ్యవస్థలకు సైన్యాధ్యక్షుడు అయిన వైద్యం. పెట్టుబడిదారీ విధానం అనేది మతం ముద్దుబిడ్డ.

ఇన్ని వ్యవస్థలు గంభీరంగా, దృఢమైన స్వరాలతోమేము చెప్పిందే సత్యం అని ఊదరగొడుతుంటే - ఈ వ్యవస్థీకృత బంధాలనుండి తప్పించుకొని సత్యమేదో, ధర్మమేదో , అధర్మమేదో తెలుసుకోవడం అసాధ్యమనీ, అది మహానీయులకు మాత్రంఏ సాధ్యపడే అంశమనీ ఎన్నో యుగాల తపః ఫలమనీ ఇలాంటి తప్పుడు అభిప్రాయాలు మనకున్నాయి కదా!

ఒక ఈగ ఇల్లలుకుతూ తన పేరు మరచిపోయిందని మనకొక కథ. 

విశ్వనిర్మాణం చేస్తూ చాలా దూరం వెళ్ళిపోయి, సొంతకుంటుంబాబ్బి, సొంత ఇంటినీ, సొంత అస్థిత్వాన్నీ వ్యక్తిత్వాన్నీ కూడా మరచిపోయిన వ్యక్తులం మనం.

కంటికి కనిపించని అణువుకు - అణువు కంటే చాలా చిన్నగా ఉన్న పదార్ధాన్ని దైవకణమని సైంటిస్టులు నేటికి గుర్తించగలుగుతున్నారు. మరి అలాంటి అణువులు లక్షల కోట్ల సంఖ్యలో ఉండే వ్యక్తికి ఆధారంగా దైవం ఉండదా?

అది మీకు తెలియదా?