6, మే 2015, బుధవారం

పరాయీకరణ



                  పరాయీకరణ పాలైన మీ స్వంత వ్యక్తిత్వానికి  గతాన్ని మరచిపోవడం అనేది ఒక ప్రత్యేకత. మన మతిమరుపు ఆధారంగా పుట్టుకొచ్చిన కొత్త మోసగాళ్ళే దైవ ప్రచారకులు., మతాలు, గురువులు, బాబాలు, సైన్స్ వాదులు మొదలైన వాళ్లు. మన నిస్వార్ధత, త్యాగ గుణం, నమ్మకం, అపనమ్మకం లాంటి దుర్గుణాలే వీరికి సోపాన మార్గాలు.

              స్వంత పదార్ధం అంతా స్వంతం చేసుకోవాలనుకునే స్వార్ధపరులకు స్వాగతం. ఎందుకంటే స్వ+అర్థం = మిమ్మల్ని మీరు తెలుసుకోవడం. మిమ్మల్ని మీరు ఉద్ధరించుకోవడం.

             మనలో దాగి ఉన్న ప్రేమను, ఆనందాన్ని, శాంతినీ మనలో మనమే వికసింపజేసుకోవడం, మన శక్తి సామర్ధ్యాలతో మనమే ఐశ్వర్యాన్ని సృష్టించి భోగలాలసలో మనమే తేలుతూ ఉంటే ఈ సృష్టికి ఆధారమైన దైవానికి( దేవుడు+ దేవత) సంతోషం.

                  ఇంతటి విశాల విశ్వంలో మనం మనలోనే ఉన్న శాంతి కోసం , ఆనందం కోసం అడ్డమైన గాడిదల్లాంటి తప్పుడు ఙ్ఞానం కలిగిన గురువులు, ఙ్ఞానులు, దేవతలు( ఇలాంటి పేర్లను వీరు , వీరి శిష్యులు అనగా వ్యాపార భాగస్వామి సృష్టించి ప్రచారం చేసేవి) వెంట భిక్షగాళ్ళులాగా వెంట పడడం దైవానికి బాధ కలిగించే అంశం.


కామెంట్‌లు లేవు: