29, మే 2015, శుక్రవారం

కాలము (TIME)



కలుషిత వ్యక్తిత్వాల అధర్మబద్ధమైన జీవన స్థానంలో స్వచ్చమైన, ధర్మబద్దమైన జీవనం నెలకొల్పడానికి సహకరించవలసిన మరొక పదార్ధం "కాలం".

కాలపురుషుడు, ప్రకృతి కూడా కలుషిత వ్యక్తిత్వపు అధర్మ జీవనం ద్వారా కాలాన్ని గతి తప్పించారు. కలుషితం చేసేసారు.

కాలపురుషుడు, ప్రకృతి ధర్మబద్ధమైన జీవనం ప్రారంభించనంత వరకూ సత్యం, ధర్మం తమ అస్థిత్వాలలో నిలబడలేవు. సత్యం, ధర్మం, కాలం అనే మూడు పదార్ధాలు ఒకే యూనిట్ కాబట్టి, ఈ మూడు పదార్ధాలు ఏక కాలంలో ధర్మ బద్ధమైన జీవితాన్ని ప్రారంభించాలి.
వ్యక్తులు ధర్మబద్ధంగా జీవించాలి. సత్యం తెలుసుకోగలగాలి అనే సంకల్ప శక్తి ద్వారా రకరకాలుగా చిద్రమైన కాలాన్ని తన స్వీయ గతిలోనికి తీసుక రాగలరు.

కామెంట్‌లు లేవు: