8, మే 2015, శుక్రవారం

స్వార్ధ పూరిత దృఢ సంకల్పం ఉన్న వారికి స్వాగతం.



               మానవుడు అంటే 50  కేజీలో 100 కేజీలో ఉన్న అల్ప మాంసపు ముద్ద  మాత్రమే కాదు. సమస్త విశ్వాలలో వ్యాపించి ఉన్న ఆత్మ, ప్రకృతుల యొక్క స్వరూపులు, దైవపుత్రులు.

ఒక్కటే అనేకంగా మారలేదు. అనేక వ్యక్తిత్వాలకు ఆధారంగా ఉన్నది దైవం ఒక్కటే!

సొంత వ్యక్తిత్వాన్ని
సొంత ఇంటినీ
సొంత కుటుంబాన్నీ
చేరుకోవాలనే స్వార్ధపూరిత దృఢ సంకల్పం ఒక్కటి ఉంటే చాలు మనం ఉన్నదే దేవుని ఒడిలో అని తెలుసుకోవడానికి.

అపనమ్మకం అనే అసత్య, ఆదర్శ దృష్టిని విడనాడి; తెలుసుకోవడం అనే సత్యం యొక్క ధర్మ నేత్రాలు తెరవండి.
రాబోయే కాలం - ధర్మ బద్ధంగా జీవించాలి అనుకునే వారిదే.

ఎందుకంటే కాలం కూడా కష్ట కాలంలో ఉంది. కాలనాగు, కాలభైరవుడు, కాల యముడు ఇలా ఎందరి చేతుల్లోనో ముక్కలై కాలం స్వీయ అస్థిత్వాన్ని కోల్పోయింది.

ఙ్ఞానం లేని జీవి , దైవాన్నెరుగని జీవి  సృష్టిలో ఒక్కటి కూడా లేదు.  కాస్త విచక్షణతో ఆలోచించడి. నేడు మీ దగ్గర ఉన్న ఙ్ఞానం రెండు రూపాలుగా ఉంది. ఒకటి- మీ వ్యక్తిత్వాన్ని చిద్రం చేసే తప్పుడు ఙ్ఞానం . ఇది బంధం ఫలితంగా జనించింది. రెండవది- మీ వ్యక్తిత్వాన్ని వికసింపజేసే సరియైన ఙ్ఞానం. దీనిని మీకెవరూ నేర్పరు. ఎందుకంటే ఇతరులకు నేపేది తప్పుడు ఙ్ఞానమే. సరియైన ఙ్ఞానము నీలోనే ఉంది. దానిని నీవు మాత్రమే వెలికి తీసి వినియోగించగలవు. దానిని వెలికి తీయడానికి ఇతరుల సహాయం ఖచ్చితంగా తీసుకోకూడదు.

ఎందుకంటే - ప్రతీ వ్యక్తీ స్వీయ ఙ్ఞాబ్నం, ఙ్ఞాపకం అన్నీ కూడా ఆ వ్యక్తి ప్రకృతి మూలంలో నిక్షిప్తం అయి ఉంటాయి.

ప్రకృతి మూలం నుండి ఆ ప్రకృతి యొక్క పురుషుడు మాత్రమే ఆ రహస్యాలను తెలుసుకోగలడు. వేరెవ్వరికైనా అది అసాధ్యం.

సొంత జీవితాన్ని వదిలి, సొంత ఙ్ఞానాన్ని గ్రహించలేని స్థితికి చేరుకున్న మానవుడు, వ్యక్తి బతకడానికి కావలసిన కనీస ఙ్ఞానం కూడా ఇతరుల దగ్గర సంవత్సరాల తరబడి అడుక్కుంటూ , పరీక్షలకు గురవుతున్నాడు. అధర్మం పైన వృద్ధి చెందే ఏ వ్యవస్థ అయినా ముందుగా వ్యక్తులను అడుక్కునే వారిగానో, దానం చేసేవారిగానో చేస్తుంది.


కామెంట్‌లు లేవు: