24, మార్చి 2015, మంగళవారం

మానవ శాస్త్రం HUMONOLOGY
మనిషి గురించి "సంపూర్ణంగా" తెలియజేయడం, మనిషి సమస్యలు వివరించి దానికి పరిష్కారం తెలియజేయడం, భవిష్యత్తులో "సమస్యలు" రాకుండా ఎలా జీవించాలో తెలియజేయడం మానవశాస్త్రపు "లక్ష్యం"

    మనిషి అనగా!

        అణువులోని శాశ్వత సభ్యుల పూర్ణత్వమే మనిషి. మానవుడు, వ్యక్తి వంటివి మనిషికి పర్యాయ పదాలుగా వాడుకుంటున్నాం. అయితే మనిషి, మానవుడు ఒక్కటే గానీ, మనిషి, వ్యక్తీ సమానార్ధకాలు కావు.
        అణువులో మొత్తం ముగ్గురు మగవారు, ముగ్గురు స్త్రీలు, ఉంటారు. ఈ మొత్తం ఆరుగురి సమగ్ర స్వరూపమే "మనిషి" అనగా మనిషి= అణువు. అణువులో లేదా మనిషిలో మొత్తం ఆరుగురు వ్యక్తులు ఉంటారు.

    
ఈ ఆరుగురు వ్యక్తులు మూడు శాశ్వత స్వభావాలనూ, వ్యక్తిత్వాలనూ కలిగి ఉంటారు. స్వభావం అనగా ఎలాక్ట్రాన్, ప్రోటాన్, న్యూట్రాన్‍లని అర్థం.
   
    ఎలక్ట్రాన్ అనేది ప్రకృతి స్వరూపంగా ఉండి భౌతిక దేహాలకు మూలమై, భౌతిక స్వరూపాల ఆధారంగా శక్తిని సృష్టించే మూల పదార్ధంగా ఉంటుంది.
    ప్రోటాన్ అనేది ఆత్మ స్వరూపాధిపతిగా ఉండి బలాన్ని పెంపొందించే సాధనంగా పని చేస్తుంది.
    న్యూట్రాన్ అనేది మనస్సు యొక్క స్వరూపమై మొత్తం యూనిట్ యొక్క సామర్ధ్యంగా ఉండి, శక్తిని సమన్వయం చేసే మూల పదార్ధంగా ఉంటుంది.

            ఆత్మలకు సూర్యుని నుండి
            మనస్సుకు చంద్రుని నుండి
            శరీరానికి భూమి నుండి
            శక్తి సమకూరుతుంది

    స్వభావాలకు మూలం సూర్యుడు, చంద్రుడు, భూమి ( సూర్యుడు = ప్రకృతి+ పురుషుడు; చంద్రుడు = ప్రకృతి+ పురుషుడు; భూమి = ప్రకృతి+ పురుషుడు). వీరికి కూడా ఆత్మ స్వరూపాలు, ప్రకృతి స్వరూపాలుఉంటాయి. వీరూ చావు, పుట్టుక అనే చట్రంలో వ్యక్తులుగా జీవిస్తూ, సమస్త మానవుల అభివృద్ధికి మూలంగా ఉంటారు.

    ప్రతి స్వభావ స్వరూపానికి ఒక ప్రత్యేక వ్యక్తిత్వం (క్యారెక్టర్) ఉంటుంది.
   
    మనుషులందరూ(వ్యక్తులు) ఒకటే అనే భ్రమ బాగా చలామణీలో ఉన్నా, తక్షణం కంటి చూపుతోనే ఈ బేధాన్ని వ్యక్తులు గుర్తించగలిగే గుర్తును ఈ సందర్భంలో తెలియజేస్తాను. వ్యక్తుల చెవి నిర్మాణాన్ని గమనించండి. చెవి పోగులు పెట్టే కింది భాగంలో అతుకుని ఉన్నట్టుండి చిన్నగా కనిపించే చెవులు, వెడల్పుగా కనిపించే చెవులు, మధ్య రకంగా ఉండే చెవులు - మూడు రకాల స్వభావాలను తెలియ జేస్తాయి.

    ఒక వ్యక్తిత్వం ఈ మూడింటిలో ఏదో ఒక స్వభావానికి ప్రతినిధి అయినప్పటికీ, ప్రతి వ్యక్తి దేహం ఈ మూడు స్వభావాలతోనే నిర్మితమై ఉంటుంది. కాబట్టి ప్రతి భౌతిక దేహం కలిగిన వ్యక్తిలో ప్రకృతి, మనస్సు, ఆత్మ అనుసంధానం చేయబడి నిర్మించబడ్దాయి.

    ఈ అంశాన్ని వ్యక్తి దేహంలో సులభంగా గుర్తించే గుర్తులున్నాయి. అవి ఏమంటే - వ్యక్తి చేతి, పాదాల వేళ్ళు.

బొటన వేలు న్యూట్రాన్‍కు, చూపుడు వేలు, నడిమి వేలు ప్రోటాన్‍కు, చివరి రెండు వేళ్ళు ఎలక్ట్రాన్‍కు ప్రతినిధులుగా ఉంటాయి. వ్యక్తి తన యూనిట్ సభ్యుల స్థితిగతులను వేళ్ళు ఉన్న స్థితిని బట్టి అంచనా వేయవచ్చు.

    ఒకే వ్యక్తిత్వం ఉన్న ఆడ, మగ వ్యక్తులు తమ వ్యక్తిత్వపు రెండో సగాన్ని గుర్తించడానికి సులభమైన గుర్తు ఉంది. అది వ్యక్తి యొక్క స్వభావాన్ని గుర్తించే సాధనం : చెవి నిర్మాణంతో పాటు అదనంగా చేయి, పాదాలలో ఉండే రేఖల నిర్మాణం ఒకే వ్యక్తిత్వపు వ్యక్తులకు ఒకేలాగా ఉంటాయి.

    ఉదా:  న్యూట్రాన్ స్వభావం కలిగిన మార్టిన్ అనే వ్యక్తి - ధర్మం అనే వ్యక్తిత్వాన్ని కలిగిన ఆత్మ స్వరూపుడు అనుకుంటే; ధర్మం అనే వ్యక్తిత్వాన్ని కలిగిన న్యూట్రాన్ స్వభావిని అయిన ప్రకృతి స్వభావిని అయిన ప్రకృతి స్వరూపిణి మేరీ అనే అమ్మాయికీ , అంటే ధర్మం వ్యక్తిత్వం కలిగిన  మార్టిన్, మేరి అబ్బాయి, అమ్మాయిలకు మాత్రమే ఒకే రకమైన రేఖలు చేతులలో, పాదాలలో ఉంటాయి. వందల కోట్ల వ్యక్తులలో ఒకే వ్యక్తిత్వం కలిగిన వ్యక్తులకు మాత్రమే ఒకేలాగా రేఖలు ఉంటాయి వారు మాత్రమే MEDE FOR EACH OTHER