30, మార్చి 2015, సోమవారం

భౌతిక ప్రపంచం , ఆత్మిక ప్రపంచం

                  వ్యక్తి, స్వేచ్చ, హక్కులు లాంటి నినాదాలు, ఉద్యమాలు, పోరాటాలు, సిద్ధాంతాలు, అధర్మం యొక్క రూపాలు. అధర్మం యొక్క కుట్ర పూరిత కుతంత్రం తప్ప మరేమీ కాదు.

            దేహ పరమైన, దేహి పరమైన అస్థిత్వాలు రెండింటికీ ఇదే స్థితి గతులు ఉంటాయి. అంటే భౌతిక, అధిభౌతిక అస్థిత్వాలు అన్నమాట.

             భౌతిక ప్రపంచం వేరు, ఆత్మిక ప్రపంచం వేరు, అవి ఒక దానికి ఒకటి భిన్నమైనవి, లేదా ఒక దానికొకటి అతీతమైనవనే అభిప్రాయాలు బాగా చలామణిలో ఉన్నాయి. అది అసత్యం. ఆత్మ, శక్తి, దైవంలాంటివన్నీ ఒకే దేహంలోని భాగాలు మాత్రమే. వీటికి  విడివిడిగా అస్థిత్వాలుగానీ, స్వరూప, స్వభావాలుగానీ లేవు.

                            భౌతికమైన కంటికి కనిపించే సమస్త విశ్వాలకు, అధిభౌతిక నేత్రాలకు మాత్రమే కనిపించే విశ్వాలకు ఆధారంగా ఉన్నది ఒకే వ్యక్తిత్వం. అది "దైవం" అనే వ్యక్తిత్వం. దీనికి కూడా రెండు రూపాలు, అస్థిత్వాలు ఉన్నాయి. దైవం అనే వ్యక్తిత్వం కలిగిన ప్రకృతి+ పురుషుడు( ఆత్మ+ శక్తి, ఆడ+ మగ) దేవత , దేవుడు అనే రెండుగా విడిపోయి రెండు స్థానాలలో ఉంటారు. వీరికి కూడా భౌతిక, అధిభౌతిక దేహాలుంటాయి. వాటికి కూడా జనన మరణాలుంటాయి.

                 రెండు రకాల అస్థిత్వాలను అవిభాజ్యంగా కలిగి ఉన్న విశ్వం యొక్క నిర్మాణ స్వరూప స్వభావాలను పూర్తిగా వివరించడం అనేది ఈ సందర్భంలో అప్రస్తుతం.కనుక మనిషి సమస్త సమస్యల మూలాన్వేషణకు ఈ ప్రాథమిక సమాచారం సరిపోతుంది.

కామెంట్‌లు లేవు: